మారథాన్
Athletics మారథాన్ | |
---|---|
![]() 2013 ఏథెన్స్ మారథాన్ లో పాల్గొంటున్న పోటీదార్లు | |
Men's records | |
World | ![]() |
Olympic | ![]() |
Women's records | |
World | Mx: ![]() Wo: ![]() |
Olympic | ![]() |
మారథాన్ అనేది 42 కి.మీ 195 మీటర్ల[1] సుదీర్ఘ దూరం పరిగెత్తే పరుగు పందెం. ఇది సాధారణంగా రహదారుల మీద జరుగుతుంది. దీన్ని పూర్తి చేయడంలో పరుగు, ఇంకా నడకలు కూడా కలగలిసి ఉండవచ్చు. వీల్ ఛెయిర్ విభాగంలో కూడా ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 800కి పైగా మారథాన్ పోటీలు జరుగుతుంటాయి. పెద్ద మారథాన్ పోటీలలో వేలకొలదీ అథ్లెట్లు పాల్గొంటూ ఉంటారు.[2]
చరిత్ర
[మార్చు]మారథాన్ అనే పదం ఫైడిప్పిడీజ్ (Pheidippides) అనే గ్రీకు పురాణంలోని ఒక దూత పేరు మీదుగా వచ్చింది. సుమారు సా.శ.పూ 490, ఆగస్టు లేదా సెప్టెంబరులో మారథాన్ యుద్ధంలో [3] గ్రీకు సేనలు దాదాపు విజయానికి చేరువలో ఉండగా వార్తాహరుడు ఒక పర్షియన్ ఓడ ఏథెన్స్ వైపు మళ్ళడం గమనించాడు. పర్షియన్లు ఓడిపోతున్నా తామే గెలిచామని చెప్పుకుని నగరంలో ప్రవేశించి ధ్వంసం చేస్తారని అతను భావించాడు.[4] ఈ కథ ప్రకారం ఇతను యుద్ధం జరిగిన ప్రదేశం నుంచి ఏథెన్స్ వరకు ఏకబిగిన పరిగెత్తాడు. శరీరం మీద బరువు ఉండకూడదని, తన ఆయుధాలు, చివరకు వస్త్రాలు కూడా త్యజించి శక్తి కొద్దీ పరిగెత్తి రాజసభలో ప్రవేశించి మనమే గెలిచాము అనే సందేశాన్ని చేరవేసి వెంటనే కూలబడి ప్రాణాలు విడిచాడు.[5]
క్రీడాకారులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "IAAF Competition Rules for Road Races". International Association of Athletics Federations. 2009. Archived from the original on 23 September 2015. Retrieved 1 November 2010.
- ↑ "Marathons in history with >30,000 finishers". AIMS: World Running. Association of International Marathons and Distance Races. 11 July 2016. Archived from the original on 10 March 2017. Retrieved 21 March 2017.
- ↑ "Astronomers Unravel Marathon Mystery". Sky & Telescope. 19 July 2004. Archived from the original on 11 February 2017. Retrieved 21 March 2017.
- ↑ "Retreats — Athens". Jeffgalloway.com. Archived from the original on 1 June 2009. Retrieved 22 August 2009.
- ↑ "Ancient Olympics FAQ 10". Perseus.tufts.edu. Archived from the original on 20 July 2009. Retrieved 22 August 2009.