మాయా మతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టికల్ వద్ద వైద్యం చేసే కర్మలో మాయ పూజారి

మాయా మతం. మెక్సికో, గ్వాటెమాలా మొదలైన సెంట్రల్‌ అమెరికా దేశాలలో క్రీస్తు శకం 200 నుంచి 900 సంవత్సరాల వరకు వర్ధిల్లిన ప్రాచీన మతాలలో ఒకటి ‘మాయా’. విగ్రహ పూజలు, బహుదేవతారాధన, దేవతలకు బలులు ఇవ్వడం తదితర ఆచారాలు అనేకం ఉన్నాయి. మంచి భవనాలను కట్టడంలో ఈ జాతికి అద్భుతమైన అనుభవం ఉన్నట్లు కనిపిస్తుంది. ఖగోళ విజ్ఞానం ఉన్నందు వల్ల తమ సంవత్సరాలూ, నెలలు, రోజుల లెక్కలను తమదైన పద్ధతిలో రూపొందించు కొన్నారు. 260 రోజుల కాల చక్రాన్ని ఏర్పరచుకొని, తమ పండుగలు పబ్బాలను అందుకు అనుగుణంగా నిర్ణయించుకొన్నారు. స్పెయిన్‌ ఆక్రమణకు పూర్వం అక్కడ వర్ధిల్లిన మతాలను, కొత్తగా వచ్చిన క్రైస్తవంతో కలుపుకొని, కలగాపులగం సంస్కృతిని పెంపొందించు కొన్నారు. ఉదాహరణకు కొండ గుహలలోనే నాగరికత మొదలైనదని విశ్వసించే అక్కడి ప్రజలు క్రైస్తవ పండుగలను కూడా గుహలలోనే జరుపుకోవడం కనిపిస్తుంది. అనేక దేవతల పేర్లు ఉన్నాయి. కాని తాము బహుదేవతా రాధకులమని వారు ఒప్పుకోరు. అన్ని దేవతా రూపాలు ఒక్క సర్వేశ్వరుడి రూపాలే అంటారు. ఒకప్పుడు మాయా మత సంప్రదాయంలో నర బలులు ఉండేవని, అందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయనీ అంటారు. ఇప్పుడు అవి లేక పోవచ్చునుగానీ, బలులు అనేవి ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మాయా_మతం&oldid=3255911" నుండి వెలికితీశారు