Jump to content

మస్రత్ జహ్రా

వికీపీడియా నుండి
మస్రత్ జహ్రా
2020లో జహ్రా
జననంమస్రత్ జహ్రా
(1993-12-08) 1993 డిసెంబరు 8 (వయసు 31)
హవల్, జమ్మూ కాశ్మీరు, భారతదేశం
జాతీయతభారతీయురాలు
పౌరసత్వంభారతీయత
విశ్వవిద్యాలయాలుకాశ్మీర్ కేంద్ర విశ్వవిద్యాలయం
వృత్తిఫోటో జర్నలిస్టు
పురస్కారాలు
  • అంజా నీడ్రింగ్హాస్ కరేజ్ ఇన్ ఫోటోజర్నలిజం అవార్డ్
  • పీటర్ మాక్లర్ అవార్డ్ ఫర్ కరేజియస్ & ఎథికల్ జర్నలిజం 2020

మస్రత్ జహ్రా (జననం 8 డిసెంబర్ 1993) జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్. ఈమె స్థానిక వర్గాల, మహిళల గురించి వార్తలాను కవర్ చేస్తుంది. ఈమె ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ నుండి ఫోటో జర్నలిజం లో 2020 సంవత్సరానికి "అంజా నీడ్రింగ్హాస్ కరేజ్" అవార్డును, అదే ఏడాది సాహసిక, నైతిక జర్నలిజంలో పీటర్ మాక్లర్ అవార్డును గెలుచుకుంది.

జీవిత విశేషాలు

[మార్చు]

మస్రత్ జహ్రా 1993 డిసెంబర్ 8న జమ్మూ కాశ్మీర్ హవల్ గ్రామంలో ఒక కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించింది.[1][2][3] ఈమె తండ్రి ట్రక్ డ్రైవర్, తల్లి గృహిణి.[2] ఈమె కాశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీలో జర్నలిజం చదువుకుంది.[1] ఈమె కాశ్మీర్‌లో జరుగుతున్న సంఘర్షణను తన ఫోటోల ద్వారా చిత్రీకరించి ది వాషింగ్టన్ పోస్ట్, ది న్యూ హ్యుమానిటేరియన్, TRT వరల్డ్, అల్ జజీరా, ది కారవాన్, ది సన్, ది న్యూస్ అరబ్ , ది వరల్డ్ వీక్లీ మొదలైన అంతర్జాతీయ పత్రికలలో ప్రచురింపజేసింది.[4][5][1] మహిళా ఫోటో జర్నలిస్టుగా ఈమె తరచూ ఉద్యోగపరమైన వివక్షతను, లింగ వివక్షతనూ ఎదురుకుంది.[6]

ఏప్రిల్ 2018లో, జహ్రా తన ఫేస్‌బుక్‌లో ఒక ఎన్కౌంటర్ సైట్ నుండి ఒక చిత్రాన్ని పంచుకున్న కారణంగా ఈమెకు పోలీస్ ఇన్‌ఫార్మర్‌ అనే ముద్ర వేశారు. [7][8] 2019 ఆగస్టు 3న, భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆంక్షలకు ముందు, జర్నలిస్ట్స్ అండర్ ఫైర్ అనే ప్రదర్శన కోసం చిత్రాలను సమర్పించమని ఈమెను కోరారు. ఇది న్యూయార్క్ నగరం లో యునైటెడ్ ఫోటో ఇండస్ట్రీస్, సెయింట్ ఆన్స్ వేర్హౌస్‌లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్‌ల సహకారంతో నిర్వహించిన ఒక ప్రదర్శన. అదే రోజున, రియల్ కాశ్మీర్ ఎఫ్. సి. అనే ఒక ఫ్రెంచ్ క్రీడా పత్రిక ఫోటోల కోసం కేటాయింపుల కోసం ఈమెను సంప్రదించింది. 5 ఆగస్టు 2019న ప్రారంభమైన కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ కారణంగా, ఈ ప్రయత్నాలు సఫలం కాలేదు. 2020 ఏప్రిల్లో, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ చట్టం) కింద జహ్రా పేరుపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఇది సాధారణంగా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించబడే చట్టం. జహ్రా "యువతను ప్రేరేపించే నేరపూరిత ఉద్దేశ్యంతో" ఫేస్‌బుక్‌లో "దేశ వ్యతిరేక పోస్టులను" పెడుతున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు, అయితే ఆమె తాను ఇదివరకు ప్రచురించిన ఛాయాచిత్రాలను మాత్రమే అప్లోడ్ చేసింది.[9] ఇది పాత్రికేయులపై దాడిగా సుమారు 450 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులు మరిపండితులు ఈ చర్యను ఖండించారు.

అవార్డులు

[మార్చు]

2020లో, జహ్రా ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ నుండి ఫోటో జర్నలిజంలో "అంజా నీడ్రింగ్హాస్ కరేజ్" అవార్డు గెలుచుకుంది.[10][11][4] "కాశ్మీర్ మహిళల గురించి వార్తా కథనాలను అందజేసినందుకు " ఈమెకు సాహసిక, నైతిక జర్నలిజం విభాగంలో 2020 సంవత్సరానికి పీటర్ మాక్లర్ అవార్డు లభించింది.[12]

సూచనలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Majid Maqbool (25 August 2018). "Kashmir through the female gaze". The Hindu. Retrieved 11 June 2020.
  2. 2.0 2.1 "In Kashmir, an empty bed signifies a life lost" (in ఇంగ్లీష్). Al Jazeera English. 20 Jan 2020. Retrieved 12 June 2020.
  3. Maqbool, Majid (25 Aug 2018). "Kashmir through the female gaze". The Hindu. Retrieved 12 June 2020.
  4. 4.0 4.1 Rebecca Staudenmaier (11 June 2020). "Kashmir conflict photographer Masrat Zahra wins top photojournalism award". Deutsche Welle. Retrieved 11 June 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "dw" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. Bilal Kuchay (20 April 2020). "Kashmir journalist charged for 'anti-national' social media posts". Al Jazeera English. Retrieved 11 June 2020.
  6. "Masrat Zahra". International Women's Media Foundation.
  7. RAHIBA R. PARVEEN (16 May 2018). "Woman photojournalist who covered Kashmir encounter labelled as police informer". ThePrint. Retrieved 11 June 2020.
  8. "In India, Kashmiri photojournalist faces harassment, threats". Committee to Protect Journalists. 22 May 2018. Retrieved 11 June 2020.
  9. "Who is Kashmiri journalist Masrat Zahra? Why was she booked under UAPA?". The Free Press Journal. 20 April 2020. Retrieved 11 June 2020.
  10. "Anja Niedringhaus Courage In Photojournalism Award". International Women's Media Foundation. Retrieved 11 June 2020.
  11. "Masrat Zahra Wins Top Photojournalism Award". Kashmir Observer. 11 June 2020. Retrieved 11 June 2020.
  12. "Journalist Masrat Zahra wins 2020 Peter Mackler Award for Courageous and Ethical Journalism". The Kashmir Walla. 22 August 2020. Archived from the original on 22 August 2020. Retrieved 22 August 2020.{{cite news}}: CS1 maint: unfit URL (link)