మాతృవేదన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాతృవేదన అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబధించిన 10వ తరగతి తెలుగు పాఠం. దీని రచయిత నన్నయ. ఇతడు 11వ శతాబ్దానికి చెందినవాడు. ఈ పాఠం నన్నయ రాసిన ఆంధ్రమహాభారతం ఆదిపర్వం లోని అష్టమాశ్వాసం నుండి గ్రహించబడింది.

మాతృవేదన అంటే తల్లియొక్క బాధ అని అర్థం.

నేపథ్యం

[మార్చు]

జరిత ఒక లావుక పక్షి. మందపాలుడి వలన నలుగురు కుమారులను కన్నది. వారి పేర్లు 1)జరితారి 2)సారిసృక్కు 3)అస్తంభమిత్రుడు 4)ద్రోణుడు. వీరు ఖాండవ వనంలో నివాసముంటున్నారు. మందపాలుడు జరితను, కుమారులను ఖాండవ వనంలో వదలిపెట్టి వెళ్ళిపోయాడు. కృష్ణార్జునుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తున్నాడు. తన కుమారులను ఎలా కాపాడుకోవాలో తెలియక జరిత తీవ్రమైన దు:ఖాన్ని పొందుతుంది.

జరిత కుమారులు:

[మార్చు]

అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తున్నాడు. జరిత కుమారులు ఇంకా రెక్కలు రాని పసివయసులో ఉన్నారు. వారిని తీసుకెళ్ళే శక్తి జరితకు లేదు. ఆ ఆపద నుండి తన కుమారులను ఎలా కాపాడుకోవాలో తెలియక తీవ్రమైన దు:ఖాన్ని పొందుతుంది. వీరి తండ్రి వీళ్ళను వదలిపెట్టి నిర్దయబుద్దితో ఎక్కడికో వెళ్ళాడు కాని నేను అలా వెళ్ళలేను దైవ నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని బాధపడుతుంది.

జరిత తన కుమారులను ఆ చెట్టు రంధ్రంలోనికి వెళ్ళి దాక్కొమంది. మంటలు తగలకుండా ఆ రంధ్రాన్ని దట్టమైన దుమ్ము, దూళి రేణువుల సహాయంతో కప్పివేస్తానన్నది.

జరితారి నిరాకరించుట

[మార్చు]

జరిత కుమారులలో పెద్దవాడు జరితారి. బ్రహ్మజ్ఝానం కలవాడు. చెట్టు రంధ్రంలో ఉండే ఆపదను ముందుగానే ఊహించి అందులోకి వెళ్ళడానికి నిరాకరించాడు.

చెట్టు రంధ్రంలోని ఆపద

[మార్చు]

ఆ చెట్టు రంధ్రంలో ఒక ఎలుక నివాసముంటుంది. మాంసపు ముద్దలుగా ఉన్న మేము గనక ఆ రంధ్రంలోనికి వెళ్తే అందులోని ఎలుక చంపి తింటుంతుంది. ఇక్కడే చెట్టుపై ఉంటే అగ్ని కాల్చివేస్తాడు. కాబట్టి ఎలుక చేతిలో నీచమైన చావు పొందేకంటే అగ్ని చేతిలో కాలిపోతే పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి అని తల్లితో చెప్పాడు.

కష్ట సమయంలో అనుమానంతో కూడుకొన్న పని చేయాలి కాని తప్పకుండా జరుగుతుందన్న పనిని చేయకూడదు. ఇక్కడ తప్పకుండా జరిగే పని రంధ్రంలోనికి గనక వెళ్తే ఎలుక చేతిలో చనిపోవడం. అనుమానంతో కూడిన పని గాలి వలన మంటలు తొలగిపోవచ్చు.

కుమారులు జరితకు నమస్కరించుట అమ్మా కాబట్టి నీవు వెళ్ళమన్న చోటికి మేము వెళ్ళము. మాపై ప్రేమను వదలిపెట్టి నీవు వెళ్ళిపో. నీవు గనక బ్రతికి ఉంటే మళ్ళి మాలాంటి సంతానాన్ని పొందవచ్చు. నీ పుణ్యం వల్ల మంటల బారినుండి కలిగే ఆపద తొలగిపోతే నీవు మా వద్దకు వచ్చి పోషింతువు అని తల్లికి నమస్కరించారు. దగ్గరికి వచ్చే మంటలను చూసి ప్రాణభయంతో జరిత ఆకాశంలోకి ఎగిరి వెళ్ళింది.

కుమారులు అగ్నిదేవుడిని ప్రార్థించుట: నలుగురు పక్షి కుమారులు బ్రహ్మముఖాలవలె నాలుగు వేదాలలోని మంత్రాలతో మాకు శరణు ఇమ్మని అగ్నిదేవుడిని ప్రార్థించారు.

అగ్నిదేవుడు నలుగురు కుమారులను కాల్చక వదలిపెట్టుట: అగ్నిదేవుడు మందపాలుడి ప్రార్థనను గుర్తుకుతెచ్చుకొని ఆ నలుగురు పక్షి కుమారులు ఉన్న వృక్షాన్ని కాల్చక వదలివేస్తాడు.(మందపాలుడు జరితను, కుమారులను ఖాండవ వనంలో వదలివెళ్ళేటప్పుడు వారికి ఎలాంటి ఆపద తలపెట్టకుమని అగ్నిదేవుడిని ప్రార్థిస్తాడు.)

జరిత సంతోషించుట: అగ్నిదేవుడు తన కుమారులను కాల్చక వదలిపెట్టడాన్ని చూసి జరిత సంతోషించి తన కుమారుల దగ్గరికి వచ్చి సుఖంగా ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మాతృవేదన&oldid=3597170" నుండి వెలికితీశారు