మహువా మోయిత్రా
మహువా మోయిత్రా | |||
లోక్‌సభ ఎంపీ
| |||
పదవీ కాలం 23 మే 2019 – 8 డిసెంబర్ 2023[1] | |||
ముందు | తపస్ పాల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కృష్ణానగర్ | ||
ఆధిక్యత | 63,218 | ||
శాసనసభ్యురాలు
| |||
పదవీ కాలం 26 మే 2016 – 23 మే 2019 | |||
ముందు | సమరేద్రనాథ్ ఘోష్ | ||
తరువాత | బీమాలేందు సిన్హా రాయ్ | ||
నియోజకవర్గం | కరీంపూర్ | ||
మెజారిటీ | 15,989 | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లాబాక్, కచార్ జిల్లా, అస్సాం రాష్ట్రం, భారతదేశం[2] | 1974 అక్టోబరు 12||
రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ | ||
పూర్వ విద్యార్థి | మౌంట్ హాయోకే కాలేజ్ | ||
వృత్తి | ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ రాజకీయ నాయకురాలు |
మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా గెలిచింది. మహువా మోయిత్రా 2022లో జరిగిన గోవా శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా పని చేసింది.[3]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]మహువా మొయిత్రా 1974 అక్టోబరు 12న అస్సాం రాష్ట్రం, కచార్ జిల్లా, లాబాక్ లో ద్విపేంద్ర లాల్ మొయిత్రా, మంజూ మొయిత్రా దంపతులకు జన్మించింది. ఆమె కోల్‌కతాలో ఎకనమిక్స్, యు.ఎస్.లోని మాసెచూసెట్స్ లో మ్యాథ్స్ ని పూర్తి చేసి న్యూయార్క్‌లోని జేపీ మోర్గాన్ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా, లండన్‌లోని కంపెనీ బ్రాంచ్ లో పని చేసి ఉద్యోగాన్ని వదులుకుని 2009లో రాజకీయాల్లోకి వచ్చింది.
రాజకీయ జీవితం
[మార్చు]మహువా మొయ్‌త్రా 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె 2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున కరీంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. మహువా మొయ్‌త్రా 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కల్యాణ్ చౌబేపై 63,218 ఓట్ల మెజార్టీతో గెలిచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4]
మహువా మొయ్‌త్రా 2019లో ఎంపీగా గెలిచినా తరువాత లోక్‌సభ సమావేశాల్లో పాల్గొని ఎన్డీయే నియంతృత్వ పోకడలపై తన తొలి ప్రసంగంతో విరుచుకుపడి దేశవ్యాప్తంగా గుర్తింపునందుకుంది.[5] ఆమె ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ఐటీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉంది.[6]
ఫిర్యాదులు \ వివాదాలు
[మార్చు]- మహువా మొయ్‌త్రా పై 2019 జూన్ 25న లోక్‌సభలో ఆమె చేసిన ప్రసంగంలో జీ న్యూస్ ఛానెల్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ, ఆ సంస్ధ యజమానిని చోర్ అని సంబోధించారని, తమ ఛానెల్ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఆమె ప్రసంగం ఉంది అని ఆ ఛానెల్ చీఫ్ సుధీర్ చౌదరీ ఆమెపై పరువునష్టం దావా కేసు వేశాడు.[7][8]
- క్యాష్ ఫర్ క్వెరీ[9][10]
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (9 December 2023). "మహువాపై బహిష్కరణ వేటు". Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.
- ↑ Lok Sabha (2019). "Mahua Moitra". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
- ↑ The Indian Express (13 November 2021). "TMC appoints Mahua Moitra as party's Goa in-charge ahead of Assembly polls" (in ఇంగ్లీష్). Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
- ↑ Sakshi (5 July 2019). "'ఆ ముగ్గురు' ముచ్చెమటలు పట్టిస్తున్నారు". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
- ↑ The Indian Express (1 July 2019). "Who is Mahua Moitra?" (in ఇంగ్లీష్). Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
- ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ TV9 Telugu (20 July 2019). "తృణమూల్ ఎంపీ మొత్రాయ్‌పై పరువునష్టం కేసు". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (19 July 2019). "సంచలన ఎంపీపై పరువునష్టం దావా". Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
- ↑ Andhrajyothy (9 November 2023). "మహువా మోయిత్రాపై వేటు.. పార్లమెంట్ నుంచి బహిష్కరణ.. 6:4 తీర్పుతో ఎథిక్స్ ప్యానెల్ ఆమోదం". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Sakshi (16 April 2024). "వివాదాలకు కేరాఫ్.. ఫైర్‌బ్రాండ్ మహువా". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.