మురిపించే మువ్వలు
Appearance
మురిపించే మువ్వలు (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.వి.రామన్ |
---|---|
తారాగణం | జెమిని గణేశన్ , సావిత్రి, కమల లక్ష్మణ్, మనోహర్ |
సంగీతం | ఎస్.ఎం. సుబ్బయ్యనాయుడు |
నిర్మాణ సంస్థ | దేవి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మురిపించే మువ్వలు 1962 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనికి తమిళచిత్రం కొంజుం సలంగై (கொஞ்சும் சலங்கை, 1962) మాతృక. రెండింటిలోను మహానటి సావిత్రి, జెమినీ గణేశన్ ప్రధాన పాత్రలను పోషించారు.
పాటలు
[మార్చు]- ఆశ నీవు తీర్చుమా నన్ న్నవలతీరం చేర్చుమా - ఎస్. జానకి, ఘంటసాల , రచన:ఆరుద్ర
- నీలీల పాడెద దేవా మము మనవి ఆలించ వేడెద దేవా మాము - ఎస్. జానకి , రచన:ఆరుద్ర
- వీరులభూమి మేటి వేల్పుల భూమి వీరమాత పేరుగన్న - ఘంటసాల బృందం , రచన: ఆరుద్ర
- శుభములిచ్చే వేల్పు సురకోటసేనాని సుభ్రమణ్యంబనెడి వేల్పు - పి.లీల , రచన:ఆరుద్ర
- సొంపు గజ్జెల సృతిచేత చెలియ పొంగునమ్మా మొదటి పాటచేత - పి.లీల, రచన:ఆరుద్ర
- దేశాన ఉత్తముల చిత్రవధ కావించే,ఘంటసాల, రచన:ఆరుద్ర
- కాంచ కన్నుల విందు తన కాలూచి నటరాజు ఆడే, పి.లీల, రచన: ఆరుద్ర
- కలువ తేనెటీగయే ఒకటుందోయే కుసుమించు , పి.సుశీల, రచన:ఆరుద్ర
- జయమనుమా శుభ జయామనుమా జనీయించు, మాధవపెద్ది సత్యం బృందం, రచన: ఆరుద్ర
- బ్రహ్మతాళం మ్రోచ హరి శంఖ ధ్వని,.. అభినయాల చేశద, పి.లీల, రాధా జయలక్ష్మి, రచన: ఆరుద్ర
- శాంత ముఖముతో సలతతం నా మనఃశాంతి దోచి , కె.అప్పారావు, రచన:ఆరుద్ర .
విశేషాలు
[మార్చు]- ఇది దక్షిణభారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి పూర్తిస్థాయి టెక్నీకలర్ సినిమా.
- మహానటి సావిత్రికి ఇది 100వ సినిమా.