మల్లాది విష్ణు
మల్లాది విష్ణు | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
| |||
నియోజకవర్గం | విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ | ||
సంతానం | 2 కుమార్తెలు | ||
వెబ్‌సైటు | http://www.malladivishnu.in |
మల్లాది విష్ణువర్ధన్ (మల్లాది విష్ణు గా సుపరిచితుడు) వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు.[1] అతను 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున విజయవాడ మధ్య శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందాడు.[2] [3][4]
జీవిత విశేషాలు
[మార్చు]మల్లాది విష్ణు కృష్ణా జిల్లా లోని విజయవాడలో ఎం. వెంకట సుబ్బారావుకు 1964 లో జన్మించాడు. 1982 లో అతను VBM కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తన గ్రాడ్యుయేషన్ లో బి.కామ్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]విష్ణు తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించాడు. అతను 2009-2014 వరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను తన ప్రత్యర్థి అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ పై 800వోట్ల తేడాతో 2009 సాధారణ ఎన్నికలలో గెలుపొందాడు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ పట్టణ అభివృద్ధి అథారిటీ (వుడా) ఛైర్మన్‌గా పనిచేశాడు.
విష్ణువు వైయస్ఆర్సిపిలో చేరాడు, అతను నాయకుడు. 2019లో విష్ణు ఎమ్మెల్యే పదవిని గెలుచుకున్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైయస్ఆర్సిపి ప్రస్తుత ఎమ్మెల్యే (ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు).
విష్ణు 2019లో యై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే గా 20 ఓట్ల తో గెలిచాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-20. Retrieved 2013-06-06.
- ↑ http://www.thehindu.com/news/cities/Vijayawada/congress-leaders-kick-off-unofficial-poll-campaign/article4097809.ece
- ↑ http://www.thehindu.com/news/cities/Vijayawada/political-parties-go-all-out-to-woo-devotees/article4012671.ece
- ↑ Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
- ↑ "Malladi Vishnu Vardhan Alias Malladi Vishnu | MLA | YSRCP | Vijayawada Central". theLeadersPage | the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-20. Retrieved 2020-06-09.