Jump to content

మల్లెల గురవయ్య

వికీపీడియా నుండి
మల్లెల గురవయ్య

మల్లెల గురవయ్య తెలుగు కవి, రచయిత. అతను విభిన్న సాహిత్య ప్రక్రియలు చేపట్టి, ఎందరిచేతనో ప్రశంసలు పొంది, ఎందరికో మార్గదర్శకులయ్యాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను నెల్లూరు జిల్లా, పిగిలం గ్రామంలో 1939, జూలై 2న జన్మించాడు. ఇతడు మదనపల్లె బి.టి.కళాశాలలో తెలుగు శాఖ అధిపతిగా పనిచేశాడు. మదనపల్లె రచయితల సంఘం (మరసం) ను స్థాపించి దానికి అధ్యక్షుడిగా కొనసాగాడు.

రచనలు

[మార్చు]
  1. శ్రీసీతారామరాజీయము
  2. అగ్నిపరశు
  3. శ్రీ వేంకటేశ విలాసము
  4. శ్రీ శివానంద సరస్వతి వైభవము
  5. తిరుమల మాహాత్మ్యము
  6. సద్గురువాణి
  7. శ్రీ రామకృష్ణ కర్ణామృతము - 1985-86

అతను కవిత్వం చాలావరకు సంప్రదాయబద్దం. అతను ఏ ప్రక్తియను చేపట్టినా అందులో ప్రాచీన సంప్రదాయ ప్రభావంతో పాటు దైవభక్తి, దాన్ని మించిన దేశభక్తి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రచనల్లో కనిపిస్తుంది.

1991లో భార్యా వియోగం సందర్భంగా "సతీస్మృతి" అనే కరుణ రస భరిత గ్రంథం వెలువడింది. జంటకవిగా అతను "అగ్ని పరశు" అనే ఖండ కావ్యాన్ని మేడవరం వేంకట నారాయణ శర్మ గారితో కలసి రచించాడు.

అతను షేక్ దావూద్ కృతులకు ఎంతో సంతోషించి అందులో గల సాహిత్యాన్ని కొంత చర్చింది "శ్రీ షిర్డీ సాయీ లీలా విభవము" అనే పేర రచించాడు.

మరణం

[మార్చు]

ఇతడు 2016, మార్చి 22న మదనపల్లెలో మరణించాడు.

మూలాలు

[మార్చు]