Jump to content

మహెదీ హసన్

వికీపీడియా నుండి
మహెదీ హసన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1994-12-12) 1994 డిసెంబరు 12 (వయసు 30)
ఖుల్నా, బంగ్లాదేశ్
ఎత్తు167[1] cమీ. (5 అ. 6 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 135)2021 మార్చి 20 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2023 ఆగస్టు 31 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 63)2018 ఫిబ్రవరి 18 - శ్రీలంక తో
చివరి T20I2022 సెప్టెంబరు 1 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016Barisal Bulls
2017కొమిల్లా విక్టోరియన్స్
2018–presentGazi Group Cricketers
2019ఢాకా ప్లాటూన్
2022Khulna Tigers
మూలం: Cricinfo, 1 September 2022

మహెదీ హసన్ (జననం 1994 డిసెంబరు 12) బంగ్లాదేశ్ క్రికెటరు. అతను ఖుల్నా డివిజన్‌కు, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకూ ఆడుతున్నాడు. [2] 2018 ఫిబ్రవరిలో మహెదీ, బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగుపెట్టాడు.[3]

దేశీయ కెరీర్

[మార్చు]

2016–17 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో బరిసల్ బుల్స్ తరపున ఆడిన మహెదీ, 2016 నవంబరు 8న తన తొలి ట్వంటీ20 మ్యాచ్ ఆడాడు.[4]

మహెదీ 2018 అక్టోబరులో, 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, కొమిల్లా విక్టోరియన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [5] 2018 నవంబరులో, 2018–19 బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌లో సౌత్ జోన్ తరపున బౌలింగ్ చేస్తూ, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్ల పంట సాధించాడు. [6] 2019 ఆగస్టులో, బంగ్లాదేశ్ 2019-20 సీజన్‌కు ముందు శిక్షణా శిబిరంలో చేరిన 35 మంది క్రికెటర్లలో అతను ఒకడు. [7] 2019 నవంబరులో, 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా ప్లాటూన్ కోసం ఆడేందుకు ఎంపికయ్యాడు. [8]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2018 ఫిబ్రవరిలో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో మహెదీ ఎంపికయ్యాడు. [9] అతను 2018 ఫిబ్రవరి 18న శ్రీలంకపై బంగ్లాదేశ్ తరపున తన T20I రంగప్రవేశం చేసాడు [10] మళ్లీ 2019-20 బంగ్లాదేశ్ ట్రై-నేషన్ సిరీస్‌లో మొదటి రెండు T20Iల కోసం అతన్ని జట్టులోకి తీసుకున్నారు గానీ అతన్ని ఆడించలేదు. తదుపరి రెండు T20Iల నుండి తొలగించారు. [11] 2019 నవంబరులో, అతను బంగ్లాదేశ్‌లో జరిగే 2019 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [12] అదే నెలలో, 2019 దక్షిణాసియా క్రీడలలో పురుషుల క్రికెట్ టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [13] బంగ్లాదేశ్ జట్టు, ఫైనల్లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. [14]

2021 జనవరిలో, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో మహెదీని ఎంపిక చేశారు. [15] మరుసటి నెలలో, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం కూడా ఎంపికయ్యాడు. [16] అతను బంగ్లాదేశ్ తరపున 2021 మార్చి 20న న్యూజిలాండ్‌పై తన వన్‌డే రంగప్రవేశం చేశాడు. [17]

2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [18]

మూలాలు

[మార్చు]
  1. ডেস্ক, খেলা. "অস্ট্রেলীয়রা অসুবিধা মনে করছে নিজেদের উচ্চতাকেই". Prothomalo (in Bengali). Retrieved 6 August 2021.
  2. "Mahedi Hasan". ESPN Cricinfo. Retrieved 25 September 2016.
  3. "Mahedi Hasan profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 22 July 2021.
  4. "Bangladesh Premier League, 2nd Match: Barisal Bulls v Dhaka Dynamites at Dhaka, Nov 8, 2016". ESPN Cricinfo. Retrieved 8 November 2016.
  5. "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. Retrieved 29 October 2018.
  6. "Sylhet braces for intriguing final day". The Daily Star (Bangladesh). Retrieved 24 November 2018.
  7. "Mohammad Naim, Yeasin Arafat, Saif Hassan - A look into Bangladesh's future". ESPN Cricinfo. Retrieved 17 August 2019.
  8. "BPL draft: Tamim Iqbal to team up with coach Mohammad Salahuddin for Dhaka". ESPN Cricinfo. Retrieved 18 November 2019.
  9. "Bangladesh pick five uncapped players for Sri Lanka T20I". ESPN Cricinfo. 10 February 2018. Retrieved 10 February 2018.
  10. "2nd T20I (N), Sri Lanka Tour of Bangladesh at Sylhet, Feb 18 2018". ESPN Cricinfo. 18 February 2018. Retrieved 15 February 2018.
  11. "Bangladesh include uncapped Mohammad Naim, Aminul Islam for next two T20Is". Cricbuzz. Retrieved 16 September 2019.
  12. "Media Release : Bangladesh squad for Emerging Teams Asia Cup 2019 announced". Bangladesh Cricket Board. Retrieved 11 November 2019.
  13. "Media Release : Bangladesh U23 Squad for 13th South Asian Game Announced". Bangladesh Cricket Board. Retrieved 6 December 2019.
  14. "South Asian Games: Bangladesh secure gold in men's cricket". BD News24. Retrieved 9 December 2019.
  15. "Shakib Al Hasan named in Bangladesh squad for West Indies ODIs". ESPN Cricinfo. Retrieved 16 January 2021.
  16. "Bangladesh leave out Taijul Islam for New Zealand tour". ESPN Cricinfo. Retrieved 19 February 2021.
  17. "1st ODI, Dunedin, Mar 19 2021, Bangladesh tour of New Zealand". ESPN Cricinfo. Retrieved 20 March 2021.
  18. "No surprises as Bangladesh name Mahmudullah-led squad for T20 World Cup". ESPN Cricinfo. Retrieved 9 September 2021.