Jump to content

మహేష్ సావంత్

వికీపీడియా నుండి
మహేష్ సావంత్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు సదా సర్వాంకర్
నియోజకవర్గం మహిమ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి) (2022 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు శివసేన (2022 వరకు)
వృత్తి రాజకీయ నాయకుడు

మహేష్ సావంత్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహిమ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

మహేష్ సావంత్ 1990లో శివసేన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2017 ముంబై మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన మున్సిపల్ ఎన్నికల తర్వాత తిరిగి శివసేనలో చేరాడు.[3] సదా శరవంకర్ షిండే గ్రూపులో చేరిన తర్వాత శివసేన సావంత్‌కు మహిమ్ శాసనసభ నియోజకవర్గం శివసేన (యుబిటి) ఇన్‌చార్జ్‌గా నియమితుడై 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహిమ్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సదా సర్వాంకర్‌పై 1,316 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 50,213 ఓట్లతో విజేతగా నిలవగా, సదా సర్వాంకర్‌ కి 48,897 ఓట్లు వచ్చాయి.[6]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Double win for UBT in Mahim: Mahesh Sawant defends Sena fortress, becomes first to defeat a Thackeray-Raj's son". The Times of India. 24 November 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  3. "सरवणकरांचा समर्थक ते विरोधक अन् आता ठाकरेंचा विश्वासू महेश सावंत कोण?". News18 मराठी. 23 October 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
  4. Hindustantimes (23 November 2024). "Lowest win margins in Maharashtra, one candidate won by just 162 votes". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  6. "Maharastra Assembly Election Results 2024 - Mahim" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.