Jump to content

ఆయుష్మాన్ ఖురానా

వికీపీడియా నుండి
ఆయుష్మాన్ ఖురానా

ఆయుష్మాన్ ఖురానా
జననం (1984-09-14) 1984 సెప్టెంబరు 14 (వయసు 40)
క్రియాశీలక సంవత్సరాలు 2004 - ప్రస్తుతం

ఆయుష్మాన్ ఖురానా (జననం 14 సెప్టెంబరు 1984) ప్రముఖ భారతీయ నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత. టెలివిజన్ వ్యాఖ్యాతగా కెరీర్ ను ప్రారంభించిన ఆయన వికీ డోనర్ అనే సినిమాతో బాలీవుడ్ లో హీరోగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.[1][2]

తొలినాళ్ళ జీవితం, చదువు

[మార్చు]

ఆయుష్మాన్ ఖురానా పంజాబ్ కు చెందినవాడు.[3] ఆయనకు అపరశక్తి ఖురానా ఉన్నాడు. చండిగఢ్ లోని సెయింట్ జోన్స్ హై స్కూలులోనూ, డిఎవి కళాశాలలోనూ ఆయన చదువుకున్నాడు.[4] పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందాడు.[5] డిఎవి కళాశాలలో చదువుకునేటప్పుడు ఆఘజ్, మంచ్ తంత్ర అనే రెండు నాటక సంఘాలను స్థాపించారు. ఎన్నో వీధినాటకాలు వేసాడు ఆయన. ఐఐటి బాంబేకు చెందిన మూడ్ ఇండిగో, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిళని కి చెందిన ఒయాసిస్ వంటి జాతీయ కాలేజ్ ఫెస్టివల్స్ లో నాటకాలు వేసి ఎన్నో బహుమతులు గెలుచుకున్నాడు ఖురానా.[5] ధర్మవీర్ భారతి రాసిన అంధ యుగ్ నాటకంలో ఆయన నటించిన అశ్వద్ధామ పాత్రకు ఉత్తమ నటుడు అవార్దు గెలుచుకున్నాడు.[6]

నటించిన సినిమాలు

[మార్చు]

2004–11: టివి, తొలినాళ్ళ కెరీర్

[మార్చు]

2002లో చానల్ వి పోప్ స్టార్స్ లో ఒక రియాలిటీ షోలో, తన 17వ ఏట మొదటిసారి టివీలో కనిపించారు ఖురానా. ఆ షోలో అతి చిన్న వయస్కుడు ఆయనే. తన 20వ ఏట రోడీస్ 2 గేమ్ షోలో విజేతగా నిలిచారు ఆయన.[7] మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాకా ఢిల్లీలోని బిగ్ ఎఫ్.ఎంలో రేడియో జాకీగా పనిచేశారు ఖురానా. రేడియోలో బిగ్ చాయ్-మాన్ నా మాన్, తేరా ఆయుష్మాన్ వంటి షోలు హోస్ట్ చేశారు ఆయన. 2007లో యంగ్ ఎచీవర్స్ అవార్డు గెలిచారు.[8] ఢిల్లీలో భారత్ నిర్మాన్ పురస్కారం అందుకున్న అతి పిన్న వయస్కుడు ఆయుష్మాన్ కావడం విశేషం.[9]

రేడియో తరువాత ఎంటివీలో వీడియో జాకీగా మారారు ఖురానా. పెప్సీ ఎంటీవీ వాసప్, ది వాయిస్ ఆఫ్ యంగిస్థాన్ షోలను హోస్ట్ చేశారు ఆయన.

References

[మార్చు]
  1. "Vicky Donor is a HIT". Indicine.com. Retrieved 2015-03-10.
  2. "Vicky Donor gets very good reviews from film critics - Filmibeat ". Entertainment.oneindia.in. 2012-04-23. Archived from the original on 2014-02-02. Retrieved 2015-03-10.
  3. "I've evolved as an actor: Ayushmann Khurrana". IANS. The Express Tribune. 28 April 2013. Retrieved 5 June 2016.
  4. "Ayushmann's Portfolio Pics". The Times of India. Retrieved 5 June 2016.
  5. 5.0 5.1 "Lesser known facts about Ayushmann Khurrana". The Times of India. 21 September 2015. Retrieved 5 June 2016.
  6. "Ayushmann's Portfolio Pics". Maharashtra Times. Retrieved 5 June 2016.
  7. "RJ Ayushmann of BIG 92.7 FM creates history: Wins Young Achievers Award". India PRwire. 1 May 2007. Archived from the original on 3 మే 2007. Retrieved 25 జూలై 2016.
  8. "Ayushmann Khurrana - Ayushmann Khurrana Biography". www.koimoi.com. Retrieved 2016-01-04.