Jump to content

మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్

వికీపీడియా నుండి
(మార్గదర్శి చిట్స్ నుండి దారిమార్పు చెందింది)

మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, అనే పేరుతో ఉన్న సంస్థ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్థిక లావాదేవీలతో వ్యవహరిస్తున్న ఒక చిట్ ఫండ్ కంపెనీ. రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్సి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు పనిచేస్తూ ప్రారంభించారు.ఈ సంస్థ రామోజీ గ్రూప్ లో ఒకటిగా నిర్వహింపబడుతుంది.[1]

యాజమాన్యం

[మార్చు]
రామోజీరావు

దీని వ్యవస్థాపకుడు జి జే రెడ్డి మరియు చెరుకూరి రామయ్య ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకుడు, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు.ఇతను కృష్ణా జిల్లా,పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16 న జన్మించాడు.చిట్ ఫండ్ వ్యవస్థను ఇంతకు ముందెన్నడూ ఎవ్వరూ చేయని విధంగా రాష్ట్రంలో చిట్ ఫండ్ల భావనకు మార్గదర్శకత్వం వహించిన ఘనత మార్గదర్శి సంస్థకు దక్కుతుంది.మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రామోజీరావు, శైలజాకిరణ్ చెరుకూరి.[2][1]

విస్తరణ, నిబద్దత

[మార్చు]

ఒకప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకే కాక, ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది.1962 లో మార్గదర్శి తెరిచినప్పుడు చిట్ ఫండ్స్ అనేది అంతగా జనాదరణకు నోచుకోలేదు.సంస్థ సమయం,అనుభవం గడిచేకొద్దీ ఈనాటికి ఒక ప్రసిద్ధ రూపంగా సంతరించుకుని మార్గదర్శి చిట్ ఫండ్ జనాదరణ పొందింది. ప్రజలు ఆదా చేయడానికి లాభదాయకంగా, ఆకస్మిక పరిస్థితులను తీర్చడానికి అనువైన మార్గంగా ఉన్నందున ప్రజలకు చాలా తక్కువ సమయంలో దగ్గరైంది.

ఆ తరువాత చిట్ ఫండ్ కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి.అలా ఏర్పడిన చాలా కంపెనీలు మార్గదర్శి నిర్వహణను అనుసరించాయి.మారుతున్న ఈ దృష్టాంతంలో మార్గదర్సి విలువలు, పనితీరు, నిజాయితీ, వృత్తిపరమైన సమగ్రత, అధిక నాణ్యత గల సేవలు, సంపూర్ణ ఆర్థిక క్రమశిక్షణ దాని నాయకత్వ స్థానాన్ని నిలుపుకోవడంలో సహాయపడ్డాయి.మార్గదర్శి సంవత్సరాలుగా ఊహించని రీతిలో వృద్ధిని సాధించింది.నేడు సంస్థలో 4,300 మంది ఉద్యోగులు పనిచేయుచున్నారు.వ్యాపార అభివృద్ధికి తోడ్పడే ఏజెంట్లు 16,015 మంది, బ్రాంచీలు 105, చిట్ చందాదారులు 3,11,146 మందికి పైగా ఉండి, రూ.11,206 కోట్లకు పైగా టర్నోవర్ సంస్థ కలిగి ఉంది.[1]

ప్రస్తుతస్థితి

[మార్చు]

పోద, మధ్యతరగతి, చిన్న పరిశ్రమల వారికి ఎంతో ప్రయోజనకరంగా 108 శాఖలతో, 3,80,000 సభ్యులతో 35,000 కోట్ల టర్నోవరుతో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో నడుస్తుందని తెలుస్తుంది. ఈ సంస్థ కార్యకలాపాల గురించి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

అరుదైన రికార్డు

[మార్చు]

ఈ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.10వేల కోట్లకు చేరి అరుదైన రికార్డు సాధించిన తొలి చిట్‌ ఫండ్‌ సంస్థగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లో వ్యాపారాన్ని విస్తృతం చేసి 2025 నాటికి రూ.20వేల కోట్ల లక్ష్యాన్ని చేరాలని నిర్దేశించుకున్నట్లు, 1995 నుంచి 26 రెట్ల వృద్ధిని సాధించినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజాకిరణ్‌ పేర్కొన్నది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "About Us". www.margadarsi.com. Retrieved 2020-07-04.
  2. "MARGADARSI CHIT FUND PRIVATE LIMITED - Company, directors and contact details | Zauba Corp". www.zaubacorp.com. Retrieved 2020-07-04.
  3. "మార్గదర్శి చిట్స్ అరుదైన రికార్డు - Kommineni News". kommineni.info. Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-04.

వెలుపలి లంకెలు

[మార్చు]