మల్లి (దర్శకుడు)
మల్లిఖార్జున్ అలియాస్ మల్లి తెలుగు సినిమా దర్శకుడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను బి.కాం వరకు చదువుకున్నాడు. అతనికి నందమూరి తరక రామారావు గారిపై గల అభిమానంతో సినిమ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. గ్రాడ్యుయేషన్ చేస్తున్న కాలంలో శివ సినిమా విడుదలైంది. ఆ సినిమా చూసిన తరువాత దర్శకుడు కావాలని అనుకున్నాడు. తరువాత హైదరాబాదు వచ్చాడు. అసిస్టెంటు దర్శకునిగా అతను మొదట ఆషాఢం పెళ్ళి కొడుకు సినిమా లో పనిచేసాడు. తరువాత సూరి సినిమా లో శంకర్ వద్ద పనిచేసాడు. తరువాత "రూపాయి" సినిమాలో పనిచేసినా అది విడుదల కాలేదు. తరువాత పూరీ జగన్నాథ్ రెండవ సినిమా బాచి లో మొదటి అసోసియేట్ దర్శకునిగా పనిచేసాడు. రెండు కన్నడ సినిమాలలో పనిచేసి మొత్తం 12 సినిమాలలో పూరీ జగన్నాథ్ తో కలసి పనిచేసాడు.
కృష్ణవంశీ దగ్గర అసిస్టెంటు డైరెక్టరుగా తన కెరీర్‌ను ప్రారంభించిన మల్లి, కొన్నాళ్లు "ఢమరుకం" దర్శకుడు శ్రీనివాసరెడ్డి దగ్గర, ఆ తర్వాత పూరి జగన్నాధ్ దగ్గర కూడా పనిచేశారు. అల్లరి నరేష్, సదా ముఖ్యపాత్రలు పోషించిన "ప్రాణం" ఈయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌రామ్ నటించిన అభిమన్యు (2003), కత్తి (2010), షేర్ (2016) మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించారు.
చిత్రాలు
[మార్చు]మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మల్లి పేజీ
- "Chit Chat with "Kathi" lanti Director Mallikarjun - Kalyan Ram Kathi - YouTube". www.youtube.com. Retrieved 2020-07-27.