మాక్స్ అబ్రహమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాక్స్‌అబ్రహామ్
మాక్స్ అబ్రహామ్
జననంమార్చి 26. 1875
డాంజింగ్
మరణంనవంబర్ 16 , 1922
మ్యూనిచ్
జాతీయతజర్మన్
రంగములుభౌతిక శాస్త్రము
పరిశోధనా సలహాదారుడు(లు)మాక్స్ ప్లాంక్

మాక్స్ అబ్రహామ్ (1875 మార్చి 26 - 1922 నవంబర్ 16) ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త.

ఈయన డాంజింగ్ (పూర్వపు జర్మనీలో పోలెండ్ లో) లో ఒక వర్తకుని కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు మోరిట్జ్ అబ్రహం, ఆయన తల్లి పేరు సెల్మా మోరిట్జ్‌సోన్. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసే కాలంలో ఆయన మాక్స్ ప్లాంక్ శిష్యునిగా చేరాడు. 1897 లో ఆయన పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాలపాటు ఆయన మాక్స్ ప్లాంక్ వద్ద పనిచేశాడు.

1900 నుండి 1909 మధ్య కాలంలో ఆయన గొట్టింజెన్ విశ్వవిద్యాలయంలో ఉచితంగా ఉపన్యాసకునిగా పనిచేశాడు.

అబ్రహం 1902 లో ఎలక్ట్రాన్ యొక్క వాదా న్ని అభివృద్ధి చేశాడు. ఆయన ఎలక్ట్రాన్ ఖచ్చిత గోళాకారంగా ఉండి దాని చుట్టూ సరిసమానంగా ఆవేశం వ్యాపించి ఉంటుందని పరికల్పనలు చేశాడు. ప్రముఖ శాస్త్రవేత్తలైన హెన్రిక్ లారెంట్జ్ (1899-1904), ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (1905) లు ఈ వాదాన్ని ఇంకనూ అభివృద్ధి చేశారు. ఆయన తన ఆలోచనలు కచ్చితమైనవని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. ఆయన దృష్టి ఎప్పుడూ ప్రపంచ జ్ఞానం పైనే ఉండేది.

1909 లో అబ్రహం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఇల్లినోయిస్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాన్ని అంగీకరించుటకు ప్రయాణమయ్యాడు. కానీ, కొన్ని నెలలలోనే తిరిగి తన స్వంత ప్రదేశమైన గొట్టింజెన్ కు వచ్చాడు. ఆ తర్వాత ఆయన టుల్లియో లెవి-సివిటా చే ఇటలీ దేశానికి ఆహ్వానించబడ్డాడు. ఆక్కడ 1944 వరకు పాలిటెక్నికో డి మిలానో విశ్వవిద్యాలయంలో "రేషనల్ యాంత్రిక శాస్త్రము" విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనపుడు ఆయన జర్మనీకి పంపించబడ్డాడు. ఈ సమయంలో ఆయన రేడియో ప్రసారం గూర్చిన వాదాన్ని అధ్యయనం చేశాడు. ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఆయన మిలానోకు వచ్చుటకు నిరాకరించబడ్డాడు. 1921 వరకు ఆయన స్టట్ట్‌గార్ట్ వద్ద భౌతిక శాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేశాడు. అచ్చట పనిచేసినపుడు ఆయన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధికి గురి అయ్యాడు. ఆయన 1922 నవంబర్ 16 లో మ్యూనిచ్, ( జర్మనీ) లో మరణించాడు.

ఆయన మరణం తర్వాత "మాక్స్ బోర్న్", "మాక్స్ వోన్ లూ "లు ఆయన సంస్మరణ సందర్భంగా ఈ విధంగా రాసారు: He loved his absolute aether, his field equations, his rigid electron just as a youth loves his first flame, whose memory no later experience can extinguish.[1]

ప్రచురణలు[మార్చు]

  • Abraham, M. (1902). "Dynamik des Electrons" . Göttinger Nachrichten: 20–41.
  • Abraham, M. & Föppl. A. (1904). Theorie der Elektrizität: Einführung in die Maxwellsche Theorie der Elektrizität. Leipzig: Teubner.

ఇతర విషయాల కొరకు[మార్చు]

సూచికలు[మార్చు]