Jump to content

మరవంతే

అక్షాంశ రేఖాంశాలు: 13°42′18″N 74°38′31″E / 13.705°N 74.642°E / 13.705; 74.642
వికీపీడియా నుండి
మరవంతే
గ్రామం
మరవంతే బీచ్
మరవంతే బీచ్
మరవంతే is located in Karnataka
మరవంతే
మరవంతే
కర్ణాటక లోని మరవంతే
మరవంతే is located in India
మరవంతే
మరవంతే
మరవంతే (India)
Coordinates: 13°42′18″N 74°38′31″E / 13.705°N 74.642°E / 13.705; 74.642
దేశంభారతదేశం  India
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉడిపి
తాలూకాబైందూర్
భాషలు
 • అధికారిక భాషలుకన్నడ
Time zoneUTC+5:30 (IST)
PIN
576224

మరవంతే భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, ఉడిపి జిల్లా, బైందూర్ తాలూకాలోని గ్రామం.[1]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

ఈ ప్రాంతంలోని మత్స్యకారులకు చేపలు పట్టడం ప్రధాన కార్యకలాపం.[2] చేపల వేటకు స్థానిక పడవలు, చిన్న డీజిల్ ట్రాలర్‌లను ఉపయోగిస్తారు. ఇక్కడ వర్షాకాలంలో సముద్రయానాన్ని అనుమతించరు.ఇక్కడ కొబ్బరి, వరి ప్రధాన పంటలు.

విద్య

[మార్చు]

గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం సమీపంలోని కుందాపుర తాలూకా కేంద్రానికి వెళతారు.

మరవంతే బీచ్

[మార్చు]

ఇది పారిశ్రామిక కేంద్రమైన మంగళూరు నుండి 115 కి.మీ, ఉడిపి నుండి 55 కి.మీ, కుందాపుర నుండి 18 కి.మీ, బైందూర్ నుండి 21 కి.మీ. దూరంలో ఉంది. ఎన్హెచ్ -66 (పూర్వపు NH-17) హైవేకి ఒకవైపు మరవంతే బీచ్, మరొక వైపున వైపున సౌపర్ణికా నది ప్రవహిస్తుంది.[3] ఇది కర్ణాటకలోని అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటి.[4] దాదాపు ఇక్కడ అరేబియా సముద్రాన్ని తాకే సౌపర్ణికా నది, యు-టర్న్ తిరిగి, దాదాపు 10 కి.మీ (6.2 మైళ్ళు) తర్వాత సముద్రంలో కలుస్తుంది. ఔట్‌లుక్ ట్రావెలర్ 2005లో మరవంతే బీచ్ కు కర్ణాటకలోని అత్యంత అందమైన బీచ్‌గా రేటింగ్ వచ్చింది. ఈ బీచ్‌కు వర్జిన్ బీచ్ అని కూడా పేరు పెట్టారు.[5][4][6]

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]
  • కాపు బీచ్
  • మాపుల్ బీచ్
  • పాడుబిద్రి బీచ్
  • మారస్వామి దేవాలయం

సౌపర్ణికా నది

[మార్చు]

సౌపర్ణికా నది, భారతదేశం, కర్ణాటకలోని కుందాపుర తాలూకా గుండా ప్రవహించే నది. సుపర్ణ అని పిలువబడే గరుడ (డేగ) పక్షి నది ఒడ్డున తపస్సు చేయడం ద్వారా మోక్షాన్ని పొందిందని నమ్ముతారు, అందుకే దీనికి సౌపర్ణికా అని పేరు వచ్చింది. నది ప్రవహిస్తున్నప్పుడు 64 రకాల ఔషధ మొక్కలు, వేర్లలోని పదార్థాలను గ్రహిస్తుందని, తద్వారా అందులో స్నానం చేసే వారికి అనారోగ్యాలు నయమవుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం.[7]

సౌపర్ణికా నది, ఎన్హెచ్ 66, మరవంతే బీచ్

మూలాలు

[మార్చు]
  1. "Maravanthe Village". www.onefivenine.com. Retrieved 2023-07-06.
  2. Role Of Fisheries In Rural Development, by S. Giriappa, Daya Books (1994) ISBN 9788170351269, Page 46.
  3. Sastry, Anil Kumar (2018-05-28). "Protecting a 2.5-km spectacular shoreline at Maravanthe". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-07-19.
  4. 4.0 4.1 Trekking Holidays in India: Outlook traveller - Outlook Pub. India.(2005) ISBN 9788189449001
  5. "Maravanthe Beach Kundapura - Udupi | Things to do in Beach". Karnataka Tourism. Retrieved 2023-07-06.
  6. "Trasi Maravanthe Beach – Maravanthe". UdupiTourism. 2014-11-25. Retrieved 2023-07-06.
  7. "Sowparnika River of Udupi, Religious Rivers in Udupi, Udupi River". www.udupilive.in. Retrieved 2023-07-06.
"https://te.wikipedia.org/w/index.php?title=మరవంతే&oldid=3927140" నుండి వెలికితీశారు