మస్తాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మస్తాని
An art impression of Mastani
An artist's impression of Mastani (dated 18th century A.D.)
జననం1699
Mau Sahaniya, Bundelkhand
మరణం1740
మరణ కారణంSuicide
సమాధి స్థలంPabal
జీవిత భాగస్వామిBaji Rao I
పిల్లలుShamsher Bahadur I (Krishna Rao)
తల్లిదండ్రులుChhatrasal
Ruhaani Bai Begum

మస్తానీ (సా.శ. 1699–1740) మహారాజా ఛత్రసాలు కుమార్తె, మరాఠా పేష్వా మొదటి బాజీరావు రెండవ భార్య.[1][2]

ఆరంభకాల జీవితం

[మార్చు]

మస్తానీ మహారాజా ఛత్రసలు రాజ్పుతు రాజు, ఆయన పర్షియను ముస్లిం భార్య రుహానీ బాయి బేగం దంపతులకు జన్మించింది.[3] ఆమె తండ్రి పన్నా రాజ్యం స్థాపించాడు.

ఆమె, ఆమె తండ్రి శ్రీ కృష్ణుడి భక్తి ఆరాధన ఆధారంగా ఆచరిచబడే ప్రణమి అనే హిందూ శాఖ అనుచరులుగా ఉన్నారు.[2]

ఆత్మకథ

[మార్చు]
పేష్వా మొదటి బాజీరావు

మొదటి బాజీరావుతో వివాహం

[మార్చు]

1728 లో " ముహమ్మదు ఖాను బంగాషు " ఛత్రసలు రాజ్యం మీద దాడి చేసి ఆయనను ఓడించి రాజధానిని ముట్టడించాడు. ఛత్రసలు బాజీరావు సహాయం కోరుతూ రహస్యంగా బాజీరావుకు లేఖ రాశాడు. కానీ మాల్వా బాజీరావులో సైనిక పోరాటం పాల్గొనడం కారణంగా 1729లో బుందేల్ఖండు వైపు వెళ్ళే వరకుచత్రసలుకు సైనికపరమైన మద్దతు ఇవ్వలేదు. చివరికి బాజీరావు ప్రస్తుత ఉత్తర ప్రదేశులోని కుల్పహారు సమీపంలో జైత్పూరు చేరుకున్న తరువాత బంగాషును ఓడించాడు.[4]

కృతజ్ఞతగా ఛత్రసాలు బాజీరావుకు తన కుమార్తె మస్తానీని ఇచ్చి వివాహం జరిపిస్తూ ఝాన్సీ, సాగరు, కల్పి మీద ఆధిపత్యం ఇచ్చి అలాగే ఆయన రాజ్యంలో మూడవ వంతు ఇచ్చాడు. మస్తానీతో వివాహం తరువాత ఆయన బాజీరావుకు 33 లక్షల బంగారు నాణేలు, బంగారు గనిని బహుమతిగా ఇచ్చాడు.[1][5] బాజీరావుకు అంతకు ముందుగానే వివాహం జరిగింది. బాజీరావు కుటుంబం ఏకపత్నీవిధానం వివాహం ఆచరిస్తూ ఉండేది. బాజీరావుకు ఏకపత్నీవ్రతం పట్ల ఆసక్తి ఉండేది. అయినప్పటికీ బాజీరావు చత్రసలు పట్ల ఉన్న గౌరవం కారణంగా ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నాడు.[6]

అంతేకాక మస్తానీ ముస్లిం వారసత్వం కారణంగా ఈ వివాహం అంగీకరించబడలేదు. మస్తానీ పూనానగరంలోని శనివారు రాజభవనంలో బాజీరావుతో కొంతకాలం నివసించింది. మస్తానీ మహలు రాజభవనం, ఈశాన్య మూలలో ఉంది. అందులో మస్తానీ దర్వాజా అని పిలువబడే బాహ్యద్వారం ఉంది. ఆయన కుటుంబం మస్తానీ పట్ల అసహనం ప్రదర్శించిన కారణంగా బాజీరావు 1734 లో కోత్రుడు వద్ద మస్తానీ కోసం ఒక ప్రత్యేక నివాసం నిర్మించాడు.[7] ఈ స్థలం ఇప్పటికీ " శనివారు వాడా " నుండి కొంత దూరంలో ఉన్న కార్వే రోడులోని మృత్యుంజయ ఆలయంలో ఉంది. ప్రస్తుతం కోత్రుడులోని రాజభవనం కూల్చివేయబడింది. దీని అవశేషాలలో కొంతభాగం రాజా దింకరు కేల్కరు మ్యూజియంలోని ప్రత్యేక విభాగంలో ప్రదర్శించబడుతున్నాయి.[7][8]

షంషేరు బహదూరు (క్రిష్ణారావు)

[మార్చు]

బాజీరావు మొదటి భార్య కాశీబాయి ఒక కొడుకును ప్రసవించిన కొద్ది నెలల్లోనే మస్తానీకి కృష్ణారావు అనే కొడుకు పుట్టాడు. కానీ ముస్లిం తల్లి నుండి జన్మించిన కృష్ణారావుకు హిందూ ఉపనయన వేడుక నిర్వహించడానికి నిరాకరించారు. ఈ బాలుడికి చివరికి షంషరు బహదూరు అని పేరు పెట్టారు. ఫలితంగా ముస్లింగా పెరిగాడు.[6]

1740 లో బాజీరావు, మస్తానీ మరణించిన తరువాత కాశీబాయి 6 సంవత్సరాల షంషరు బహదూరును తన సంరక్షణలో తీసుకొని ఆయనను తనలో ఒకరిగా పెంచుకున్నది. తన తండ్రి బండా, కల్పి ఆధిపత్యంలో కొంత భూభాగాన్ని షంషరుకు అందజేసింది. 1761 లో ఆయన, ఆయన సైన్యం బృందం మరాఠాలు, ఆఫ్ఘన్ల మధ్య జరుగిన మూడవ పానిపట్టు యుద్ధంలో పేష్వాతో కలిసి పోరాడారు. ఆ యుద్ధంలో గాయపడిన షంషరు కొన్ని రోజుల తరువాత డీగు వద్ద మరణించాడు.[9]

మరణం

[మార్చు]

మస్తానీ 1740లో మరణించింది. ఆమె మరణానికి కారణం గూఢంగానే ఉంది. కొంతమంది భాజీరావు మరణించిన తరువాత ఆయనమరణం కల్గించిన దిగ్భ్రాంతి కారణంగా ఆమె మరణించిందని భావిస్తున్నారు. మరికొందరు భాజీరావు మరణించిన తరువాత ఆమె హత్యచేయబడిందని భావించారు. అయినప్పటికీ చాలామంది ఆమె తన ప్రేమికుడైన భాజీరాలు ఇచ్చిన అంగుళీయం లోని విషం ఉపయోగించి ఆత్మహత్యచేసుకున్నదని భావించారు. మరికొందరు ఆమె భాజీరావు మరణించిన తరువాత సతి ఆచారం అనుసరించి మరణించిందని విశ్వసించారు. మస్తానీ శరీరం పబలు గ్రామంలో సమాధి చేయబడింది. ఆమె హిందూ, ముస్లిం ఆచారాలను పాటించినదానికి గుర్తుగా ఆమె సమాధిని మస్తానీసమాధి, మస్తాజీమజీరు అన్న పేర్లతో పిలువబడింది.[5][10]

సంతతి

[మార్చు]

షంషరు బహదూరు కుమారుడు నవాబు మొదటి అలీ బహదూరుకు మస్తానీకి వరకట్నంగా వచ్చిన - ఝాన్సీ, సాగరు, కల్పి మొదలైన రాజ్పుతానా భూభాగాలు ఇవ్వబడ్డాయి. 1858 లో, 1857 లో జరిగిన భారత తిరుగుబాటు సమయంలో ఆయన కుమారుడు నవాబు రెండవ అలీ బహదూరు ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి పంపిన రాఖీ మీద స్పందించి బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడారు.[11][12]

మాధ్యమంలో

[మార్చు]
భుజీలోని అయినమహలులో ప్రదర్శించబడుతున్న మస్తానీ వర్ణచిత్రం.
సంప్రదాయ భారతీయ కుడ్యచిత్రం. 2016 లో ముంబైలో కక్ష్యాచిత్ర లిఖించాడు.

సాహిత్యం

[మార్చు]
 • 1972 - రౌ, నాగ్నాథు ఎస్. ఇనాందారు రాసిన మరాఠీ నవలలో మొదటి బాజీ రావు, మస్తానీల మధ్య ప్రేమకథ ఉన్నట్లు వర్ణించబడి ఉంది.[13]

చలన చిత్రాలు

[మార్చు]
 • 1955 - ధీరూభాయి దేశాయి దర్శకత్వం వహించిన మస్తానీ. ఇందులో నిగరు సుల్తానా, మన్హెరు దేశాయి, షాహు మోడకు, ఆఘా నటించారు.[14]
 • 2015 - మరాఠీ నవల రౌ ఆధారంగా సంజయి లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన బాజీరావు మస్తానీ చలనచిత్రంలో దీపికా పడుకోనే, రణవీరు సింగు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు.[15]

దూరదర్శను

[మార్చు]
 • 1990 - నవల ఆధారంగా అదే పేరుతో రౌ ఎ మరాఠీ టీవీ సిరీసు ప్రసారం చేయబడింది.[ఆధారం చూపాలి]
 • 2015 - ఈటివి మరాఠీలో శ్రీమంతు పేష్వా బాజీరావు మస్తానీ పేరుతో మరాఠీ టివి సీరియలు ప్రసారం.[16]
 • 2017 - సోనీ టీవీ ఇండియాలో పేష్వా బాజీరావు పేరుతో హిందీ టీవీ సిరీసు ప్రదర్శించబడి ప్రసారం చేయబడింది.

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 Chopra, Kusum. Mastani (in ఇంగ్లీష్). Rupa Publications. ISBN 9788129133304. Archived from the original on 2018-07-02. Retrieved 2020-01-03.
 2. 2.0 2.1 "How Bajirao and Mastani became a byword for doomed romance". Archived from the original on 2019-06-22. Retrieved 2020-01-03.
 3. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 187–188. ISBN 978-9-38060-734-4.
 4. G.S.Chhabra (1 January 2005). Advance Study in the History of Modern India (Volume-1: 1707-1803). Lotus Press. pp. 19–28. ISBN 978-81-89093-06-8. Archived from the original on 14 ఆగస్టు 2019. Retrieved 3 జనవరి 2020.
 5. 5.0 5.1 "How Bajirao's Mastani united Hindus and Muslims after her death" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2016-10-20. Retrieved 2017-12-01.
 6. 6.0 6.1 Mehta, J. L. (2005). Advanced study in the history of modern India, 1707-1813. Slough: New Dawn Press, Inc. p. 124. ISBN 9781932705546.
 7. 7.0 7.1 Rajakelkar Museum Archived 8 మార్చి 2005 at the Wayback Machine accessed 3 March 2008
 8. Tribure India Archived 2016-04-19 at the Wayback Machine accessed 3 March 2008
 9. Burn, Sir Richard (1964). The Cambridge History of India (in ఇంగ్లీష్). CUP Archive.
 10. Mishra, Garima (20 November 2015). "Grave of Mastani: Hindus call it samadhi :), Muslims mazaar". Indian Express. Archived from the original on 23 జనవరి 2016. Retrieved 15 January 2016.
 11. "The Mastani Mystery - Ahmedabad Mirror". Ahmedabad Mirror. Archived from the original on 2016-08-05. Retrieved 2017-12-01.
 12. "नवाब बांदा को राखी भेजकर रानी लक्ष्मीबाई ने मांगी थी मदद- Amarujala". Amar Ujala (in ఇంగ్లీష్). Archived from the original on 2016-03-04. Retrieved 2017-12-01.
 13. Inamdar, N. S. (2016-10-20). Rau - The Great Love Story of Bajirao Mastani (in ఇంగ్లీష్). Pan Macmillan. ISBN 9781509852277. Archived from the original on 2018-08-17. Retrieved 2020-01-03.
 14. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Mastani
 15. Jha, Subhash K (19 October 2015). "Bajirao Mastani review: This gloriously epic Priyanka, Deepika and Ranveer-starrer is the best film of 2015". Firstpost. Archived from the original on 8 ఏప్రిల్ 2016. Retrieved 19 October 2015.
 16. "ETV website". Etv.co.in. Archived from the original on 26 March 2015. Retrieved 2013-12-03.

అదనపు అధ్యయనం

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మస్తాని&oldid=4102756" నుండి వెలికితీశారు