Jump to content

మాయండి భారతి

వికీపీడియా నుండి
మాయండి భారతి
జననం
మాయండి

1917
మెలమాసి స్ట్రీట్, మధురై, తమిళనాడు, భారతదేశం
మరణం24 ఫిబ్రవరి 2015 (వయసు 97-98)
జాతీయతభారతీయుడు
వృత్తిజర్నలిస్టు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధుడు
జీవిత భాగస్వామిపొన్నమ్మాళ్

మాయండి భారతి (1917–2015) తమిళనాడుకు చెందిన చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. జర్నలిస్ట్, విప్లవకారుడు.[1]

జననం

[మార్చు]

మాయండి 1917లో తమిళనాడులోని మధురై పట్టణంలో జన్మించాడు.

ఉద్యమ జీవితం

[మార్చు]

14 సంవత్సరాల వయస్సులో స్వాతంత్ర్య పోరాటంలో చేరాడు. మాయండి చాలాకాలంపాటు భారత కమ్యూనిస్టు పార్టీలో వివిధ పదవులలో పనిచేశాడు.[2] గాంధీ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు. చెన్నై ప్రావిన్స్ తీవ్రవాద యువజన విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. 1931లో బ్రిటిష్ వారు భగత్ సింగ్‌ను ఉరితీసినప్పుడు, మధురైలో జరిగిన ప్రజా ఊరేగింపులో చురుకుగా పాల్గొన్నాడు. మహాత్మా గాంధీ 1930లలో మధురైని వచ్చినప్పుడు మాయండి భారతి నుదిటిపై గాంధీజీ చేయివేసి ఆశీర్వదించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 1942, 1943, 1944 సంవత్సరాలలో 13సార్లు జైలుకు వెళ్ళాడు. తిరునల్వేలి కుట్ర కేసులో డబుల్ లైఫ్ శిక్ష అనుభవించాడు.[3][4] జనశక్తి, తీకతిర్ వంటి వివిధ కమ్యూనిస్ట్ ప్రింట్ మీడియాలో ఎడిటర్‌గా పనిచేశాడు. కోట్ల గ్రానైట్ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి మధురైకి తిరిగి వచ్చినప్పుడు యు సగయాం, ఐఏఏస్ అధికారిని అభినందించిన మొదటి వ్యక్తులలో మాయండి ఒకడు.

రచనలు

[మార్చు]

మాయండి మంచి వక్త. అనేక పుస్తకాలను కూడా రచించాడు. సిపిఐ ముఖపత్రిక జనశక్తి (1944-83), సిపిఐ (ఎం) దినపత్రిక తీకతిర్ (1964-91) లకు ఎడిటర్ గా పనిచేశాడు.

మరణం

[మార్చు]

శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మధురైలోని ఒక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మాయండి 2015 ఫిబ్రవరి 24న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Veteran Freedom Fighter Mayandi Bharathi Passes Away". The New Indian Express. Archived from the original on 2020-10-31. Retrieved 2021-10-13.
  2. "Veteran journalists honoured". The Hindu. 2007-07-19. Archived from the original on 17 September 2007. Retrieved 2021-10-13.
  3. "Remembering Capt Lakshmi Sehgal's Madurai connect". The Times of India. Archived from the original on 24 June 2013. Retrieved 2021-10-13.
  4. "Ace freedom fighter Mayandi Bharathi dies". Times of India. Retrieved 2021-10-13.