Jump to content

కళ్యాణ రాముడు

వికీపీడియా నుండి
(మల్యన రాముడు నుండి దారిమార్పు చెందింది)
కళ్యాణ రాముడు
(1980 తెలుగు సినిమా)
తారాగణం కమల్ హాసన్
శ్రీదేవి
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహా ఇంటర్నేషనల్
విడుదల తేదీ 2 ఫిబ్రవరి 1980 (1980-02-02)([1])
భాష తెలుగు

1979లో "కళ్యాణరామన్" (கல்யாணராமன்) గా తీసిన తమిళ చిత్రాన్ని తెలుగులో కళ్యాణ రాముడు గా అదే సంవత్సరంలో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేస్తే పోటీగా శ్రీదేవి నటించింది.[2]

పాటలు

[మార్చు]
  1. ఏదో రాగం
  2. నీకే మనసు ఇచ్చా
  3. నేనే నీకు ప్రాణం
  4. మనసున రేగే

రాము, కళ్యాణ్ ఇద్దరూ కవల పిల్లలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయి రాము తల్లి వద్ద మద్రాసులోనే ఉండిపోగా కళ్యాణ్‌ని తండ్రి బెంగళూరుకు తీసుకుపోయి అక్కడకు దగ్గరనే ఉన్న టీ ఎస్టేటుకు యజమాని అయి ఆ ప్రాంతాలకు జమీందార్ అవుతాడు. సరైన సంరక్షణ లేక కళ్యాణ్ పెరిగి పెద్దవాడై అమాయకుడిగా, వెర్రిబాగులవాడిగా తయారవుతాడు. డ్రైవర్ కూతురు కమలను ప్రేమిస్తాడు. ఎస్టేట్ మేనేజర్ ఆస్తి కోసం కుట్రపన్ని డ్రైవర్, వంటవాడు, మరో రౌడీ సహాయంతో మొదట జమీందారును, తరువాత కళ్యాణ్‌ను హత్యచేస్తాడు. చనిపోయే ముందు జమీందారు కళ్యాణ్‌కు తల్లి, సోదరుని విషయం తెలియజేస్తాడు. మరణించిన కళ్యాణ్ ఆత్మ మేనేజర్‌పై పగబట్టి, మద్రాసులో ఉన్న రామును కలుసుకుని విషయాన్ని వివరిస్తుంది. రాము ఎస్టేట్‌కు వచ్చి కళ్యాణ్ ఆత్మ సహాయంతో మేనేజర్ ఆట కట్టిస్తాడు. ఆత్మ ప్రోత్సాహంతోనే కమలను వివాహం చేసుకుంటాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56766
  2. https://ghantasalagalamrutamu.blogspot.com/2015/03/1980_27.html?m=1
  3. రమణ (7 February 1980). "చిత్ర సమీక్ష కళ్యాణరాముడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 305. Retrieved 20 January 2018.[permanent dead link]

వెలుపలి లింకులు

[మార్చు]