మార్కెటింగ్
Appearance
మార్కెటింగ్ అంటే వినియోగదారులను సంతృప్తి పరుస్తూ, తమతో వ్యాపారం కొనసాగించేలా చేసే పని.[1] వ్యాపార నిర్వహణ, వాణిజ్యంలో ఇది ఒక ముఖ్యమైన విభాగం.[2] మార్కెటింగ్ సాధారణంగా చిల్లర వర్తకులు, లేదా తయారీదారులు లాంటి విక్రేతలు నిర్వహిస్తారు. ఉత్పత్తులను ఒక వ్యాపారి నుంచి మరొక వ్యాపారి (B2B), లేదా వ్యాపారి నుంచి వినియోగదారులు (B2C) కొనుగోలు చేయవచ్చు. కొన్నిసార్లు ఈ మార్కెటింగ్ ను మీడియా సంస్థలు, మార్కెట్ రీసెర్చి సంస్థలు, లేదా ప్రకటనా సంస్థలకు అప్పజెప్పవచ్చు. కొన్నిసార్లు వాణిజ్య సంఘాలు, లేదా ప్రభుత్వ సంస్థలు (ఉదాహరణకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ) ఒక పరిశ్రమ తరపున లేదా ఒక ప్రాంతం తరఫున మార్కెటింగ్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే ఆహారం, ఒక పర్యాటక ప్రాంతం గురించి మార్కెటింగ్ చేయవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ "The Role of Customers in Marketing | Introduction to Business". courses.lumenlearning.com. Retrieved 11 August 2021.
- ↑ Drucker, Peter (1954). The Practice of Management. New York: Harper & Row. pp. 32.