మల్లీశ్వరి (సంగీతం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లీశ్వరి సినిమాలోని పిలచిన బిగువటరా పాట

మల్లీశ్వరి అన్నది 1951లో అదే పేరుతో విడుదలైన తెలుగు చలన చిత్రానికి సౌండ్ ట్రాక్. చిత్రానికి బి.ఎన్.రెడ్డి దర్శకత్వం, వహించగా వాహినీ పతాకంపై ఎన్.టి.రామారావు, భానుమతి ప్రధాన తారాగణంగా నిర్మించారు. సినిమాకి సంగీతాన్ని సాలూరి రాజేశ్వరరావు సమకూర్చగా, సాహిత్యాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి అందించారు.[1]

సంగీతం[మార్చు]

సాలూరి రాజేశ్వరరావు మల్లీశ్వరి సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన భానుమతి మంచి గాయని కావడంతో ఎప్పటిలానే తన పాటలన్నీ తానే పాడుకుంది. తెలుగు సాంస్కృతిక చరిత్రలో ముఖ్యమైన విజయనగర కాలంలో రాయలు ఒక పాత్రగా సాగే ప్రేమకథ కావడంతో సినిమాలో పాటలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాణీలు స్వరపరచడం, రికార్డు చేయడం చేశారు.

మూలాలు[మార్చు]

  1. రాజా, ed. (1 అక్టోబరు 2001). "వాహినీ వారి మల్లీశ్వరి". హాసం - హాస్య సంగీత పత్రిక. హైదరాబాద్: వరప్రసాద రెడ్డి. 1 (1): 42–45. ఆ పాత పాట మధురం శీర్షకలో వ్యాసం

ఇతర లింకులు[మార్చు]