మాటల మడుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాటల మడుగు
కృతికర్త: మెర్సీ మార్గరెట్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కవితాసంకలనం
ప్రచురణ: మెర్సీ పబ్లికేషన్స్,హై.బా.
విడుదల: ఆగస్ట్,2014

మాటల మడుగు పుస్తకాన్ని మెర్సీ మార్గరెట్ రచించారు. ఈ కవితా సంకలనానికి 2017 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం లభించింది.

రచన నేపథ్యం[మార్చు]

మాటల మడుగు కవితా సంకలనం మెర్సీ పబ్లికేషన్స్ ద్వారా ఆగస్టు,2014 లో మొదటి ముద్రణ పొందింది. కవయిత్రి ఈ పుస్తకాన్ని తనకు "జీవితాన్నిచ్చిన నాన్న మోహన్‌, అమ్మ దెబోరాలకు అంకితం" ఇచ్చింది.[1]

కవయిత్రి గురించి[మార్చు]

మెర్సీ మార్గరెట్ తెలుగు వర్థమాన కవయిత్రి. సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకొని వివిధ సామాజికాంశాలపై కవిత్వం రాస్తున్న కవయిత్రి. 2009 నుండి కవిత్వం రాస్తూ వస్తున్నారు. ఫేస్ బుక్ వేదికగా నిర్వహింపబడుతున్న కవి సంగమం సమూహంలో విరివిగా కవిత్వం రాశారు. 2009 నుండి 2014 వరకు రాసిన కవిత్వానంతా మాటల మడుగు పేరుతో కవితాసంకలనంగా తీసుకొచ్చారు. ఈ సంకలనానికే 2017 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారాన్ని పొందారు.

కవితల జాబితా[మార్చు]

'మాటల మడుగు'లో మొత్తం 53 కవితలు ఉన్నాయి:[2] అందులో కొన్ని కవితల శీర్షికలు...

  1. కొట్టివేత
  2. మాటల మడుగు
  3. ప్రశ్నల గది
  4. చీకటి దీపం
  5. హృదయపు మెతుకు
  6. మాట్లాడనివ్వండి
  7. కవులు-కాగితం
  8. మనవి
  9. విత్తనపు వీర్యం?
  10. కాదంబరి
  11. తలాష్
  12. అమర్త్యకేక
  13. ఖాళీలు మంవివే

.....

ప్రాచుర్యం[మార్చు]

మాటల మడుగు కవితా సంకలనంపై వివిధ మాధ్యమాలలో అనేక సమీక్షలు వచ్చాయి[3]. సంపుటిగా ఈ పుస్తకానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2015 సంవత్సరంలో పెన్నా సాహిత్య పురస్కారం, 2017 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కాయి.

మూలాలు[మార్చు]

  1. మాటల మడుగు: మెర్సీ మార్గరెట్, మెర్సీ పబ్లికేషన్స్, హైదరాబాద్,2014
  2. మాటల మడుగు కవితాసంకలనం విషయ సూచిక
  3. ఫేస్ బుక్‌లో మాటల మడుగు పుట