టి.సుండుపల్లె మండలం
టి.సుండుపల్లె | |
— మండలం — | |
వైఎస్ఆర్ పటములో టి.సుండుపల్లె మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో టి.సుండుపల్లె స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°59′10″N 78°54′33″E / 13.986044°N 78.909073°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ |
మండల కేంద్రం | టి.సుండుపల్లె |
గ్రామాలు | 12 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 53,013 |
- పురుషులు | 27,060 |
- స్త్రీలు | 25,953 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 54.96% |
- పురుషులు | 69.11% |
- స్త్రీలు | 40.18% |
పిన్కోడ్ | {{{pincode}}} |
టి.సుండుపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మండలం.[1]OSM గతిశీల పటము
మండలంలోని విశేషాలు[మార్చు]
ఈ మండలంలో మూడు చోట్ల మెగాలిథిలిక్ సమాధులు ఉన్నాయి. అవి దేవావాండ్ల పల్లె, సుండుపల్లె నుండి సీతంపేటకు పోయే దారిలో ఒకచోట, పింఛా గ్రామం వద్ద ఒకచోట ఉన్నాయి.
ఝరికోన జలాశయం[మార్చు]
ఈ జలాశయాన్ని, రు. 33కోట్ల అంచనా వ్యయంతో, 2006 లో మొదలుపెట్టి, 2010లో నిర్మాణం పూర్తి చేసారు. దీని ముఖోద్దేశ్యం ఏమిటంటే, రాయచోటి పట్టణానికి త్రాగునీటి సరఫరా మరియూ సంబేపల్లి, కె.వి.పల్లె, సుండుపల్లె మండలాలకు సాగునీరు అందించడం. కానీ దీనికి అనుసంధానంగా కాలువలు ఇంతవరకూ నిర్మించకపోవడంతో ఈ జలాశయం ఇంకా ఉపయోగంలోనికి రాక, నిరుపయోగంగా ఉంది. [3]
గుండుగుహ[మార్చు]
బాహుదానది తూర్పుభాగంలో శేషాచల కొండల నడుమ ఒక గుహ ఉంది. చూడపచ్చని వాతావరణంలో ఉన్న దీనిని, "గుండుగుహ", "మేకపోతు గని"గా పిలుస్తారు. రాయవరం పంచాయతీ, కావలిపల్లి గ్రామానికి దిగువన ఉన్న ఈ గుహ, సుండుపల్లెకు 15 కి.మీ. దూరంలోనూ, రాయచోటికి 37 కి.మీ. దూరంలోనూ ఉంది. ఇందులో 5 కి.మీ. కాలినడకన వెళ్ళవలసియుంటుంది. ఇక్కడి కొండ, బయటి భాగంలో శేషుని ఆకారంలో ఉంటుంది. గుహలోపలికి వెళ్ళడానికి చిన్న కన్నం ఉంటుంది. ఇది ఒక మేకపోతు గుండును ఢీ కొనడం వలన అది పగిలి, మనిషి వెళ్ళేటంత దారి ఏర్పడినదని ప్రతీతి. అందుకే దీనిని "గుండు గుహ" అని పిలుస్తారు. లోపల శివుని చిత్రం ఉంది. పౌర్ణమి, అమావాస్య, శ్రావణ, కార్తీక మాసాలలో పూజలు చేసెదరు.
జిల్లాలోని నదులు ఎండిపోయినా, ఇక్కడ నిత్యం జలం పారుతూ ఉంటుంది. వేసవిలోనూ ఇక్కడ చల్లని వాతావరణం ఉంటుంది. దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దితే, ఎక్కువ మంది దర్శించటానికి అనువుగా ఉంటుంది. [4]
మండల గణాంకాలు[మార్చు]
- మండల కేంద్రము టి.సుండుపల్లె
- గ్రామాలు 12
- ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
- జనాభా (2001) - మొత్తం 53,013 - పురుషులు 27,060 - స్త్రీలు 25,953
- అక్షరాస్యత (2001) - మొత్తం 54.96% - పురుషులు 69.11% - స్త్రీలు 40.18%
గ్రామాలు[మార్చు]
- అక్కంపల్లె
- భాగంపల్లె
- చెన్నయ్యగారిపల్లె (నిర్జన గ్రామం)
- గుండ్లపల్లె
- మడితాడు
- ముదంపాడు
- పెద్దినేనికాల్వ
- పెరుమాళ్లయ్యగారిపల్లె (నిర్జన గ్రామం)
- పొలిమేరపల్లె
- రాయవరం
- రెడ్డివారిపల్లె
- టి.సుండుపల్లె
- తిమ్మసముద్రం
- ఏర్రమనేనిపాలెం
- చప్పిడివాండ్లపల్లె
- గుండ్లపల్లె కురవపల్లె
- పాపన్నగారిపల్లె
- గుట్టకిందరాచపల్లె
- మాచిరెడ్డిగారిపల్లె
- బండకాడ ఈడిగపల్లె
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2019-01-17.