మన్సూర్ రాణా
క్రికెట్ సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | ||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||
| |||||||||||||||
మూలం: Cricinfo, 2006 మే 3 |
మన్సూర్ రాణా, పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడడంతోపాటు, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 12,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. తరువాత పాకిస్తాన్ క్రికెట్ కోచ్, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజర్‌గా ఉన్నాడు.
జననం
[మార్చు]మన్సూర్ రాణా 1962, డిసెంబరు 27న పాకిస్తాన్ లో జన్మించాడు.[2] రానా మాజీ పాకిస్థాన్ క్రికెట్ అంపైర్ షకూర్ రాణా కుమారుడు, మక్సూద్ రాణా సోదరుడు. అజ్మత్ రాణా ఇతని మేనమామ.[3]
క్రికెట్ రంగం
[మార్చు]ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 205 మ్యాచ్ లలో 317 ఇన్నింగ్స్ లలో 12,026 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 207* కాగా, 25 సెంచరీలు, 71 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 1243 బంతులలో 715 పరుగులు ఇచ్చి, 20 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 3/31.
లిస్టు ఎ క్రికెట్ లో 145 మ్యాచ్ లలో 128 ఇన్నింగ్స్ లలో 3270 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 83 కాగా, 20 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 500 బంతులలో 427 పరుగులు ఇచ్చి, 13 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 2/3.
కోచ్ గా
[మార్చు]క్రికెట్ తరువాత కోచింగ్ ప్రారంభించాడు. ఇతని కోచింగ్‌లో పాకిస్తాన్ అండర్ 19 శ్రీలంకలో 2006లో ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. తరువాత, 2010 ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని గెలుచుకున్న పాకిస్తాన్ మహిళా జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు. 2019 సెప్టెంబరు 16న పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు టీమ్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్ & అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ మేనేజర్‌గా ప్రకటించబడ్డాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Mansoor Rana Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
- ↑ "Mansoor Rana Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
- ↑ Khan, Khalid H. (June 2, 2015). "Former Pakistan cricketer Azmat Rana passes away". DAWN.COM.
- ↑ "Pakistan announces 20 probable players for Sri Lanka series". GEO TV. 16 September 2019. Retrieved 17 September 2019.