అందగాడు (1982 సినిమా)
అందగాడు (1982 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | టి. ఎన్. బాలు |
తారాగణం | కమల్ హసన్ శ్రీదేవి సీమ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | అనంతలక్ష్మీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | February 6, 1982[1] |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అందగాడు 1982 లో టి. ఎన్. బాలు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో కమల్ హాసన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది 1981 తమిళ సినిమా శంకర్‌లాల్ ఆధారంగా నిర్మించబడింది. ఈ చిత్రానికి కథ, నిర్మాత, దర్శకుడు కూడా టి.ఎన్. బాలు. ఈ చిత్రంలో కమల హాసన్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమా నిర్మిస్తున్న సమయంలో టి.ఎన్.బాలు మరణించడంతో కొంతమేరకు మాత్రమే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎన్.కె. విశ్వనాథన్ పూర్తిచేసాడు.[2]
కథ
[మార్చు]కమల్ హాసన్ ఈ చిత్రంలో తండ్రి-కొడుకుల ద్వంద్వ పాత్ర పోషిస్తాడు. ఇది ఒక సాధారణ వ్యక్తి దామోదరం (పెద్ద కమల్ హాసన్) తన కుటుంబంతో ఊటీలో విహారయాత్రతో ప్రారంభమవుతుంది, అక్కడ అతను ఒక నేరస్థుడి చేత హత్యనేరారోపణతో జైలులో ఉంటాడు. అతని భార్య, కొడుకు మోహన్ (చిన్న కమల్ హాసన్), కుమార్తె (సీమా) అందరూ ఒకరి నుండి ఒకరు విడిపోతారు. చాలా సంవత్సరాల తరువాత ప్రతీకారంతో దామోదరం తనకు జైలుకు పంపిన నేరస్తుడిని ఎదుర్కొని తాను కోల్పోయిన కుటుంబం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇంతలో నేరస్థులు హేమ (శ్రీదేవి) ను కిడ్నాప్ చేస్తాడు. ఆమెను రక్షించడానికి హేమ తండ్రి మోహన్ (చిన్న కమల్ హాసన్) ను నియమిస్తాడు. దీని ఫలితంగా దామోదరం, మోహణ్ తమ ఉమ్మడి శత్రువులపై పోరాటం చేస్తారు.
చెల్లదురై ఇంతలో విమోచన కోసం హేమ (శ్రీదేవి) ను కిడ్నాప్ చేసాడు, మోహన్ ఆమెను రక్షించడానికి హేమా తండ్రి చేత నియమించబడ్డాడు. దీని ఫలితంగా ధర్మలింగం, మోహన్ తమ సాధారణ శత్రువు చెల్లదురైపై పోరాటంలో కొమ్ములను లాక్ చేస్తారు.
తారాగణం
[మార్చు]- కమల్ హసన్ - దామోదరం / మోహన్ (తండ్రి, కొడుకు పాత్రలు)
- శ్రీదేవి - హేమ
- సీమ - సీత - దామోదరం కుమార్తె
- పి.ఆర్.వరలక్ష్మి - ధనలక్ష్మి, దామోదరం భార్త
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య - హేమ తండ్రి
- ఎస్.ఎ.అశోకన్
- వి.గోపాలకృష్ణ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: టీ.ఎన్.బాలు
కథ, నిర్మాత: ట్.ఎన్.బాలు
నిర్మాణ సంస్థ: ఆనంతలక్ష్మి క్రియేషన్స్
సంగీతం: ఇళయరాజా
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, వాణి జయరాం .
పాటల జాబితా
[మార్చు]1.స్వప్నమే నిజము కానున్నది వరాలు తేనున్నది , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.ఉూగుతుంది లోకంచెలరేగుతుంది మైకం, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.ఎవరికి ఎవరు లాభము తెలియజాలరు కదా, గానం.వాణి జయరాం
4.నన్నురారా బాబు రాజా అంది లోకం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
5.పడుచుదనం పై పడుతుంటే ఉూఅనవు పలుకవు, గానం.ఎస్.జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.వచ్చిందిరా లేడీ నీకు వచ్చిందిరా వేడి ఇక చల్లారదు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
మూలాలు
[మార్చు]- ↑ "Andagaadu" (PDF). Andhra Patrika. 6 February 1982. p. 8. Archived from the original (PDF) on 6 జూలై 2022. Retrieved 11 నవంబరు 2022.
- ↑ http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/grillmill/article3022046.ece
3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.