మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Johnkavi.jpg
మల్లవరపు జాను కవి

మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధన పురస్కారం

[మార్చు]

మల్లవరపు జాన్ ప్రసిద్ధకవి. ఆయన కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు తన తండ్రిపేరుతో తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కార కమిటీకి మల్లవరపు సుధాకరరావు, మల్లవరపు ప్రభాకరరావులు ట్రస్టీలుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రవృత్తి రీత్యాకవులు, వృత్తి రీత్యా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు.[1] ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని ప్రముఖకవి, పరిశోధకుడు, అధ్యాపకుడు దార్ల వెంకటేశ్వరరావుకి అందించారు. పురస్కారానికి గాను 5116 రూపాయలు, ప్రశంసాపత్రం, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానం చేస్తారు. 2016లో ఈ పురస్కార ప్రదానోత్సవం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బహుజన రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగింది. డా.దార్ల వెంకటేశ్వరరావుగారికి విజయవాడలో ఎం.బి.భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన రచయితల వేదిక ప్రథమ మహాసభల్లో ది 2016 ఏప్రిల్ 10న మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పరిశోధన పురస్కారాన్ని (2016) ప్రదానం చేశారు.[2]

మూలాలు

[మార్చు]
  1. [1][permanent dead link] http://mallavarapu-johnkavi.blogspot.in[permanent dead link]
  2. [2][permanent dead link] https://vrdarla.blogspot.in Archived 2016-12-20 at the Wayback Machine దార్లవెంకటేశ్వరరావుకి మల్లవరపు జాన్ స్మారకసాహితీ పురస్కారం, 11, ఏప్రిల్, 206 ఆంధ్రజ్యోతి విజయవాడ