మరణానంతర కర్మలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిందు మతంలో ఎవరైనా మరణిస్తే తర్వాత చేసె ఖర్మలు లేదా కార్యక్రమాలు ఆ యా ప్రాంతాన్ని బట్టి లేదా కులాన్ని బట్టి చిన్న మార్పులు తప్ప సధారణంగా ప్రధాన కార్యక్రమాలు ఒకే విధంగా వుంటాయి. మరణించిన వ్వక్తి బాలుడా, పెద్ద వాడా, పెళ్ళి అయిందా లేదా, స్త్రీ యా పురుషుడా, స్త్రీ అయితే విధవ రాలా పుణ్య స్త్రీ యా అనె దాన్ని బట్టి కొన్ని పద్ధతులలో మార్పులుంటాయి. ఇందులో భూమిలో గొయ్యి తీసి పూడ్చి పెట్టడము లేక కాల్చడము ఈ రెండు పద్ధతులు వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం ఒక పల్లెటూర్లో ఒక పుణ్య స్త్రీ మరణించిన తర్వాత భూమిలో గొయ్యి తీసి పూడ్చి పెట్టె పద్ధతి ఎలా వుంటుంది? తర్వాత జరిగే కార్యక్రమాలెలా వుంటాయి. ...........క్లుప్తంగా......

మరణానంతరం శవాన్ని పడుకో బెట్టే పాడె.

ముందుగా....... మరణించిన వ్వక్తిని భూమిపై పడుకోబెట్టి ముక్కు రంద్రాలలో ప్రత్తి పెట్టి, నోట్లో బియ్యం పోసి, నోరు, కనులు మూస్తారు. ఆతర్వాత రెండు చేతుల బొటన వ్రేళ్లు, రెండు కాళ్ల బొటన వేళ్లు ఒకటి కట్టు తారు. తల వద్ద కొన్ని బియ్యం పోసి అందులో ప్రమిద దీపంపెడతారు. ఇంటి ముందు కొన్ని కర్ర దుంగలను వేసి మంట పెడతారు. ఆ మంట కాలుతూనె వుంటాయి. బంధువులకు కబురు పెడతారు. మరణం తెల్లవారి సంబవిస్తే సాయింత్రం, సాయింత్రం మరణిస్తే ఆ మరుదినం కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆ ఇంట్లో వంట చేయరు, నిద్ర పోరు. పల్లెటూర్లలో ఆ ఇంటి వారి భోజన వసతులు ఇతర కుటుంబాల వారు చూసు కుంటారు. మరణించిన సమయం మంచిది కాక పోతె కొన్ని శాంతి కార్యక్రమాలు చేస్తారు. మరణించిన ఆ ఇల్లు గాని, గది గాని మూడు నెలల పాటు మూసి వేస్తారు. బంధువులంతా వచ్చాక ...... శవానికి సుగంద ద్రవ్వాలను చల్లి దూపం వేసి వుంచు తారు. ఇప్పుడు మరణించినది పుణ్య స్త్రీ గనుక..... శవానికి పసుపు, కుంకుమ, పూలు అలంకరిస్తారు. చూడ వచ్చిన వారు తమ దుఖాన్ని వెలుబుచ్చుతారు. బయట మాల వారు ఒక పొడవాటి వెదురును తెచ్చి సుమారు ఏడడుగుల పొడవున్న రెండు ముక్కలను చేసి. మరొక చిన్న ముక్కను చీల్చి బద్దలు చేసి, ఈ బద్దలతో ఆరెండు వెదుర్లను సుమారు రెండడుగుల దూరంలో వుంచి మధ్యలో బద్దలను వేసి దారాలతొ గట్టిగా కట్టి దానిపై కొంత మందం గడ్డిని పరచి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరుస్తారు. దానిని పాడె అంటారు. ఆ ప్రక్కనే పలకలు (డప్పులు) కొడుతుంటారు. కొందరు మేళ తాళాలు కూడా ఏర్పాటు చేస్తారు. వారు వేసె దరువు మరో విధంగా వుంటుంది. దాని చావు దరువు అంటారు. పలకల దరువుకు అనుగుణంగా ఒకరు కొన్ని పదాలను పాడు తుంటారు. ఇంతలో ఇద్దరు వ్వక్తులు వెళ్లి పార గడ్డ పార తీసుకొని ఎక్కడ గొయ్యి తీయాలో ఇంటి వారిని అడిగి అక్కడికి వెళ్లి సుమారు ఏడడుగులు పొడవు, రెండు, మూడడుగుల వెడల్పు, మూడడుగులు లోతు వుండేటట్లు ఒక గొయ్యి తీసి సిద్దంగా వుంచు తారు. (పల్లెల్లోని రైతులు చనిపోయిన తమ వారి నందరిని తమ సొంత పొలాల్లోనె పూడ్చి పెడతారు.) పద్ధతి ప్రకారం ఆ స్త్రీ పెద్ద కొడుకు ఆమెకు తల కొరివి పెట్టాలి. (పూడ్చి పెట్టే పద్ధతిలో కూడా తల కొరివి పెట్టడమనే అంటారు.) అతను ఒక కుండలోతెచ్చిన నీళ్లను బయట మూడు రాళ్లు పెట్టి దానిపై నీళ్లను కాగబెడతారు. ఆ నీళ్లు కాగు తుండగానె, ఆ ప్రక్కనె మరోపొయ్యి రాజేసి ఒక కొత్త కుండను తెచ్చి అందులో మూడు చార్ల బియ్యం వేసి ప్రక్కనున్న కుండలోని నీళ్లను పోసి, ఆపొయ్యి లోని నిప్పులను తీసి చిన్న పొయ్యిలో వేసి మంట పెడతారు. అందులోని బియ్యం ముద్ద ముద్దగా ఉడికి అన్నం తయారవుతుంది. ఇప్పుడు శవానికి వేడి నీళ్లతొ స్నానం చేయిస్తారు. అన్నం వండిన సట్టిని అన్నంతో సహా త్రిభుజాకారంలో వెదురు బద్దలలతో చేసిన దానిపై ఆ సట్టిని పెట్టి మూడు మూలలో మూడు దారాలు కట్టిన ఒక ఉట్టిలాంటి దానిలో పెట్టి సట్టి పై మూత పెట్టి ఆమూతలో కొన్ని పిడకలు వేసి దానిలో కొన్ని నిప్పులు వేసి సిద్దంగా వుంచుతారు దాన్ని కుమ్మి సట్టి అంటారు. పాడెపై ఎర్రటి బట్టను కప్పి పూలు, పసుపు, కుంకుంతో అలంకరించి శవాన్ని పాడెపై పడుకోబెట్టి దూప దీపం సమర్పిస్తారు. శవానికి కప్పి వున్న బట్టలో ఒక కొసన పసుపు కుంకుమ, ఇతర వస్తువులు మూటలాగ కట్టి పెడతారు. అయిన వాళ్లందరు దూపం వేసింతర్వాత ఇక శవ యాత్రకు మంచి సమయం చూసుకొని అనగా రాహు కాలం, యమ గండం వంటివి లేకుండా చూసు కొని బయలు దేరుతారు.

బ్రాహ్మణులు చేసే కర్మ కాండలు‌ ఇలా‌ ఉండవు. వారు‌ పార్థివ శరీరాన్ని కట్టెలతో కాలుస్తారు. ధర్మ శాస్త్రం ప్రకారం మంత్ర పూర్వకంగా 12 రోజులు కర్మ కాండల్ని ఇంటికి పెద్ద కొడుకు చేత నిర్వర్తిస్తారు. వీరికి ప్రత్యేక బ్రాహ్మణులు , భోక్తలు ఈ కర్మ కాండల్ని నిర్వహిస్తారు.

శవ యాత్ర:[మార్చు]

శవానికి చేసిన అలంకరణ, దూపదీప నైవేద్యం సమర్పించడము

నలుగురు వ్వక్తులు పాడెను ఎత్తి తమ భుజాలపై పెట్టుకొని నడువగా ముందుగా తలకొరివి పెట్టే వ్వక్తి కుమ్మి సట్టిని ఒక చేత్తో పెట్టుకొని ఇంకొక చేత్తో ఒక కాగడాను పట్టుకొని ముందు నడుస్తుంటే అంతకు ముందే బాజా బజంత్రీలు నడువగా వారి కన్నా ముందు మందు గుండు సామాగ్రి కాలుస్తుంటారు. గతంలో శవానికి ముందు గుంటిపోగులను కాల్చేవారు. (గుంటి పోగు) ఆనగా.... ఒక బారెడు వెదురు కర్రకు కొసన ఒక బలమైన ఇనుప గొట్టాన్ని బిగించి వుంటారు. ఆ గొట్టంలో నల్లమందు నింపి గొట్టానికి క్రింద భాగంలో వున్న చిన్న రంధ్రంలో వత్తి వుంచి గొట్టానికి పై భాగాన ఒక జానెడు కర్ర ముక్కకు గట్టిగా బిగ గొట్టి వత్తికి నిప్పు పెట్టి తుపాకి లాగ పట్టుకొని ఆకాశం వైపు చూపిస్తాడు. అది పెద్ద శబ్దంతో పేలి పైన బిగించిన కర్ర ముక్క ఆకాశంలోకి వెళ్లి పోతుంది. ఆ విధంగా శవ యాత్ర సాగినంత దూరం గుంటి పోగులను కాలుస్తూనె వుంటాడు. అదే విదంగా ఆ వూరి చాకలి దీవిటి పట్టుకొని శవ యాత్రలో ముందు బాగాన వుంటాడు. అది పగలైనా సరే దీవిటి వుండాల్సిందే. శవానికి కుడి ప్రక్కన ఒక వ్వక్తి నడుస్తూ తన వద్ద వున్న పళ్లెంలోని బొరుగులు.... చిల్లర డబ్బులు మొదలగునవి శవానికి ఎడం వైపుకు దాట వేస్తుంటాడు. శవాన్ని మోస్తున్న వారు శవానికి అలంకరించిన పూల దండలను తుంచి పూలను క్రింది జార విడుస్తుంటారు. మధ్య మధ్యలో శవాన్ని మోస్తున్న వారు భుజాలు మార్చు కుంటారు. ఊరి పొలి మేర దాటిం తర్వాత ఒక చోట ఒక పాత చాటను శవానికి పై నుంచి అవతలికి దాట వేసి కొంత దూరం వెళ్లిన తర్వాత శవాన్ని దించు తారు. దానిని దింపుడు గాలం అంటారు. అక్కడ శవం చెవిలో అమె పేరు గాని "గోవింద గోవింద" అని గాని, "నారయణ నారాయణ" అని గాని మూడు సార్లు పిలుస్తారు. అక్కడ తిరిగి శవానికి దూపం వేసి కర్పూరం వెలిగించి కొబ్బరి కాయ కొట్తారు. (దింపుడు గాలం:.... వివరణ) ఒక వ్వక్తి నిజంతా మరణించాడా లేదా అని శాస్త్రీయంగా నిర్ధారించు కునె వెసులు బాటు గతంలో వుండేది కాదు. ఆ వ్వక్తి నిజంగా మరణించక వుండి వుంటే ఈ దింపుడు గాలం ప్రక్రియలో మేల్కొని పైకి లేచిన సందర్భాలున్నాయి. అందు చేత ఈ దింపుడు గాలం వద్ద శవాన్ని పేరు పెట్టి పిలిచి లేపు తారు.) ఆ తర్వాత శవ యాత్ర యదావిదిగా కొనసాగుతుంది. చివరకు గొయ్యి తీసిన ప్రదేశానికి చేరు కుంటారు. అక్కడ ఆ గుంత చుట్టు మూడు సార్లు ప్రదిక్షణం చేసి కుమ్మి సట్టిని దక్షణ దిక్కున పడేసి శవాన్ని భుజాలనుండి దించి అటు ఇటు మూడు సార్లు ఊపి గుంత లోనుంచి తీసిన మట్టి కుప్పపై పెడతారు. గుంతలో కొబ్బరి ఆకులు గాని, మామిడి ఆకులు గాని, సిరిగందం ఆకులు గాని ఒక వరుస పేర్చి దానిపై. ఉప్పు, పప్పు మొదలగునవి చల్లి నీళ్లు కూడా చల్లు తారు. ఈతతంగం జరుగుతుండగా... శవం పైనున్న బంగారు ఆభరణాలను ఆమె భర్తతొ తీయిస్తారు. మంగళ సూత్రం తీసిన వెంటనే మరొక నకిలి మంగళ సూత్రాన్ని ఆమె భర్తతో కట్టిస్తారు. తర్వాత శవానికి కట్టిన కట్లు అన్నింటిని కత్తితో తెగ గొట్టి నలుగురు వ్వక్తులు పాడితో సహా పైకి లేపి పట్టుకోగా గుంతలో నిలబడిన వ్వక్తులు శవాన్ని గుంతలోనికి దించు కొని అక్కడ దక్షిణ దిక్కున తల ఉత్తర దిక్కున కాళ్లు వుండేటట్లు పడుకో బెట్టుతారు. ఈ సాంప్రదాయం సర్వత్రా వ్వాప్తిలో వున్నదే తిరుపతిలో తప్ప. తిరుపతిలో శవాన్ని కాష్టంమీద గాని, గుంతలో గాని పడుకో బెట్టేటప్పుడు ఉత్తర దిక్కున తల, దక్షణ దిక్కున కాళ్లు వుండేటట్లు పడుకో బెడుతారు. కారణమేమంటే.... తిరుపతికి ఉత్తర దిక్కున శ్రీనివాసుడు కొలువై వుండే సప్త గిరులున్నాయి. వాటికెదురుగా కాళ్లు పెట్టకూడదనే నియమం ప్రకారం అలా చేస్తారు. శవానికున్న ముడులు ఏమైనా వుంటే వాటిని కత్తితో కోసేస్తారు. శవంపై ఎలాంటి ముడులు వున్నా.... అవి జీవుడు పరలోక ప్రాప్తికి అడ్డంకాలను కలిగిస్తాయని నమ్మకం. శవంపైన కప్పిన బట్ట కొంగులో రెండు జానల మేర కత్తితో కోసి తీసుకుంటారు. ఇంత వరకు శవం ముఖం పై ముసుగు వుండదు. ఇప్పుడు ముఖంపై అక్కడున్న బట్టతోనె ముసుగు వేస్తారు. పాడెకున్న రెండు పెద్ద కర్రలలో ఒకదాన్ని రెండుగా చేసి శవానికి అటు ఇటు పెడతారు. అక్కడ మిగిలిన కర్రలను, దారాలను, గడ్డిని శవంపై పరుస్తారు. ఇప్పుడు శవంపై పప్పులు, ఉప్పు, నవదాన్యాలు పోసి, అక్కడ వున్న బందు వర్గం అంతా శవం పై... పక్కనున్న మట్టిని పోస్తారు. అలా గుంతను పూర్తిగా పూడుస్తారు. ఇంతవరకు శవంపై వుండిన ఫులమాలలను ఆగుంత పై అలంకరిస్తారు. శవం పై కప్పిన గుడ్డనుండి తీసిన గుడ్డముక్కలో పెద్ద భాగాన్ని తీసుకొని అక్కడ వున్న మరొక పాడె కర్రకు కట్టి గుంతకు కుడి పక్కనుండి ఎడం ప్రక్కకు దాట వేస్తారు. అదే విదంగా గుంత త్రవ్విన పార, గడ్డ పారలను కూడా తిరగేసి గుంతకు ఎడంవైపుకు దాట వేస్తారు. మిగిలిన ఆగుడ్డ ముక్కను చివరలు విడిపోకుండా మధ్యలో చింపి తలకొరివి పెట్టే వ్వక్తికి జందెంలాగ వేసి (దీన్ని బద్దె అంటారు.) ప్రక్కనున్న బావి, లేదా చెరువులో స్నానంచేసి ఒక కొత్తకుండలో నిండా నీళ్లు తెమ్మంటారు. ఇంతలో గుంతపై పూల అలంకారం పూర్తవుతుంది. అతను నీళ్ల కుండ భుజాన పెట్టుకొని, మరొక చేత్తో ఒక మండుతున్న కొరివిని పట్టుకొని గుంత చుట్టూ మూడు ప్రధక్షిణాలు చేయిస్తారు. తల భాగం వద్ది ఒక వ్వక్తి కత్తి తీసుకొని దాని మొనతో కుండ నిండా నీళ్లతో ప్రదిక్షిణం చేస్తుంటె ఆకుండకు ప్రతి చుట్టుకు ఒక చిన్న రంధ్రం చేస్తాడు. అందులోని నీరు దారగా కింద పడతాయి. మూడో ప్రధిక్షిణం పూర్తవగానె అతను ఆకుండను, కొరివిని అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడ కుండా అటే వెళ్లి పోతాడు. ఇంత వరకు కుండకు రంద్రాలు చేసిన వ్వక్తి పగిలిన ఆకుండ పెంకులను చాల చిన్న ముక్కలుగా పగుల గొడతాడు. ఎంత చిన్నవిగా నంటే ఆ పెంకులలో ఒక చుక్క నీరు కూడా నిలవకూడదు. అలా ఆ పెంకులలో నిలవ వున్న నీటిని ఏవైనా పక్షులు తాగితె.... చాల అరిష్టమని భావిస్తారు. ఆనీటిని తాగిన పిట్ట ఏ చెట్టుపై వాలినా ఆచెట్టు కాయలు సరిగా కాయవని, కాసినా వంకర టింకర కాయలు కాస్తాయని నమ్ముతారు. ఖర్మ కాండలు ఏరోజున జరిగేది నిర్ణయించి ఆ సంగతి పలకలు కొట్టే వారి చేత [[[దండోర]] వేయిస్తారు. సాధారణంగా మరణించిన తొమ్మిదోరోజున ఆ కార్యక్రమం పెట్టు కుంటారు.

అంటు: ఖర్మ కాండలు తీరు నంతవరకు ఆ ఇంటి వారికి వారి పాలె వాళ్లకు అంటు వుంటుంది. ఆ రోజులలో ఎవరి ఇంట్లోను శుభ కార్యాలు చేయరాదు. పాలె వాళ్లు అంటే అదే ఇంటి పేరున్న వారి బంధువులు. ఈ అంటు చావు సందర్భంలోనె గాకుండా... ఎవరి ఇంట్లో నైనా అమ్మవారు అనగా small fox, chicken fox మొదలైన్ వ్వాదులు వస్తే ఆ ఇంటికి అంటు వుంటుంది. ఆ ఇంటికి ఎవరు రాకూడడు, ఆ ఇంటి వారు కూడా ఎవరి ఇంటికి రాకూడదు. ఆ ఇంటి ముందు బూడిదతో ఒక అడ్డ పట్టి వేసి వుంటుంది. దానిని చూసి ఆ ఇంటికి అంటు వున్నదని బిచ్చ గాళ్లు కూడా రారు. తెలియక ఆ ఇంటికి వచ్చి వ్వాది బారిన పడకూడదనే ఆ నిబందన.

పాలు పోయడం[మార్చు]

మరుదినం పాలు పోయాలి. ఆ రోజు శని వారం అయితే పాలు పోయకూడదు. అలా పోస్తే దాన్ని శని పాలు అంటారు. దానికి ప్రత్యామ్నంగా ఆ రోజు ఎవరు చూడకుండా తెల్లవారకముందే వెళ్లి పాలు పోసి వస్తారు. దానిని దొంగ పాలు అంటారు.

దివసాలు:[మార్చు]

కాకులకు పిండంపెట్టి కాకులకొరకు ఎదురు చూస్తున్న వ్వక్తి.. 9 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది

పాలు పోసి ఇంటికొచ్చిన తర్వాత ఒక పెద్ద పళ్లెం తీసుకొని దాని నిండా ఇసుక పోసి అందులో నవ దాన్యాలు పొసి ఒక ప్రక్కన ఒక ఇటుకను పెట్టి దానికి కుంకుం బొట్టలు పెట్టి పూజకు సిద్దంగా వుంచాలి. దానిని ఇంట్లో ఒక ప్రక్కన పెట్టి దాని చుట్టు కొత్త బట్టలు, పండ్లు, పూజ ద్రవ్వాలు సిద్దంగా వుంచాలి. తల కొరివి పెట్టిన వ్వక్తి ఉపవాస ముండి మెడలో బద్దె ధరించి (జందెం లాగ) తల స్నానం చేసి ఆ పళ్లెం ముందు దూప దీప నైవేద్యాలు సమర్పించి అక్క డ అనేక వంటలతో తళిగ వేసి పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి వేరొక విస్తరిలో తళిగ లోని పదార్తాలన్నింటి లోని కొంత తీసి మారొక విస్తరిలో వేసి బయటకు వెళ్లి దానిని కాకులకు పెట్టాలి. దానిని పిండం అంటారు. ఆ పిండాన్ని కాకులు ముట్టాక అతను ఇంట్లోకి వచ్చి తళిగలోని మిగిలిన పదార్థాలను తిని ఉపవాసం విరమించాలి. అప్పుడే..... వచ్చిన బందు మిత్రులు బోజనాలు చేస్తారు. ఆ తొమ్మిది రోజులు ఈవిధంగా తప్పనిసరిగా చేయాలి. ఈ తొమ్మిది రోజులు అతను ఎవరి గడప తొక్కకూడదు. అనగా ఎవరి ఇంటికి వెళ్లకూడదు. ఈ తళిగ వేసె కార్యక్రమం...... దగ్గిర బంధువులు ఒక్కొక్కరు ఒక్క రోజున వేస్తారు. వారు తమ ఇళ్లవద్ద వంటలు తయారు చేసుకొని రావచ్చు., లేదా వీరింటికి అన్ని సామానులు తెచ్చి ఇక్కడే వంటలు చేసి తళిగ వేయ వచ్చు. ఇలా ప్రతి రోజు కార్యక్రమం వుంటుంది. తొమ్మిదో రోజు పెద్ద కార్యక్రమం జరుగుతుంది.

తొమ్మిదోరోజు:[మార్చు]

దివసాలు సందర్భంగా కాకులకు పెండం పెట్టి కాకుల కొరకు ఎదురుచూస్తున్న వ్వక్తి

తొమ్మిదో రోజున విశేష కార్యక్రమం వుంటుంది. ఈ తొమ్మిది రోజులు జరిగి నట్టుగానె యదావిదిగా తళిగ వేసి.... దానితో పాటు మరో మూడు తళిగలు వేసి వాటన్నింటిని అరటి ఆకులలో కట్టి ఒక గంపలో పెట్టుకొని ఒక బిందెడు పాలను తీసుకొని శవాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశానికి వెళ్లాలి. ఈ రోజు తళిగలో విశేషంగా ఎక్కువగా పిండి వంటలుంటాయి. ముఖ్యంగా చనిపోయిన వ్వక్తి ఇష్ట పడే ఆహార పదార్థాలు తప్పని సరిగా వుండాలి. ఇవన్ని తీసుకొని గుంత వద్దకు వెళ్లి అక్కడ గుంతకు తూర్పువైపున మూడు చిన్నరాళ్లను కడిగి పెట్టి వాటికి కుంకుంబొట్లు పెట్టాలి. ఇంటి నుండి తెచ్చిన మూడు తళిగలను అక్కడ పెట్టి దూప దీప నైవేద్యాలు సమర్పించి, కొబ్బరికాయ కొట్టి పూజ చేయాలి. పూజానంతరము ఆ మూడు తళిగలలోని పదార్థాలను కొంత తీసి వేరొక విస్తరిలో వేసి దానిని కాకులకు పిండం పెట్టి తిరిగి వచ్చి గుంతకు తల భాగాన ఒక చిన్న గొయ్యి తీసి అందులో తులసి మొక్కను నాటి దాని మొదట్లో ఇంటి వద్దనుండి తెచ్చిన పాలను అందరు పోయాలి. తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో వున్న శలకు పూజ చేయాలి. అప్పటికి అయ్యవారు, అమ్మావారు వచ్చి వుంటారు. అయ్యవారు ఈ కార్యక్రమానికి అనేక పూజా ద్రవ్వాలు, ఇతర వస్తువులు చెప్పి వుంటాడు. అవన్ని సిద్దంచేసుకొని తళిగలు, ఇంతవరకు పూజలందుకున్న నవదాన్యాలు పోసిన పళ్లెం, బియ్యం, అనేక రకాల కూరగాయలు, కలశానికి మూడు చెంబులు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి మొదలగువాటిని మూడు గంపలలో సిద్దం చేసుకొని ఊరి బయట తోటలో నీటి సదుపాయమున్న చోటుకి బాజబజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లాలి. ఇక్కడ ఒక ప్రక్క తలకొరివి పెట్టిన వ్వక్తి చేత అయ్యవారు వివిధ పూజలు చేయిస్తాడు.

మొదట అయ్యవారు మత్రించిన ఒక దర్బ ముక్కను అతని బొడ్లో చెక్కి మంగలి వద్దకు వెళ్లి క్షవరం చేయించుక రమ్మంటాడు. అప్పటికే సిద్దంగా వున్న మంగలి క్షవరంచేయగా స్నానంచేసి వచ్చి ఒక ప్రక్కన మూడు తళిగలు వేస్తారు. అక్కడ స్థాపించిన మూడు చిన్నరాళ్లకు స్నానం చేయించి బొట్లు పెట్టి వాటి ముందు మూడు తళిగలు వేయాలి. దాని ప్రక్కన నవదాన్యాలు పోసిన పాత్రను పెట్టి పూజ చేయాలి. ఈ నవదాన్యాలు ఈ రోజుకు జానెడు పైగా పెరిగి వుంటాయి. పూజానంతరము ఆ నవదాన్యాలు మొలకెత్తిన పాత్రను నెత్తిన పెట్టుకొని ఒక బావి

దివసాల సందర్భంగా ఇంట్లో దూపం సమర్పిస్తున్న వ్వక్తి

వద్దకు వెళ్లి నెత్తి మీద నుండి వెనక్కి బావిలో వేసి తిరిగి స్నానం చేసి రావాలి. అక్కడ స్థాపించిన మూడు శిలలకు తిరిగి పూజ చేసి హారతి ఇచ్చి... ఆమూడు తళిగలోని కొంత పదార్థాలను ఒక విస్తరిలోకి తీసుకొని వెళ్లి కాకులకు పిండం పెట్టి రావాలి. ఆ మూడు తళిగలలో మిగిలి వున్న పదార్తాలను చాకలి తీసుకుంటాడు. ఇంతవరకు జరిగిన పూజ, దూప దీప నైవేద్యాలు..... తలకొరివి పెట్టిన వ్వక్తి వారి బందు వర్గం మాత్రమే చేస్తారు. అయ్యవారి ప్రమేయం అంతగా వుండదు. దీని తర్వాత అసలు కార్యక్రమం అయ్యవారి ముందు జరుగు తుంది. ఇప్పుడు అక్కడ పెట్టి పూజ చేసిన మూడు శిలలను ఒక పళ్లెంలో నెత్తిన పెట్టుకొని బావి వద్దకు వెళ్లి తలమీద నుండి వెనక్కి బావిలో పడేట్లు ఆ శిలలను విసిరి వేయాలి/

అప్పటికి అయ్యవారు మూడు కలశాలు ఇతర పూజాద్రవ్వాలను సిద్దంచేసి వుంటాడు. తలకొరివి పెట్టిన వ్వక్తి అయ్యవారి వద్ద కూర్చోగానె అతనికి దర్బలతో చేసి మంత్రించిన వుంగరాన్ని చేతికి తొడుగు తాడు. ఆ తర్వాత ఆకు పూజ, కలశ పూజ చేసి తాత ముత్తాల నామ గోత్రాలసహా అడిగి వారిపేరున పిండ ప్రధానం చేయిస్తాడు. ఇక్కడ అయ్యవారు పిండ ప్రధానం చేస్తుంటే బందు మిత్రులు కేవలం మగవారు మాత్రమే వుంటారు. చివరకు తీర్త ప్రసాదాలిచ్చి అతని ఉప వాస దీక్షను విరమింప జేస్తాడు. ఆ తర్వాత మంత్రించిన జలాన్ని వారి పాలె వాళ్ల నెత్తిన చల్లుతాడు. దాన్ని పుణ్యాదానం అంటారు. దాంతో అప్పటివరకు వారికున్న అంటు వదిలి పోతుంది. ఆ తర్వాత అయ్యవారు ఇంటికి వచ్చి మంత్ర జలంతో ఇంటిని కూడా శుద్ధి చేస్తాడు. అయ్యవారి ముందు ఈ పూజా విధానం జరుగు తుండగా...... అక్కడే మరొక పక్క అమ్మవారిని బాజాబజంత్రీల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి కూర్చోబెట్టిన అమ్మవారికి పూజాదికాలు జరుగు తుంటాయి. ప్రతి ముత్తైదువ అమ్మవారికి, పసుపు, గందం రాసి, బొట్టు పెట్టి, సంభావన ఇచ్చి, అమ్మవారి చేత ఆశీర్వాదం పొందుతారు. ఇక్కడ కేవళం స్త్రీలు మాత్రమే వుంటారు. ఈ కార్యక్రమం తర్వాత అయ్యవారికి అమ్మవారికి గృహస్తు స్తోమత మేరకు దానం, సంభావన ఇచ్చి సాగనంపాలి. ఇంత లోపల ఊరి వారందరికి, విచ్చేసిన బందు మిత్రులకు బోజానాదులు తయారై వుంటాయి. వారు భోజనం చేసి గృహస్తునకు చెప్ప కుండా వెళ్లాలి. వచ్చిన వారందరికి ఏదైనా ఒక పాత్రను చనిపోయిన వారికి గుర్తుగా ఇవ్వడం ఆనవాయితీ. అలా ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమం చాల ఖర్చుతో కూడు కున్న వ్యవహారము. ఒక పెళ్ళి కయినంత ఖర్చు అవుతుంది. పెళ్ళిలో బంగారు వస్తువులు, బట్టలు వంటివి కొంటారు. ఆ ఒక్కటి మినహా మిగతా అంతా భోజనాలు, ఇతర ఖర్చులు పెళ్ళిలో లాగానె వుంటాయి. పుణ్య స్త్రీ .... అనగా భర్త బ్రతికి వుండగా మరణించిన స్త్రీ... అయితే... జరిగే కార్యక్రమాలు, పద్ధతులు, చాల ఎక్కువగా వుంటాయి. మిగిలిన వారికి ఇన్ని పద్ధతులుండవు. ఇతరులకు అమ్మావారు రారు. (ఇక్కడ అయ్య వారు.... అనగా ఆపూరికి సంబంధించిన బ్రాంహనుడు. అమ్మవారు అనగా ఆ బ్రాంహణుని భార్య.) ఈ పూజారులు, \బ్రాంహణులు, \పంతుళ్లు గతంలో కొన్ని పల్లెలకు కలిపి ఒకే పంతులు వుండే వారు. వారు తప్ప వేరెవ్వరు అతని ఇలాకలో శుభ, కార్యాలకు గాని, అసుభ కార్యాలకు గాని రాకూడదు. అది ఒక నిబందన. ప్రస్తుతం ఆ నిబందన పూర్తిగా పోలేదు గాని కొంత సడలింపు వున్నట్టుంది. ఆసాములు తమ అవసరము కొరకు వేరెవ్వరిని పిలిపించు కొనినా అసలు పంతుళ్లు మాట్లాడడం లేదు. ఆ విధంగా పిలిపించు కొని సుధూర ప్రాంతాలకు కూడా ఈ అయ్యవార్లు వెళుతున్నారు. దీనికి కారణం ..... ఒకే సమయాని పంతుళ్లతో జరగ వలసిన రెండు మూడు కార్యక్రమాలు ఒక్కరే జరిపించ లేరు కదా.... కనుక ఆసాములు మరొక్కరిని వెతుక్కుంటున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]