మాచెర్ల హేమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాచెర్ల హేమ, మాచర్ల హేమ మనోహర్ (Hema Macherla) తెలంగాణాలో పుట్టి లండన్ లో స్థిరపడిన తెలుగు రచయిత్రి. ఈమె రచించిన ఆంగ్లనవల Breeze from the River Manjeera అంతర్జాతీయంగా ఒక విలువలను పెంపొందించే రచనగా గుర్తింపుపొందింది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె వరంగల్ జిల్లా ఆత్మకూర్ కి చెందిన సుబ్బరామశాస్త్రి, కాట్రేపల్లి లలిత దంపతులకు జన్మించింది.[2] వీరు భర్త డాక్టర్ రాధామనోహర్ గారి ప్రోత్సాహం, తల్లి గారి సాహిత్యాభిలాష తన సాహిత్యకృషికి ప్రధాన హేతువులని చెబుతారు.

వీరు రచించిన సుమారు 25 కథలను ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, యువ, స్వాతి పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరు మూడు ఆంగ్ల నవలను రచించగా 2008 విడుదలైన మొదటినవల Breeze from the River Manjeera రిచర్డ్ & జూడీ (Richard & Judy) 2007 లో నిర్వహించిన నవలా పోటీలో పాల్గొన్న 44000 ఎంట్రీలలో వడపోయగా మిగిలిన 26 నవలల్లో ఒకటిగా నిలిచింది.

సాహిత్య ప్రస్థానం[మార్చు]

తెలుగు రచనలు[మార్చు]

కథానిలయం రికార్డుల ప్రకారం ఈమె రచించిన రచనలు:[3]

  1. అసంపూర్ణ శిల్పాలు, ఆంధ్రజ్యోతి వారపత్రిక (దీపావళి సంచిక, అక్టోబరు 1987)[4]
  2. ఇంగ్లండులో ఓ తెలుగు చేమంతి, (ఆంధ్రజ్యోతి, 1981)
  3. ఇంగ్లీషు అల్లుడుగారు, (ఆంధ్రజ్యోతి, 1984)
  4. ఓ అమ్మ కథ, (యువ మాసపత్రిక, డిసెంబర్ 1988)[5]
  5. జీవితాన్ని జీవించు, (ఆంధ్రపత్రిక వారపత్రిక, అక్టోబరు 1986) [6]
  6. టెలిఫోన్ పెళ్లి, (ఆంధ్రజ్యోతి, 1982,)
  7. డిస్కో, (ఆంధ్రపత్రిక వారపత్రిక, 1981)[7]
  8. తెలుగంటే చేదా?, (ఆంధ్రజ్యోతి, 1982)
  9. తోటమాలి, (ఆంధ్రపత్రిక, 1983)
  10. ప్రేమికుడు, (ఆంధ్రజ్యోతి, 1987)
  11. మనసులేని తండ్రి, (ఆంధ్రజ్యోతి, 1983)
  12. మనిషికి అందం మనసు, (ఆంధ్రజ్యోతి, 1984)
  13. రామ శ్రీరామలాలీ..., (ఆంధ్రజ్యోతి, 1982)
  14. సృష్టిలో తీయనిది, (యువ మాసపత్రిక, నవంబర్ 1981)[8]

ఆంగ్ల రచనలు[మార్చు]

  1. Breeze from the River Manjeera, (2008)
  2. Blue Eyes, (2011)[9]
  3. Letters in the Sand, (2021)[10]

మూలాలు[మార్చు]

  1. Macherla, Hema. "Breeze from the River Manjeera". Google Books. Linen press, Edinburgh. Retrieved 2 October 2023.
  2. https://www.taluk.org/assets/talawardees/LTA/LTA_awardee_2013.png
  3. https://kathanilayam.com/writer/1563
  4. https://drive.google.com/file/d/1Mp78pBIa968CWz4LTF_0L8-KTDuLXU85/view
  5. https://drive.google.com/file/d/1Mp78pBIa968CWz4LTF_0L8-KTDuLXU85/view
  6. https://drive.google.com/file/d/1Mp78pBIa968CWz4LTF_0L8-KTDuLXU85/view
  7. https://drive.google.com/file/d/1CmmRAjIMMbVnTzBpBEVcTTeXHpCIQxWp/view
  8. https://drive.google.com/file/d/1XXp5AOP28dsNhTucjuMlSj0kM-gxArAx/view
  9. Macherla, Hema. "Blue Eyes". Google Books. Linen press, Edinburgh. Retrieved 2 October 2023.
  10. Macherla, Hema. "Letters in the Sand". Google Books. Linen press, Edinburgh. Retrieved 2 October 2023.