Jump to content

మాచిరెడ్డిగారిపల్లె

అక్షాంశ రేఖాంశాలు: 14°33′04″N 78°38′38″E / 14.551°N 78.644°E / 14.551; 78.644
వికీపీడియా నుండి

మాచిరెడ్డిగారిపల్లె కడప జిల్లా, టి.సుండుపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

మాచిరెడ్డిగారిపల్
—  రెవెన్యూయేతర గ్రామం  —
మాచిరెడ్డిగారిపల్ is located in Andhra Pradesh
మాచిరెడ్డిగారిపల్
మాచిరెడ్డిగారిపల్
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°33′04″N 78°38′38″E / 14.551°N 78.644°E / 14.551; 78.644
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం టి.సుండుపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ రాజకీయాలు

[మార్చు]

ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఈ పంచాయతీ పరిధిలోని రాగిమానుబిడికి చెందిన ఐ.ఎఫ్.ఎస్. అధికారి సేవలా నాయక్ ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్ లో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామాభివృద్ధికి ఎనలేని సేవలు కొనసాగిస్తున్నారు. పింఛ నదిపై చెక్ డ్యాములు నిర్మించి, నీటి ఎద్దడి తీర్చారు. తిరుమల-తిరుపతి దేవస్థానం సహకారంతో ఊరిలో అందమైన పార్వతీసమేత సౌమ్యనాధాలయాన్ని నిర్మించారు. పింఛ నదిపై వంతెన నిర్మాణానికీ, బస్సు వసతి కల్పనకూ, తన స్థాయిలో రాజధానిలో కృషి చేశారు. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద కోటి రూపాయలతో అన్ని పల్లెలలో 90% వీధులకు సిమెంటు రోడ్లు వేయించారు. పింఛనది ఒడ్డున శేషాచల పర్వత శ్రేణుల మధ్యలో ఈ గ్రామం 23 పల్లెలతో వ్యాపించి, పచ్చటి కోవెలగా అలరారుతోంది. గ్రామానికి రహదారి వసతి ఏర్పడింది. నదీతీరంలో ఉండటంతో పచ్చని తోటలూ, పైర్లతోకళకళలాదుతోంది.[1]

ప్రదేశాలు/ దేవాలయాలు

[మార్చు]

మాచిరెడ్డిగారి పల్లె పంచాయతీ పరిధిలోని చిన్నబిడికి వాసులు, 2014, జూలై-19, శనివారం నాడు, గిరిజన సాంప్రదాయ పద్ధతిలో హతీరాం బాలాజీ (శ్రీ వేంకటేశ్వరస్వామి) మండల శాంతిపూజలలో భాగంగా, ఉపవాసం ఉండి, శాంతిహోమం, భజనలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ కలిసి, సామూహికంగా భోజనాలు చేసారు, రాత్రికి భజన కార్యక్రమం ఏర్పాటుచేసారు.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు కడప జులై 19, 2013. 8వ పేజీ.