మాథ్యూ బ్రీట్జ్కే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాథ్యూ బ్రీట్జ్కే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మాథ్యూ పాల్ బ్రీట్జ్కే
పుట్టిన తేదీ (1998-11-03) 1998 నవంబరు 3 (వయసు 25)
పోర్ట్ ఎలిజబెత్, ఈస్టర్న్ కేప్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రవికెట్ కీపరు-బ్యాటరు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–presentఈస్టర్న్ ప్రావిన్స్
2017/18–2020/21వారియర్స్
2019నెల్సన్ మండేలా బే జయింట్స్
2022/23–presentడర్బన్ సూపర్ జయింట్స్
మూలం: ESPNcricinfo, 2022 డిసెంబరు 23

మాథ్యూ బ్రీట్జ్కే (జననం 1998 నవంబరు 3) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు.[1] అతను 2017 ఫిబ్రవరి 9న 2016–17 సన్‌ఫోయిల్ 3-డే కప్‌లో తూర్పు ప్రావిన్స్‌ తరఫున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసాడు.[2] 2017 ఫిబ్రవరి 12న 2016–17 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో తూర్పు ప్రావిన్స్‌ తరఫునే తన తొలి లిస్టు A మ్యాచ్ కూడా ఆడాడు.[3] 2017 సెప్టెంబరు 1న 2017 ఆఫ్రికా T20 కప్‌లో తన తొలి ట్వంటీ20 ఆట కూడా తూర్పు ప్రావిన్స్ తరపునే ఆడాడు.[4]

డిసెంబరు 2017లో, అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికయ్యాడు.[5] 2018 జూలైలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఎమర్జింగ్ స్క్వాడ్‌లోకి అతన్ని తీసుకున్నారు.[6] 2018 సెప్టెంబరులో, 2018 ఆఫ్రికా T20 కప్ కోసం తూర్పు ప్రావిన్స్ జట్టుకు ఎంపికయ్యాడు.[7]

2019 సెప్టెంబరులో మాథ్యూ, 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం నెల్సన్ మండేలా బే జెయింట్స్ జట్టుకు ఎంపికయ్యాడు.[8] 2021 ఏప్రిల్‌లో, నమీబియాలో ఆరు-మ్యాచ్‌ల పర్యటన కోసం దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ పురుషుల జట్టులో ఎంపికయ్యాడు.[9] అదే నెలలో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు తూర్పు ప్రావిన్స్ జట్టుకు ఎంపికయ్యాడు.[10]

మూలాలు

[మార్చు]
  1. "Matthew Breetzke". ESPN Cricinfo. Retrieved 9 February 2017.
  2. "Sunfoil 3-Day Cup, Pool B: Free State v Eastern Province at Bloemfontein, Feb 9-11, 2017". ESPN Cricinfo. Retrieved 9 February 2017.
  3. "CSA Provincial One-Day Challenge, Pool B: Free State v Eastern Province at Bloemfontein, Feb 12, 2017". ESPN Cricinfo. Retrieved 12 February 2017.
  4. "Pool B, Africa T20 Cup at Potchefstroom, Sep 1 2017". ESPN Cricinfo. Retrieved 1 September 2017.
  5. "Raynard van Tonder to captain South Africa at 2018 ICC U19 World Cup". Cricket South Africa. Archived from the original on 29 జూన్ 2018. Retrieved 11 December 2017.
  6. "De Zorzi to lead SA Emerging Squad in Sri Lanka". Cricket South Africa. Archived from the original on 19 జూలై 2018. Retrieved 19 July 2018.
  7. "Eastern Province Squad". ESPN Cricinfo. Retrieved 12 September 2018.
  8. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 సెప్టెంబర్ 2019. Retrieved 4 September 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  9. "SA Emerging men to tour Namibia". Cricket South Africa. Archived from the original on 17 ఏప్రిల్ 2021. Retrieved 16 April 2021.
  10. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.