మాన్వి గాగ్రూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాన్వి గాగ్రూ
జననం (1985-09-05) 1985 సెప్టెంబరు 5 (వయసు 38)
న్యూ ఢిల్లీ, భారతదేశం
విద్యది మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్,
గార్గి కాలేజ్, (ఢిల్లీ విశ్వవిద్యాలయం)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
టివిఎఫ్ ట్రిప్లింగ్
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!
జీవిత భాగస్వామికుమార్ వరుణ్

మాన్వి గాగ్రూ (ఆంగ్లం: Maanvi Gagroo; జననం 1985 సెప్టెంబరు 5) భారతీయ నటి, ఆమె ప్రదానంగా హిందీ చలనచిత్రాలు, టెలివిజన్‌లలో నటిస్తుంది.[1][2] ఆమె టివిఎఫ్ పిచర్స్, టివిఎఫ్ ట్రిప్లింగ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్! వంటి వివిధ వెబ్ సిరీస్‌లలో కూడా ఆమె నటించింది.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

మాన్వి గాగ్రూ కాశ్మీరీ పండిట్ కుటుంబంలో న్యూఢిల్లీలోని సురేందర్, ఊర్మిల్ గాగ్రూ దంపతులకు జన్మించింది. ఆమె న్యూ ఢిల్లీలోని ది మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలోని గార్గి కాలేజీ నుండి సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.[4]

ఆమె 2023 ఫిబ్రవరి 23న కుమార్ వరుణ్‌ని ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకుంది.[5][6][7]

కెరీర్[మార్చు]

2007లో, ఆమె డిస్నీ ఛానల్ టెలివిజన్ షో ధూమ్ మచావో ధూమ్‌తో తన కెరీర్ ప్రారంభించింది. ఆమె టివిఎఫ్ పిచర్స్, టివిఎఫ్ ట్రిప్లింగ్, మేడ్ ఇన్ హెవెన్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్! వంటి వెబ్ సిరీస్‌లలో నటనకు ప్రసిద్ధి చెందింది. 2019లో, ఆమె సన్నీ సింగ్ సరసన ఉజ్దా చమన్ అనే కామెడీ చిత్రంలో అప్సర అనే ప్లస్ సైజ్ మహిళ పాత్రను పోషించింది, దాని కోసం ఆమె లావుగా ఉండే సూట్ ధరించింది. ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్‌లో చేసింది.ఇందులో ఆమె చమత్కారమైన వధువు పాత్రను పోషించింది.

2023లో, మాన్వి గాగ్రూ ఉత్తమ నటనకు ఫిల్మ్‌ఫేర్ ఒటిటి అవార్డును గెలుచుకుంది.[8]

మూలాలు[మార్చు]

  1. "Sriti Jha and Maanvi Gagroo holiday in Kerala, slay it in beachwear". India Today.
  2. "Maanvi Gagroo is redefining fashion for all curvy women". The Times of India.
  3. "Maanvi Gagroo: I hope star culture does not come to OTT, as they'll come with their own baggage". Hindustan Times.
  4. "All about Maanvi Gagroo: Bit roles in Bollywood to web series star". Hindustan Times (in ఇంగ్లీష్). 30 September 2016. Retrieved 24 February 2023.
  5. "Maanvi Gagroo on Instagram: "In the presence of our close friends and family, today, on this palindrome-ish date, of 23~02~2023, we made it official, in every way. You've loved and supported us in our individual journeys, please continue to bless us in our journey together. Happy #2323 #KGotVi ❤️🧿🙏🏽 Outfit : @shantanugoenkaofficial Styled : @itsbhavyapatel_ Saree drapped : @dolly.jain Assisted by @mahimajainofficial Jewellery : @mortantra MUA : @komzy_le Hair : @fouzikazi_makeupndhair Captured by @raabta.studios"". Instagram (in ఇంగ్లీష్). Retrieved 24 February 2023.
  6. "Maanvi Gagroo gets married to Kumar Varun; shares wedding pics". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2023-12-12.
  7. "Maanvi Gagroo finally speaks about life after marriage to Kumar Varun: We wanted to get married because..." Hindustan Times (in ఇంగ్లీష్). 2023-06-04. Retrieved 2023-12-12.
  8. "Winners of Filmfare OTT Awards 2023". web.archive.org. 2023-12-20. Archived from the original on 2023-12-20. Retrieved 2023-12-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)