క్షత్రియ పుత్రుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
క్షత్రియ పుత్రుడు
(1992 తెలుగు సినిమా)
Kshatriya Putrudu.jpg
దర్శకత్వం భరతన్
నిర్మాణం కమల్ హసన్
కథ కమల్ హసన్
తారాగణం కమల్ హసన్, శివాజీ గణేశన్, రేవతి, గౌతమి, నాజర్
సంగీతం ఇళయరాజా
ఛాయాగ్రహణం పి.సి. శ్రీరామ్
భాష తెలుగు

క్షత్రియ పుత్రుడు(తమిళంలో తెవర్ మగన్) తమిళం నుండి తెలుగు భాషలోకి డబ్బింగ్ చేయబడిన 1992 సినిమా. దీనికి మూలం కమల్ హసన్ నిర్మించిన తేవర్ మగన్. మూలచిత్రానికి కమల్ హసన్ నిర్మాతగా, రచయితగా వ్యవహరించి నటించారు. సినిమాలో కమల్ హసన్, శివాజీ గణేశన్, రేవతి, గౌతమి మొదలైన వారు నటించారు. దీనికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. తమిళమూలం అద్భుత విజయాన్ని సాధించి 175 రోజులు ప్రదర్శితం కాగా తెలుగు అనువాదంలో కూడా సినిమా విజయవంతమైంది.

65వ అకాడమీ అవార్డులకు గాను సినిమాను భారతదేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డు కోసం అధికారిక ఎంట్రీగా పంపారు. 1994 సంవత్సరపు టొరంటొ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రం ప్రదర్శితమైంది. [1]

ఈ సినిమా 5 జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకుంది. వాటిలో ఉత్తమ తమిళ చిత్రం పురస్కారం, ఉత్తమ సహాయనటి పురస్కారం (రేవతి), ప్రత్యేక జ్యూరీ పురస్కారం (శివాజీ గణేశన్) ఉన్నాయి. ఈ సినిమా 1972నాటి అమెరికన్ చలనచిత్రం గాడ్ ఫాదర్ అడాప్టేషన్ అని కొందరు పేర్కొన్నారు. తెవర్ మగన్ సినిమా తెలుగులోకి క్షత్రియపుత్రుడుగా అనువాదం కాగా, తర్వాతి కాలంలో హిందీలోకి ప్రియదర్శన్ దర్శకత్వంలో విరాశత్(1997)గానూ, కన్నడలోకి ఎస్.మహేందర్ దర్శకత్వంలో తెండెగె తక్క మగ(2006)గానూ రీమేక్ అయ్యాయి.

ఇతర విశేషాలు[మార్చు]

ఈ సినిమాలో వచ్చే మురిసేపండుగపూటా అనే పాటకు ఇళయరాజా కేవలం ఘటము తో సంగీతాన్ని అందించారు. చిత్రీకరణలో కూడా కుందదరువు చూపటం ప్రత్యేకత.

పాటలు[మార్చు]

  • 1. గుణవతిగా
  • 2. మురిసే పండుగ
  • 3. నెత్తిన బొట్టు
  • 4. నింగి చెదిరిపోయె
  • 5. రంగారే రంగారే
  • 6. శాంభవీ గౌరీ రావే
  • 7. సన్నాజాజీ పాడాకా