మల్లికార్జునస్వామి దేవాలయం (పెద్దాపూర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లికార్జునస్వామి దేవాలయం
మల్లికార్జునస్వామి దేవాలయం (పెద్దాపూర్) is located in Telangana
మల్లికార్జునస్వామి దేవాలయం (పెద్దాపూర్)
తెలంగాణలో దేవాలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు18°48′25″N 78°39′20″E / 18.806808°N 78.655537°E / 18.806808; 78.655537Coordinates: 18°48′25″N 78°39′20″E / 18.806808°N 78.655537°E / 18.806808; 78.655537
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాజగిత్యాల
స్థలంపెద్దాపూర్, మెట్‌పల్లి మండలం
సంస్కృతి
దైవంశివుడు
ముఖ్యమైన పర్వాలుమల్లన్న జాతర

మల్లికార్జునస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఉన్న దేవాలయం.[1] ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండుగ తరువాత వచ్చే ఆదివారంనాడు జరిగే మల్లన్నజాతరలో 60వేల బోనాలను సమర్పిస్తారు.[2] ఈ జాతరను చూడడానికి వివిధ ప్రాంతాల (తెలంగాణలోని జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల) నుంచి అధికసంఖ్య లో భక్తులు పాల్గొన్నారు. నుంచి దాదాపు లక్షమంది భక్తులు ఈ ఊరికి వస్తారు.[3]

స్థల విశిష్టత[మార్చు]

దాదాపు వందేళ్ళక్రితం రాయి రూపంలో మల్లన్నస్వామి వెలిశాడని, తొలిరోజుల్లో యాదవులు మాత్రమే స్వామికి పూజు చేసేవారనీ, ఆ తరువాత ఊరివాళ్లంతా పూజించడం ప్రారంభించారనీ చరిత్రకారులు చెబుతున్నారు. ప్రారంభంలో చిన్న గుడిసెతో ఉన్న ఈ దేవాలయం, ఆ తరువాత ఇక్కడకు వచ్చే భక్తుల సహకారంతో గర్భగుడి నిర్మించబడింది.[4]

ఉత్సవాలు[మార్చు]

జాతరకు ఒకరోజుముందు (శనివారం) ఉదయం దేవాలయంలోని మల్లన్నస్వామి విగ్రహాన్ని గోదావరి నదికి తీసుకెళ్ళి, తరువాత గ్రామ సింహద్వారం నుంచి డప్పు చప్పుళ్ళతో తీసుకొస్తారు. ఆరోజు రాత్రి స్వామి కళ్యాణాన్ని జరిపించి, ఆదివారం రోజున బోనాలు, పసుపు, బెల్లం, గొర్రెపిల్లలను కానుకలుగా సమర్పిస్తారు. ఉపవాస దీక్షతో నైవేద్యం వండి 60వేలకుపైగా బోనాలతో దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు. శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, రథోత్సవంతో జరుగుతాయి. మంగళవారం నాగవెల్లి నిర్వహించి రాత్రి స్వామికి ఒగ్గుకథ చెబుతారు. అది పూర్తయ్యాక దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన అగ్నిగుండం మీదుగా భక్తులు నడవడంతో ఉత్సవాలు పూర్తవుతాయి.[5]

ప్రత్యేకత[మార్చు]

దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకోసం దేవాలయంలో ఒకటే ధర్మశాల ఉంది. దాంతో జాతర పూర్తయ్యేవరకూ స్థానికంగా ఉన్న ఇళ్ళల్లో (ఒక్కో ఇల్లు పదిహేను నుంచి ఇరవై కుటుంబాలకు) వసతి కల్పిస్తారు. స్వామికి ఇచ్చిన మాటకోసం ఈ గ్రామస్తులు ఆదివారం రోజున మాంసం, మద్యం ముట్టుకోరు.

ప్రయాణం[మార్చు]

జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి 33 కిలోమీటర్ల దూరంలో పెద్దాపూర్‌ గ్రామం ఉంది. జగిత్యాల నుండి ప్రత్యేక బస్సులతోపాటు ప్రయివేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

మూలాలు[మార్చు]

  1. "ఘనంగా పెద్దాపూర్‌ మల్లన్న బోనాల జాతర". andhrajyothy. 2021-03-29. Archived from the original on 2022-02-01. Retrieved 2022-02-01.
  2. shivakumar (2021-03-28). "60వేల బోనాలతో పెద్దాపూర్ మల్లన్న జాతర". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-02-01. Retrieved 2022-02-01.
  3. "వైభవంగా పెద్దాపూర్ మల్లన్న స్వామి బోనాల జాతర". ETV Bharat News. 2021-03-28. Archived from the original on 2022-02-01. Retrieved 2022-02-01.
  4. "మల్లన్న జాతరకు... యాభైవేల బోనాలు!". ETV Bharat News. 2021-03-28. Archived from the original on 2022-02-01. Retrieved 2022-02-01.
  5. మల్లన్న జాతరకు... యాభైవేల బోనాలు, ఈనాడు ఆదివారం అనుబంధం, 2021 మార్చి 28, పుట 5.