డబ్బింగ్ సినిమా
డబ్బింగ్ (Dub, Dubbing, Voice over) అనగా ఒక భాషలో తయారైన సినిమాని మరో భాషలోని మాటలు, పాటలు మాత్రమే మార్చి విడుదల చేయడం, దీనికి మాతృక భాషా చిత్రానికి చెందిన నిర్మాత నుండి హక్కులు కొనుగోలు చేస్తారు. "డబ్బింగ్ సినిమా అనేది నిర్జీవ దేహం లాంటిది. దానికి ప్రాణం పోసేది రచయితలే" అని శ్రీ శ్రీ నిర్వచించారు.
తెలుగులో మొట్టమొదటి డబ్బింగు సినిమా
[మార్చు]తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతి (1950). దానికి మాటలు, పాటలు శ్రీ శ్రీ రాసాడు. "నీరా ఔర్ నందా" అనే హిందీ సినిమాను ఆహుతి పేరుతో తెలుగులోకి అనువదించారు. దీని నిర్మాత జయభేరితో ప్రఖ్యాతుడైన నారాయణరావు. మాధవపెద్ది, చదలవాడ, వల్లం, కనకం తదితరులు ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. తారలందరూ హిందీ వారే, చిత్రం అంతా ఔట్ డోర్ లో తీయడం దీని ప్రత్యేకత, పడవ వాళ్ళ కథ. తెలుగు డబ్బింగ్ కు సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు..
డబ్బింగ్ విధానం
[మార్చు]డబ్బింగ్ తొలిరోజుల్లో మూలంలో ఉన్నదాన్ని ఉన్నదున్నట్లుగా తెలుగులోకి అనువదించేవారు. వారికి అర్ధమే ముఖ్యం లిప్ సింక్ ఎలా ఉన్నా పట్టించుకునేవారు కాదు. ప్రస్తుత కాలంలో లిప్ సింక్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అవసరమైతే మూలంలోని థాట్ ని అధిగమించి తెలుగు తనాన్ని జొప్పిస్తున్నారు. మూలంలో ప్లెయిన్ గా ఉన్న డైలాగ్ ని తెలుగువాళ్ళకు ఇష్టమైన పురాణాలలోని సామ్యాన్ని చూపిస్తూ మార్చడం జరుగుతుంది. అంతేకాక మూలంలో ఏదైనా యాస వాడితే తెలుగులో మన ప్రాంతీయ మాండలికాలు (రాయలసీమ, తెలంగాణ, గోదావరి మొదలైనవి) వాడుతున్నారు.
డబ్బింగ్ లో ఒక్కో రచయితది ఒక్కో పద్ధతి. శ్రీ శ్రీ మాతృకను అనుసరించి మక్కీకి మక్కీగా అనువదించేవారు. ఆరుద్ర లిప్ సింక్ కంటే కూడా అందమైన తెలుగు జొప్పించేందుకు ఆరాటపడేవారు. అనిసెట్టికి లిప్ సింక్ ముఖ్యం. రాజశ్రీది శ్రీశ్రీ పద్ధతే కానీ ఆయనలాగా పాటలు, మాటలు రెండు చేతులతో రాసేవారు డబ్బింగ్ రంగంలో అరుదు.
కళాకారులు
[మార్చు]డబ్బింగ్ సినిమా గౌరవార్హత పొందడం వెనుక ఎందరో రచయితల కృషి దాగివుంది. శ్రీ శ్రీ తరువాత ఆరుద్ర, ఆత్రేయ, అనిసెట్టి, మహారధి, రాజశ్రీ, గోపిమ్ బైరాగి పాప, డి.వి. నరసరాజు, మాగాపు అమ్మిరాజు, గణేశ్ పాత్రో, గురుచరణ్, వెన్నెలకంటి, శ్రీ రామకృష్ణ, సూర్యదేవర, కోల వెంకట్, గబ్బిట వెంకట్రావు వంటి ఎందరో రచయితలు డబ్బింగ్ రంగాన్ని సుసంపన్నం చేశారు.
కొందరు కళాకారులు గాత్ర దానాన్ని అందించినవారైతే, కొందరు పాటలు పాడి చిత్రాన్ని సంగీతభరితంగా తయారుచేస్తారు, ఈ రెండవ వారిని నేపథ్య గాయకులు అంటారు. తొలి తరపు గాత్ర దాతలలో కాటూరి, అన్నపూర్ణ, టి.జి.కమలాదేవి, పార్వతి, ప్రమీల, తిలకం, కె.ఉదయలక్ష్మి, వీరమాచనేని సరోజిని, జగ్గయ్య, కె.విఎస్.శర్మ, చుండ్రు సూర్యనారాయణ, అల్లు రామలింగయ్య, ఎ.వి.సుబ్బారావు, మోదుకూరి సత్యం, రామకోటి, దశరథరామిరెడ్డి వంటి వారు ప్రముఖులు. తర్వాతి కాలంలో సాయి కుమార్, రత్నకుమార్, శ్రీనివాస మూర్తి, పి.జె.శర్మ, రవిశంకర్, రవీంద్రనాథ్, భీమేశ్వరరావు, కాకరాల, ఈశ్వరరావు, సాయికిశోర్, ఉమామహేశ్వరరెడ్డి, ప్రవీణ్, మిమిక్రీ నాగేశ్వరరావు వంటి వారు ప్రసిద్ధులు. ఇక సరిత, రోజారమణి, రోహిణి, తులసి, దుర్గ, లక్ష్మి, గౌరీప్రియ వంటివారు స్త్రీ పాత్రలకు డబ్బింగ్ చెప్పడంలో పేరుపొందారు.
హిట్ చిత్రాలు
[మార్చు]1950 దశాబ్దం
[మార్చు]- ఆహుతి (1950) - తొలి తెలుగు డబ్బింగ్ సినిమా
- అపూర్వ సహోదరులు (1950)
- ప్రేమలేఖలు (1953)
- రోహిణి (1953)
- రక్తకన్నీరు
- రాజపుత్రి రహస్యము (1957)
- సంపూర్ణ రామాయణం (1958)
- సాహసవీరుడు
1960 దశాబ్దం
[మార్చు]- కన్నెపిల్ల (1960)
- మురిపించే మువ్వలు (1962)
- వీరపుత్రుడు (1962)
- ఆదర్శ సహోదరులు (1964 )
- దొంగను పట్టిన దొర (1964)
- మాంగల్యమే మగువ ధనం (1965)
- ముగ్గురు అమ్మాయిలు - మూడు హత్యలు (1965)
- సర్వర్ సుందరం (1966)
- శభాష్ రంగా (1967)
- సరస్వతీ శపథం (1967)
- ధనమే ప్రపంచలీల (1967)
- పెళ్లాంటే భయం (1967)
- శివలీలలు (సినిమా)
- నువ్వే (1967)
- దోపిడీ దొంగలు (1968)
- కొండవీటి సింహం (1969)
- ప్రేమ మనసులు (1969)
1970 దశాబ్దం
[మార్చు]- కోటీశ్వరుడు (1970)
- గౌరవం (1970)
- మాయావి (1976)
- ఊర్వశి నీవే నా ప్రేయసి (1979)
- ఎర్ర గులాబీలు (1979)
- అమ్మ ఎవరికైనా అమ్మ (1979)
- ముల్లు - పువ్వు (1979)
- కళ్యాణ రాముడు (1979)
- నువ్వే నా శ్రీమతి (1979)
- ఓఇంటి కథ (1979)
1980 దశాబ్దం
[మార్చు]- గురు (1980)
- కాళి (1980)
- పైలట్ ప్రేమ్‌నాథ్ (1980)
- మౌనగీతం (1980)
- అమావాస్య చంద్రుడు (1981)
- అందగాడు (1982)
- చిలిపి మొగుడు (1981)
- వసంత కోకిల (1981)
- ముసలోడికి దసరా పండగ (1981)
- శివభక్త విజయము
- అమరగీతం (1982)
- ప్రేమ సంగమం (1982)
- రాధా మాధవి (1982)
- టిక్ టిక్ టిక్ (1982)
- పల్లవి - అనుపల్లవి (1983)
- అమ్మాయిలూ ప్రేమించండి (1984)
- జల్సా రాయుడు (1984)
- కాల రుద్రుడు (1984)
- కిలాడి (1984)
- అమ్మా నన్ను దీవించు (1984)
- నూరోరోజు (1984)
- ఇదే నా సవాల్ (1984)
- జల్సా బుల్లోడు (1985)
- సింధు భైరవి (1985)
- చిలిపి యవ్వనం (1985)
- ప్రేమ శాస్త్రం (1985)
- ఉదయ గీతం (1985)
- దొంగల వేటగాడు (1985)
- మంచి మనసులు (1986)
- డాన్స్ మాస్టర్ (1986)
- ఆత్మ బంధువు (1987)
- మౌన రాగం (1987)
- నాయకుడు (1987)
- కేడి (1987)
- మాయింటి కృష్ణుడు (1987)
- రెండు తోకలపిట్ట (1987)
- సిస్టర్ నందిని (1987)
- విజేతలు (1987)
- ఘర్షణ (1988)
- సత్య (1988)
- ప్రేమ పావురాలు (1989)
1990 దశాబ్దం
[మార్చు]- అంజలి (1990)
- క్షత్రియ పుత్రుడు (1992)
- దళపతి (1992)
- రోజా (1992)
- ప్రేమికుడు (1994)
- బొంబాయి (1995)
- ప్రేమాలయం (1995)
- భారతీయుడు (1996)
- ప్రేమ లేఖ (1996)
- ప్రేమ దేశం (1996)
- ఇద్దరు (1997)
- జీన్స్ (1998)
- నరసింహ (1999)
2000 దశాబ్దం
[మార్చు]- అమృత (2002)
- యువ (2004)
- అపరిచితుడు (2005)
- చంద్రముఖి (2005)
- అబద్ధం (2006)
- వ్యాపారి (2007)
- దశావతారం (2008)
2010 దశాబ్దం
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- పెదవులకు మాటలు అతికించడం... అది ఓ చిత్కళ, వసంత కుమార్, ఆంధ్రప్రభ విశేష ప్రచురణ "మోహిని"లో ప్రచురించిన వ్యాసం మూలంగా.