హ్యాండ్ సైకిల్
Appearance
హ్యాండ్ సైకిల్ అనేది మామూలు సైకిళ్ళలా కాళ్ళతో కాకుండా చేతులతో నడిపే సైకిల్. చాలా వరకు హ్యాండ్ సైకిళ్ళు వెనుక రెండు చక్రాలు, ముందు తిప్పగలిగిన ఒక చక్రం కలిపి మూడు చక్రాలు కలిగి ఉంటాయి.
చరిత్ర
[మార్చు]జర్మనీకి చెందిన స్టెఫాన్ ఫార్ఫ్లర్ అనే వాచ్‌మేకర్ 1655 లో మానవశక్తితో నడిచే ఒక వాహనం తయారు చేశాడు. అతను నడుము కింది భాగం చచ్చుబడిపోయిన వాడైనా,[1][2] కాళ్ళు కోల్పోయిన వాడయి ఉండవచ్చని భావిస్తున్నారు.[3]ఇతను సృష్టించిన ఆవిష్కరణే తర్వాతి ట్రై సైకిల్, బైసైకిల్ ఆవిష్కరణలకు దారితీసింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Jane Bidder, Inventions We Use to Go Places (London: Franklin Watts, 2006, 18)
- ↑ Rory A. Cooper, Hisaichi Ohnabe, and Douglas A. Hobson, An Introduction to Rehabilitation Engineering Boca Raton: CRC Press, 2007, 131
- ↑ Clive Richardson, Driving, the development and use of horse-drawn vehicles (B. T. Batsford, 1985, 136)
- ↑ "Medical Innovations - Wheelchair," Science Reporter, Volume 44, 2007, 397.