Jump to content

డ్రీమ్ గర్ల్ 2

వికీపీడియా నుండి

డ్రీమ్ గర్ల్ 2 2023లో విడుదలైన హింది సినిమా. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే, పరేష్ రావల్, సీమా పహ్వా, అన్నూ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 14న[1], ట్రైలర్‌ను ఆగష్టు 1న విడుదల చేసి[2] సినిమాను ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై, అక్టోబర్ 20 నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]

నటీనటులు

[మార్చు]
  • ఆయుష్మాన్ ఖురానా -పూజ / కరమ్‌వీర్ "కరమ్" సింగ్, జగ్జీత్ కొడుకు
  • అనన్య పాండే - పరి శ్రీవాస్తవ, కరమ్ ప్రియురాలు [5]
  • పరేష్ రావల్ - అబూ సలీమ్‌, షారుఖ్ తండ్రి
  • అన్నూ కపూర్ - జగ్జీత్ సింగ్, కరమ్ తండ్రి
  • విజయ్ రాజ్ - సాజన్ తివారీ అలియాస్ సోనా భాయ్
  • రాజ్‌పాల్ యాదవ్ - శౌకియా, అబు యొక్క సవతి కొడుకు
  • అస్రానీ - యూసుఫ్ అలీ సలీం ఖాన్‌, అబు తండ్రి
  • మనోజ్ జోషి జైపాల్ శ్రీవాస్తవ, పారి తండ్రి
  • సీమా పహ్వా - జుమానీ, అబు సోదరిగా
  • మంజోత్ సింగ్ - స్మైలీ సింగ్ ధిల్లాన్‌
  • అభిషేక్ బెనర్జీ - షారూఖ్ సలీమ్, అబూ కొడుకు
  • సుదేశ్ లెహ్రీ - బేబీ బాబా
  • అనూషా మిశ్రా - సకీనా
  • ఆకర్ష్ దత్ చతుర్వేది - నవీన్ శ్రీవాస్తవ్, ప్యారిస్ సోదరుడు
  • రంజన్ రాజ్ - టైగర్ పాండే
  • డాలీ సింగ్ - టైగర్ పాండే, సోదరి
  • రీతూ సింగ్ - టైగర్ పాండే తల్లి
  • రాజ్ శర్మ - కుక్కి ధిల్లాన్‌
  • రజత్ పొద్దార్ - డాక్టర్‌
  • జావేద్ హైదర్ - ఇన్‌స్పెక్టర్ గోపాల్ దాస్
  • రాజ్ కుషాల్ - అలీ
  • రాజ్ బన్సాలీ - కులీ
  • సప్నా శాండ్ - ప్రిన్సిపాల్‌

ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు కరమ్ (ఆయుష్మాన్ ఖురానా) తండ్రి జగ్జీత్ సింగ్ (అన్నూ కపూర్) చేసిన అప్పులతో సతమతమవుతుంటాడు. అదే సమయంలో తన స్నేహితురాలు పరితో (అనన్య పాండే) ప్రేమలో పడతాడు. వీరిద్దరి పెళ్లికి పరి తండ్రి జైపాల్ శ్రీవాస్తవ (మనోజ్ జోషి) అడ్డుపడతాడు. తన కూతురితో వివాహం జరిపించాలంటే ఆరు నెలల్లో రూ.25 లక్షలు సంపాదించాలని కరమ్ కు కండిషన్ పెడతాడు. అందుకు అంగీకరించిన ఆ యువకుడు ఏం చేశాడు? ఆరు నెలల్లో ఎలా డబ్బు సంపాదించాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.

మూలాలు

[మార్చు]
  1. ABP Desham (14 February 2023). "'డ్రీమ్ గర్ల్ 2' టీజర్: 'పఠాన్'నే ఫిదా చేసిన ఆ బ్యూటీ ఎవరు? అమ్మాయి వేషంలో ఉన్న ఈ హీరోను గుర్తు". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
  2. Namasthe Telangana (2 August 2023). "అవుట్‌ అండ్‌ అవుట్‌ హిలేరియస్‌గా డ్రీమ్‌ గర్ల్‌-2 ట్రైలర్‌". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
  3. Namasthe Telangana (20 October 2023). "ఆయుష్మాన్‌ ఖురానా డ్రీమ్‌ గర్ల్‌ 2ను థియేటర్లలో మిస్సయ్యారా..? అయితే ఈ వార్త మీకోసమే." Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
  4. Sakshi (19 October 2023). "ఓటీటీలోకి సూపర్‌ హిట్‌ కామెడీ ఫిలిం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
  5. "Ayushmann Khurrana introduces Ananya Panday as Pari in 'Dream Girl 2', teaser release today". newsroompost.com.

బయటి లింకులు

[మార్చు]