మహ్మద్ అబ్బాస్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహ్మద్ అబ్బాస్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1990-03-10) 1990 మార్చి 10 (వయసు 34)
సియాల్‌కోట్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 226)2017 ఏప్రిల్ 21 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2021 ఆగస్టు 20 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 220)2019 మార్చి 22 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2019 మార్చి 31 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009–2015Sialkot Stallions
2018–2019Multan Sultans (స్క్వాడ్ నం. 26)
2018–2019లీసెస్టర్‌షైర్ (స్క్వాడ్ నం. 26)
2019–presentSouthern పంజాబ్ (స్క్వాడ్ నం. 38)
2021–presentహాంప్‌షైర్ (స్క్వాడ్ నం. 38)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు FC లిఎ
మ్యాచ్‌లు 25 3 151 55
చేసిన పరుగులు 110 809 137
బ్యాటింగు సగటు 5.50 6.42 7.61
100లు/50లు 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 29 40 15*
వేసిన బంతులు 5,134 162 28,886 2,693
వికెట్లు 90 1 616 75
బౌలింగు సగటు 23.02 153.00 20.51 29.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 0 42 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 11 0
అత్యుత్తమ బౌలింగు 5/33 1/44 8/46 4/31
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 0/– 40/– 13/–
మూలం: Cricinfo, 8 April 2023

మహ్మద్ అబ్బాస్ (జననం 1990, మార్చి 10) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం, దేశీయంగా దక్షిణ పంజాబ్ కోసం ఆడుతున్నాడు.[1]

2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[2][3] ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2018లో పురుషుల క్రికెట్‌లో ఐదు బ్రేకౌట్ స్టార్‌లలో అబ్బాస్‌ను ఒకరిగా పేర్కొంది.[4] 2021 జూలైలో, జాతీయ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైన కారణంగా అబ్బాస్ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.[5]

దేశీయ క్రికెట్

[మార్చు]

అబ్బాస్ 2015–16 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీశాడు, టోర్నమెంట్‌లో మొత్తం 61 అవుట్‌లను చేశాడు.[6] తరువాతి టోర్నమెంట్‌లో అతను 71 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.[7]

2021 ఏప్రిల్ లో, మిడిల్‌సెక్స్‌తో జరిగిన హాంప్‌షైర్ మ్యాచ్‌లో, మిడిల్‌సెక్స్ మొదటి ఇన్నింగ్స్‌లో అబ్బాస్ హ్యాట్రిక్ సాధించాడు.[8] 2022 జనవరిలో, 2022 కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు ముందు హాంప్‌షైర్‌తో మళ్ళీ సంతకం చేశాడు.[9]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2017 ఏప్రిల్ లో, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అబ్బాస్‌ని పాకిస్తాన్ టెస్ట్ జట్టులో చేర్చారు.[10] 2017 ఏప్రిల్ 21న సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు. తన రెండో బంతికే తన తొలి టెస్టు వికెట్‌ని సాధించాడు, క్రైగ్ బ్రాత్‌వైట్‌ను అవుట్ చేసి మూడు వికెట్లతో మ్యాచ్‌ను ముగించాడు.[11] తన మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తన తొలి ఐదు వికెట్లు సాధించాడు.[12]

2019 మార్చిలో, ఆస్ట్రేలియాతో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[13][14] 2019 మార్చి 22న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[15] 2019 నవంబరులో, మళ్ళీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. రెండో టెస్టులో ఆడినా ఒక్క వికెట్ కూడా తీయలేదు.[16]

మూలాలు

[మార్చు]
  1. "Mohammad Abbas". ESPN Cricinfo. Retrieved 24 November 2015.
  2. "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 6 August 2018.
  3. "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. 6 August 2018. Retrieved 6 August 2018.
  4. "2018 lookback – the breakout stars (men)". International Cricket Council. Retrieved 1 January 2019.
  5. "Mohammad Abbas, Asad Shafiq, Imad Wasim, Haider Ali and Naseem Shah lose their Pakistan contracts". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-04.
  6. "Records: Quaid-e-Azam Trophy, 2015/16, Most wickets". ESPN Cricinfo. Retrieved 6 January 2016.
  7. "Records: Quaid-e-Azam Trophy, 2016/17, Most wickets". ESPN Cricinfo. Retrieved 15 December 2016.
  8. "Mohammad Abbas blitzes Middlesex with hat-trick and 17-ball five-wicket haul on home debut for Hampshire". The Cricketer. 16 April 2021. Retrieved 16 April 2021.
  9. "Mohammad Abbas set for Hampshire return in 2022". ESPN Cricinfo. Retrieved 28 January 2022.
  10. "Shadab Khan breaks into Pakistan Test squad". ESPN Cricinfo. Retrieved 5 April 2017.
  11. "Pakistan tour of West Indies, 1st Test: West Indies v Pakistan at Kingston, Apr 21–25, 2017". ESPN Cricinfo. Retrieved 21 April 2017.
  12. "Brilliant Yasir leads Pakistan towards history". ESPN Cricinfo. Retrieved 13 May 2017.
  13. "Shoaib Mailk to lead ODI squad in UAE, Sarfaraz Ahmed among six players rested". ESPN Cricinfo. Retrieved 8 March 2019.
  14. "Pakistan squad for Australia ODIs announced". Pakistan Cricket Board. Retrieved 8 March 2019.
  15. "1st ODI (D/N), Australia tour of United Arab Emirates at Sharjah, Mar 22 2019". ESPN Cricinfo. Retrieved 22 March 2019.
  16. "2019 australia test". ESPN Cricinfo. Retrieved 4 July 2020.

బాహ్య లింకులు

[మార్చు]