Jump to content

మలయశ్రీ

వికీపీడియా నుండి
మలయశ్రీ' హేతువాది, రచయిత, పరిశోధకుడు. అతను కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలుగుభాష సంరక్షణకు కృషి చేస్తున్న భాషాభిమాని.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

మలయశ్రీ 1940 లో కరీంనగర్ జిల్లా చెంజెర్లలో పుట్టాడు. 50 పైగా పుస్తకాలు రాశాడు. నవ్యసాహిత్య పరిషత్ ను స్థాపించి ప్రగతి శీల రచయితలకు ప్రతి ఏటా మలయశ్రీ సాహితీ అవార్డు ఇస్తున్నారు. 'కరీంనగర్‌ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర'తో పాటు అనేక గ్రంథాలు రాసాడు.[2] అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.[3] తెలంగాణ తెలుగు భాష ఎంత ప్రాచుర్యమైందో, అంతే విశిష్టమైందని, దానిని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని అతను తెలిపాడు. [4]

కవిగా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. తన కవితలు, పద్యాలతో రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతులను చేశాడు. మాతృభాష సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. అతను లుగుభాష సంరక్షణ సమితి స్థాపించి కొనసాగిస్తున్నాడు. అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి చైతన్యం తీసుకొస్తున్నాడు. అతను రచనల్లో జాగృతి పద్యకవ్యం, చదువుపాటలు, అమ్మభాష శతకం, తెలంగాణ గెలుపు, సబల పుస్తకాలు ఇప్పటికే ప్రచారం పొందాయి. మొగ్గలు, తెలుగువెలుగు శతకం పుస్తకాలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి.

ఉత్తమ తెలుగు ఉపాధ్యాయుడిగా (1971, 2002) రెండుసార్లు పురస్కారాలు అందుకున్నాడు. మూడుసార్లు హైదరాబాద్‌లో రవీంద్రభారతి వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పద్యతెలంగాణంలో పాల్గొని ప్రశంసలు పొందాడు. [1]

రచనలు

[మార్చు]
  1. శాంతిపధము 1975
  2. మానవగీతి 1986
  3. సత్యసూక్తం (నాస్తికత్వం ఎందుకు?) 1997
  4. కరీం నగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర
  5. ఐరేణి కుండలు - కథా సంపుటి

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "సాహితీ దీప్తి.. ఘన కీర్తి - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-27.
  2. Staff (2001-11-21). "విమర్శతోనేమంచి సాహిత్యం: మలయశ్రీ". telugu.oneindia.com. Retrieved 2020-07-27.
  3. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-27.
  4. "మన తెలుగుభాషకు ఎంతో ప్రాచుర్యముంది". www.andhrajyothy.com. Retrieved 2020-07-27.[permanent dead link]

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మలయశ్రీ&oldid=3840062" నుండి వెలికితీశారు