Jump to content

మల్లిక శ్రీనివాసన్

వికీపీడియా నుండి
మల్లిక శ్రీనివాసన్
జననం1959 (1959) (age 65)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తివ్యాపారవేత్త
సంస్థట్రాక్టర్స్ ఫార్మర్స్ లిటిమెడ్ కంపెనీ
Board member ofటాటా స్టీల్
భార్య / భర్తవేణు శ్రీనివాసన్
పిల్లలులక్ష్మీ వేణు, సుదర్శన్ వేణు
తల్లిదండ్రులుశివశైలం ఇందిరా శివ శైలం

మల్లికా శ్రీనివాసన్ (జననం 1959) ఒక భారతీయ పారిశ్రామికవేత్త ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఇది భారతదేశంలోని చెన్నైలో 1960లో స్థాపించబడింది. ఈ సంస్థలను ట్రాక్టర్లను తయారు చేస్తుంది. మల్లికా శ్రీనివాసన్ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పిఇఎస్‌బి) చైర్‌పర్సన్ కూడా. [1]

వృత్తి

[మార్చు]

మల్లికా శ్రీనివాసన్ TAFEని ట్రాక్టర్ల ను తయారు చేయడానికి స్థాపించారు. మల్లికా శ్రీనివాసన్ ట్రాక్టర్లు తయారు చేసే కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, డీజిల్ ఇంజన్లు, జనరేటర్లు, ఇంజనీరింగ్ ప్లాస్టిక్‌లు, హైడ్రాలిక్ పంపులు సిలిండర్లు, ఆటోమొబైల్ ఫ్రాంచైజీలు ప్లాంటేషన్‌లలో విభిన్న ప్రయోజనాలు ఈ కంపెనీ వల్ల ఉన్నాయి. 10,000 కోట్లు పెట్టుబడి తో మల్లికా శ్రీనివాసన్ ఈ కంపెనీని ప్రారంభించారు.

మల్లికా శ్రీనివాసన్ ట్రాక్టర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి వివిధ పరిశ్రమల సంస్థలకు నాయకత్వం వహించింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వంటి పరిశ్రమ సంస్థలలో వివిధ పదవులను నిర్వహించింది. [2]

దాతృత్వం

[మార్చు]

మల్లికా శ్రీనివాసన్ శంకర నేత్రాలయ (ప్రముఖ కంటి సంరక్షణ సంస్థ), చెన్నైలోని క్యాన్సర్ హాస్పిటల్ లాంటి సంస్థలకు డబ్బులను విరాళంగా ఇస్తుంది. ఇందిరా శివశైలం ఫౌండేషన్ ద్వారా కర్నాటక సంగీత ప్రచారం మద్దతుతో మల్లికా శ్రీనివాసన్ కళ లను పోషిస్తుంది.[3]

అవార్డులు

[మార్చు]

మల్లిక శ్రీనివాసన్ ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. 2011లో, మల్లికా శ్రీనివాసన్ ఆ సంవత్సరపు ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఎంపికైంది; మల్లికా శ్రీనివాసన్ ఫోర్బ్స్ ఇండియా ద్వారా ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది; ఫోర్బ్స్ ఆసియా ద్వారా ఆసియా టాప్ 50 పవర్ బిజినెస్ వుమెన్‌లలో ఒకరిగా మల్లిక శ్రీనివాసన్ గుర్తించబడింది.

బిజినెస్ టుడే ద్వారా మల్లిక శ్రీనివాసన్ ఆరుగురు మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఒకరిగా పేరుపొందింది, అయితే ఏషియన్ బిజినెస్ లీడర్‌షిప్ ఫోరమ్ (ABLF) మల్లికా శ్రీనివాసన్ ను ఉమెన్ ఆఫ్ పవర్ అవార్డుతో సత్కరించింది. ప్రముఖ వార్తా సంస్థ ఎన్డిటీవీ మల్లికా శ్రీనివాసన్ కు 2012లో ఉత్తమ మహిళా వ్యాపారవేత్త అవార్డుని ఇచ్చింది. [4] 2018లో, ఫార్చ్యూన్ ఇండియా ద్వారా నిర్వహించిన సర్వేలో వ్యాపారంలో భారతదేశపు అత్యంత శక్తివంతమైన మహిళలలో మల్లికా శ్రీనివాసన్ ఐదవ స్థానంలో నిలిచింది. [5] 2020లో మల్లికా శ్రీనివాసన్ కు "బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్" అవార్డు లభించింది [6]

పదవులు

[మార్చు]
స్థానం సంస్థ సూచన
సభ్యురాలు - కార్యనిర్వాహక మండలి భారతిదాసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, తిరుచిరాపల్లి [7]
సభ్యురాలు - కార్యనిర్వాహక మండలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ [8]
సభ్యురాలు - పాలక మండలి (రూరల్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇంక్యుబేటర్) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై [9]
బోర్డు సభ్యురాలు AGCO కార్పొరేషన్, యునైటెడ్ స్టేట్స్ [10]
బోర్డు సభ్యురాలు (స్వతంత్ర, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) టాటా స్టీల్ [11]
గ్లోబల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ [12]

మూలాలు

[మార్చు]
  1. "TAFE's Mallika Srinivasan to heads PSEB". The Hindu (in Indian English). 2021-04-01. ISSN 0971-751X. Retrieved 2021-04-03.
  2. "Mallika Srinivasan". The Wall Street Journal. Retrieved 28 July 2015.
  3. "About Us / The Indira Sivasailam Foundation". The Indira Sivasailam Foundation. Archived from the original on 25 November 2014. Retrieved 28 July 2015.
  4. "Business Thought Leader of the Year: Mallika Srinivasan". NDTV Profit. Retrieved 28 July 2015.
  5. "Mallika Srinivasan - Most Powerful Women in 2018 - Fortune India". www.fortuneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2019-04-21.
  6. "Mallika Srinivasan awarded 'Businesswoman of the Year' at ETPrime Women Leadership Awards 2020". The Economic Times. Retrieved 2020-11-05.
  7. "Executive Board" (PDF).
  8. "Executive Board". Indian School of Business. Retrieved 2013-04-16.
  9. "Board of Directors". RTBI, IITM's Rural Technology and Business Incubator. Archived from the original on 18 February 2009. Retrieved 2013-04-16.
  10. "DIRECTORS AND OFFICERS". AGCO. Archived from the original on 24 April 2013. Retrieved 2013-04-16.
  11. "Board of Directors". TATA Steel. Archived from the original on 6 October 2014. Retrieved 2013-04-16.
  12. "Board of Directors". USIBC. Retrieved 2019-12-12.