Jump to content

గులాబో సితాబో

వికీపీడియా నుండి
గులాబో సితాబో
దర్శకత్వంషూజిత్ సర్కార్
రచనజూహీ చతుర్వేది
కథజూహీ చతుర్వేది
నిర్మాతరోనీ లహిరి, షీల్ కుమార్
తారాగణంఅమితాబ్ బచ్చన్
ఆయుష్మాన్ ఖురానా
ఫారూఖ్ జాఫర్
ఛాయాగ్రహణంఅవిక్ ముఖోపాధ్యాయ్
కూర్పుచంద్రశేఖర్ ప్రజాపతి
సంగీతంబ్యాక్ గ్రౌండ్ స్కోర్ :
షంతాను మొయిత్రా
పాటలు:
షంతాను మొయిత్రా
అభిషేక్ అరోరా
అనుజ్ గార్గ్
నిర్మాణ
సంస్థలు
రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
12 జూన్ 2020 (2020-06-12)
సినిమా నిడివి
125 నిముషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

గులాబో సితాబో 2020లో విడుదలైన హిందీ సినిమా. రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్ బ్యానర్ పై రోనీ లహిరి, షీల్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు షూజిత్ సర్కార్ దర్శకతవమ్ వహించాడు. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, విజయ్ రాజ్, బ్రిజేందర్ కాలా, స్రిష్టి శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 12, 2020న విడుదలైంది.[1]

లక్నో నగరంలోని ఓ పురాతన భవంతికి యజమాని అయిన మీర్జా (అమితాబచ్చన్) ఆ భవంతిలో ఏళ్లుగా అద్దెకు ఉంటున్న వారిని బయటికి పంపివేసి అందులో ఒక్కడే సంతోషంగా ఉండాలి అనుకుంటాడు. మీర్జా ఇంట్లో ఏడు దశకాలుగా అద్దెకు ఉంటోన్న కుటుంబాలలో ఒకటి బాంకే రస్తోగిది (ఆయుష్మాన్) తన తల్లి, ముగ్గురు చెల్లెళ్ల కలిసి ఉంటాడు. అక్కడి నుండి వెళ్లడానికి ఇష్టపడడు. దీనితో మీర్జాకు అతను పెద్ద తలనొప్పిగా తయారవుతాడు. చేసేదేమి లేక మీర్జా లీగల్ గా వారి చేత భవంతి ఖాళీ చేయించాలని ప్రయత్నం మొదలుపెడతాడు. మరి మీర్జా ప్రయత్నం ఎంత వరకు విజయం సాధించింది? మీర్జా, బంకీ ల కథ ఎలా ముగిసింది? అనేది మిగతా సినిమా కథ..[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్
  • నిర్మాత: రోనీ లహిరి, షీల్ కుమార్
  • కథ, స్క్రీన్ ప్లే: జూహీ చతుర్వేది
  • దర్శకత్వం: షూజిత్ సర్కార్
  • సంగీతం: షంతాను మొయిత్రా
  • సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్
  • ఎడిటర్: చంద్రశేఖర్ ప్రజాపతి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 May 2020). "గులాబో సితాబో డిజిటల్‌ రిలీజ్‌". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  2. TThe Indian Express (13 June 2020). "Gulabo Sitabo review: A middling dramedy" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.