Jump to content

మనోరమా దేవి

వికీపీడియా నుండి
మనోరమా దేవి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు సురేంద్ర ప్రసాద్ యాదవ్
నియోజకవర్గం బెలగంజ్

పదవీ కాలం
2015 – 2021
నియోజకవర్గం జెహనాబాద్

పదవీ కాలం
2003 – 2009
నియోజకవర్గం అర్వాల్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
జీవిత భాగస్వామి బిందేశ్వరి ప్రసాద్ యాదవ్
సంతానం రాకీ యాదవ్[1]

మనోరమా దేవి బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు బీహార్ శాసనసభ సభ్యురాలిగా పని చేసి 2024లో బెలగంజ్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మనోరమ యాదవ్ 1970లో హజారా సింగ్, కబుతరీ దేవి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ట్రక్ డ్రైవర్ కాగా, తల్లి చిన్న దాబాను నడిపేది. మనోరమ బాలికల ఉన్నత పాఠశాల బారచట్టి నుండి మెట్రిక్యులేషన్, సోబ్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

మనోరమ యాదవ్ 2001లో మోహన్‌పూర్ బ్లాక్‌కు అధ్యక్షురాలిగా, బ్లాక్‌ చీఫ్‌గా ఉన్న సమయంలో 2003లో బీహార్ శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఆర్జేడీ టిక్కెట్‌పై ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి 2003 నుండి 2009 వరకు ఎమ్మెల్సీగా పని చేసింది. మనోరమ యాదవ్ 2015 నుండి 2021 వరకు జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా రెండవసారి పని చేసి 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో అత్రి నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి అజయ్ కుమార్ యాదవ్ చేతిలో 7,931 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

మనోరమ యాదవ్ 2024లో బెలగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో[3] జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి విశ్వనాథ్ కుమార్ సింగ్‌పై 21391 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. మనోరమా దేవి 73,334 ఓట్లను సాధించగా విశ్వనాథ్ కుమార్ సింగ్ 51,943 ఓట్లను సాధించాడు.[4][5][6][7]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (10 May 2016). "JD(U) suspends MLC Manorama Devi after her son is sent to jail". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  2. TV9 Bharatvarsh (14 October 2020). "Bihar Election: ये हैं बिहार चुनाव की सबसे 'दबंग' महिला प्रत्याशी, दौलत जानकर रह जाएंगे हैरान". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Hindu (21 October 2024). "Bihar bypolls: JD(U) fields former MLC Manorama Devi for Belaganj" (in Indian English). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  4. Election Commision of India (23 November 2024). "Belaganj Assembly Constituency By Poll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  5. Deccan Herald (23 November 2024). "Bihar bypolls: JD(U)'s Manorama Devi wins Belaganj seat" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  6. The Times of India (23 November 2024). "Bihar bypolls: JD(U) s Manorama Devi wins Belaganj seat". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  7. The Indian Express (23 November 2024). "UP, Rajasthan, Bihar Bye-Election Results 2024 Highlights: Adityanath hails BJP's victory as party secures 6 seats in UP, 5 in Rajasthan, and triumphs all 4 in Bihar" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.