Jump to content

మామిడాల ప్రమీల

వికీపీడియా నుండి
మామిడాల ప్రమీల
జాతీయతభారతీయురాలు
వృత్తిన్యాయవాది, సామాజిక కార్యకర్త

ప్రమీల తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1][2]

విద్యాభ్యాసం

[మార్చు]

మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రమీల ఎంఏ, బీఈడీ (హిందీ), బీఏ, ఎల్‌.ఎల్‌.బి. (ఎల్‌.ఎల్‌.ఎం) డిగ్రీలు పూర్తిచేసింది.

సామాజిక సేవ

[మార్చు]

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూరు ప్రాంతంలో 13 ఏళ్ల పాటు ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉత్తమ సేవలు అందించింది. 2008లో సదాశయ ఫౌండేషన్‌లో చేరి.. దేహదానం, నేత్రదానం, రక్తదానం, మట్టి వినాయకుల వాడకం, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు, పిల్లల పెంపకం వంటి వాటిపై అవగాహన సదస్సులు, ఫ్యామెలీ కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

ప్రమీల ఆధ్వర్యంలో 55 మంది నేత్రదానం చేసి 110 మందికి చూపు అందించారు.[1]

బహుమతులు - పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 15 April 2017.
  2. telanganatoday. "Perks of being a lawyer". Retrieved 15 April 2017.[permanent dead link]