Jump to content

మన ఊరు - మన కూరగాయలు పథకం

వికీపీడియా నుండి
మన ఊరు - మన కూరగాయలు
ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపన2014, ఆగస్టు 6
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

మన ఊరు - మన కూరగాయలు పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. హైదరాబాదు నగర ప్రజలకు తక్కువ ధరకు కూరగాయలు అందించడం, రైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది. ఈ విధానంతో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా సరసమైన ధరలకు వినియోగదారులకు విక్రయించుకోవచ్చు. కూరగాయల ధరలు నిలకడగా ఉండడంతో అంతిమంగా పట్టణ ప్రజలకు మేలు జరుగుతుంది.[1]

ప్రారంభం

[మార్చు]

2014, ఆగస్టు 6న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని ప్రారంభించాడు.[2]

పథకం అమలు

[మార్చు]

ఒక్కో మండలంలో 100 హెక్టార్ల చొప్పున 200హెక్టార్లలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడంకోసం ఒక్కో హెక్టారుకు లక్షల రూపాయలతో 500 మంది రైతులకు సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ పరికారాలు, ట్రేలు సమకూర్చడంతోపాటు రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేశారు.[3]

గ్రామాల ఎంపిక

[మార్చు]

వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తొలిదశలో నగరానికి 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల లోపు ఉండేలా రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి 35 గ్రామాలను ఎంపిక చేసి 10 క్లస్టర్లుగా విభజించింది. ప్రతి క్లస్టర్‌లో మూడు నుండి నాలుగు గ్రామాలున్నాయి. మూడు జిల్లాల నుంచి 1900 మంది రైతులను ఎంపిక చేసింది. ప్రతి క్లస్టర్ నుండి ప్రతిరోజూ 3 టన్నుల కూరగాయల సరఫరా జరుగుతోంది.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "మన ఊరు-మన కూరగాయలు | యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ ప్రభుత్వం". yadadri.telangana.gov.in. Archived from the original on 2021-07-30. Retrieved 2023-06-07.
  2. "More Villages to Supply Vegetables to City". The New Indian Express. 2014-09-15. Archived from the original on 2020-11-24. Retrieved 2023-06-07.
  3. Nipuna. "తెలంగాణ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగం". Archived from the original on 2022-06-07. Retrieved 2023-06-07.
  4. "Department of Agricultural Marketing, Govt. of Telangana". tsmarketing.in. Archived from the original on 2016-11-01. Retrieved 2023-06-07.