మహాత్మా గాంధీ విగ్రహం, జోహన్నెస్‌బర్గ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాత్మా గాంధీ విగ్రహం
Johannesburg Mahatma Gandhi.jpg
2004.లో మహాత్మా గాంధీ విగ్రహం
కళాకారుడుటింకా క్రిస్టోఫర్
సంవత్సరం2003 (2003)
విషయంమహాత్మాగాంధీ
ప్రదేశంగాంధీ స్క్వేర్, జోహన్స్‌బర్గ్
Coordinates26°12′23″S 28°02′35″E / 26.20647°S 28.04316°E / -26.20647; 28.04316Coordinates: 26°12′23″S 28°02′35″E / 26.20647°S 28.04316°E / -26.20647; 28.04316

మోహన్ దాస్ కరం చంద్ గాంధీ కాంస్య విగ్రహం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వద్ద గల గాంధీ స్క్వేర్ వద్ద నెలకొల్పబడింది. ఈ విగ్రహం భారత స్వాతంత్ర్యసమరయోధుడు మహాత్మా గాంధీ కి స్మారకంగా ఏర్పాటు చేసారు. ఈ విగ్రహం భారత స్వాతంత్ర్య ప్రచారకుడు, అహింసా శాంతి కాముకుడిగా ఉన్న యువకుని రూపంలో గాంధీ గారిని చిత్రీకరిస్తుంది.

వివరణ, చరిత్ర[మార్చు]

విగ్రహం ఆవిష్కరించడానికి ముందు ఈ ప్రాంతంలోని స్క్వేరును ప్రభుత్వ స్క్వేర్ అని పేరు పెట్టారు. గాంధీ పుట్టినరోజు అయిన 2003 అక్టోబర్ 2న దీనిని జోహన్నెస్‌బర్గ్ మేయర్ అమోస్ మసోండో ఆవిష్కరించాడు. [1]

ఈ స్క్వేరును గతంలో ప్రభుత్వ స్క్వేర్ అని పిలిచేవారు. ఈ ప్రాంతం గాంధీ న్యాయశాస్త్రాన్ని అభ్యసించే జోహన్నెస్‌బర్గ్ న్యాయస్థానాల ప్రదేశం. ప్రధాన జోహన్నెస్బర్గ్ బస్ టెర్మినస్ ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్న చోట ఉంది. . [1]

ఈ విగ్రహం నిర్మించడానికి శిల్పిగా టింగా క్రిస్టోఫర్ ను జోహన్నెస్‌బర్గ్ ఆర్ట్ గ్యాలరీ సలహా కమిటీ ఎంపిక చేసింది. ఈ విగ్రహాన్ని క్రిస్టోఫర్ పూర్తి చేయడానికి మూడు నెలల కాలం పట్టింది, క్రిస్టోఫర్ ఈ విగ్రహ నిర్మాణం గురించి వివరిస్తూ "... ఆమె ప్రతిరోజూ 10 గంటల పాటు, వారానికి ఏడు రోజులు, ఈ పనిని పూర్తి చేయడానికి పని చేసినట్లు" చెప్పింది. దీని నిర్మాణంలో కృషి చేసిన ఇతర కళాకారులు నవోమి జాకబ్సన్, బెన్ ఒమర్, మౌరీన్ క్విన్. [1]

ఈ విగ్రహం 5 మీటర్ల ఎత్తైన స్తంభంపై ఉంది. ఈ విగ్రహం యొక్క స్థావరం చుట్టూ బెంచీలు ఉన్నాయి. ఈ విగ్రహం గాంధీ జోహన్నెస్‌బర్గ్‌లో తాను న్యాయవాదిగా పనిచేస్తున్న కాలంలో కనిపించినట్లుగా, ఒక యువకుడు తన న్యాయవాద వృత్తికి సంబంధించిన గౌనును తన సూట్ మీద ధరించినట్లు, గాలితో తన వస్త్రం ఎగురుతున్నట్లు ఉంది. ఈ విగ్రహంలో గాంధీ ఒక పుస్తకం పట్టుకొని ఎదురు చూస్తున్నాడు. ఈ విగ్రహంలో దొంగతనం నుండి రక్షించేందుకు దాని నుండి వచ్చే ప్రకంపనలను గుర్తించే భద్రతా సంస్థ పర్యవేక్షించే అలారం ఉంది. [1]

ఈ విగ్రహానికి జోహాన్నెస్‌బర్గ్ నగరం సగం నిధులు సమకూర్చింది, మిగిలినవి ప్రైవేట్ విరాళాల నుండి వచ్చాయి. [1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "SAInfo" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "SAInfo" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "SAInfo" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "SAInfo" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు