మహా భాష్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది ఒక ప్రాచీన సంస్కృత వ్రాకరణ గ్రంథము. దీనిని రచించినది పతంజలి మహర్షి.

పాణినీయ వ్యాకరణము పై అన్నిటికంటె మహత్వపూర్ణకృతి పతంజలి రచించిన మహాభాష్యము.దీని భాష అత్యంత సరళ, సరస, స్వాభావికమైనది. గ్రంథ రచనా దృష్టిచే ఇది ఆదర్శభూతమై యొప్పునది. పతంజలి శుంగవంశ మహారాజైన పుష్యమిత్రుని సమకాలికుడు.వారి పురోహితుడని తలచుచుండిరి. పుష్యమిత్రుని కాలము విక్రమదశకు 150 ఏండ్ల పూర్వము.

మహాభాష్యము టీకలు

[మార్చు]

మహాభాష్యము పైన అనేక వైయాకరణులు టీకా గ్రంథములు రచించిరి. ఇవి రెండు విభాగములు. తిన్నగా మహాభాష్యముపై రచించిన టీకాగ్రంధములు, కైయట విరచిత మహాభాష్య ప్రదీపముపై విరచించబడిన టీకాగ్రంధములు. మహాభాష్యముపై విరచించబడిబ టీకాగ్రంధములలో నేడు 20 గ్రంథములు సమగ్ర-అసమగ్ర గ్రంథములు లుపలబ్ధములు.ఇట్లె మహాభాష్య ప్రదీపముపైన వ్రాయబడిన 15 గ్రంథములు ఉన్నాయి. ఈటెకాగ్రంధములలో అన్నింటికంటె ప్రాచీనమైనదై మహత్వపూర్ణమైనది అగు గ్రంథము భర్తృహరి రచించిన మహాభాష్యదీపిక.

భర్తృహరి విరచించిన మహాభాష్య టీక విషయముపై మహాభాష్య ప్రదీపము, గణరత్న మహోదధి మొదలైన అనేక గ్రంథములలో నుల్లిఖితమై ఉంది. గణరత్న మహోదధిలో మహాభాష్యదీపికా పరిమాణము 3 పాదములని వ్రాయబడి ఉంది.దీని ఏకైక హస్తలేఖ బర్లిన్ (Berlin University) పుస్తకాలయములో ఉంది.అది ప్రథమ పాదముయొక్క రిచ్చ సూత్రముపై (1-1-53) సూత్రముపై సమాప్తమగుచున్నది.దాని మొదటి రెండు పుటలను ఖండితములైయున్నవి. ఈహస్తలేఖ విషయమై ప్రథమ పరిచయ మొనర్చిన కీల్ హార్న్ స్తుతిపాత్రుడు. దీని ప్రతికృతి (ఫోటో) ఒకటి లాహోర్ వొశ్వవిద్యాలయములో ఉండెడిది.1930 సం.లో మహావైయాకరుణులగు పండిత బ్రహ్మదతా మహాశయుడా ప్రతికృతిని సంపాదించి దానికొక ప్రతిలిపి వ్రాసియుండెను. దానిని మద్రాసు పుస్తకాలయములో ఉంచెరి.

భర్తృహరి మహాభాష్యదీపిక తరువాత భాష్యముయొక్క మహత్తర వ్యాఖ్య కైయుటుడు విరచిత మహాభాష్యప్రదీపము అను గ్తంధము.ఈ వ్యాఖ్య మిక్కిలి సరళమైనది.పాండిత్యపూర్ణమైనది.ఇప్పటికి ఈగ్రంధమే ముఖ్యసాధనము భాష్యమును అర్ధము చేసుకొనుటకు. దీని యందు ఉపయోగములను చూచి వైయాకరణులు అనేకులు మహాభాష్యమునకు వ్యాఖ్యలు వ్రాయక దీనికే టీకలు వ్రాసిరి. పూర్ణ లేక ఆంశిక రూపమున పలు పుస్తకాలయములలో ఇవి ఉన్నాయి.

మూలము

[మార్చు]
  • 1957 భారతి సంచిక -వ్యాసకర్త- శ్రీ. తటవర్తి సూర్యనారాయణమూర్తి