రామోజీ గ్రూప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రామోజీ గ్రూప్
పరిశ్రమమిశ్రమసంస్థ
స్థాపన1962
Foundersరామోజీ రావు
ప్రధాన కార్యాలయం,
Servicesమాస్ మీడియా, ఎంటర్టైన్మెంట్, చిత్ర నిర్మాణం, ఆర్థిక సేవలు, రిటైల్, విద్య, ఆతిథ్యము

రామోజీ గ్రూప్ అనగా రామోజీ రావు నేతృత్వంలోని మిశ్రమసంస్థ, ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ గ్రూప్ యొక్క వ్యాపారాలు టెలివిజన్, వార్తాపత్రిక మీడియా, చిత్ర నిర్మాణం, ఆర్థిక సేవలు, రిటైల్, విద్య, ఆతిథ్యాన్ని కవర్ చేస్తాయి. 1996 లో దీని వ్యాపారాలలో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలో అతిపెద్ద సినిమా స్టూడియోగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.

రామోజీ ఫిల్మ్ సిటీ[మార్చు]

రామోజీ పిలిం సిటి 2000 ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ( ఫిలింసిటీ) గా పేరుగాంచింది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశం గానూ పేరుగాంచింది.

ఈనాడు[మార్చు]

1974 ఆగస్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. అదే సంవత్సరం ఆగస్టు 28 తేదీన ఈ పత్రిక రిజిస్టర్ చేయబడింది. చాలా సాధారణంగా, ఏ ఆర్భాటాలు లేకుండా 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది.

ఈటీవీ నెట్వర్క్[మార్చు]

27-08-1995 న ఈటీవీ నెట్వర్క్ ప్రారంభమైంది. రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు దీనిని స్థాపించారు. దీనిని మొదట తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేయటానికి ప్రారంభించారు.

ఉషాకిరణ్ మూవీస్[మార్చు]

ఉషాకిరణ్ మూవీస్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ఈనాడు రామోజీరావు. ఇది 1983లో స్థాపించబడింది. ఇది తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ వంటి వివిధ భారతీయ భాషలలో 80 పైగా చిత్రాలను నిర్మించింది. ఇది మయూరి ద్వారా దాని సినిమాలు పంపిణీ చేస్తుంది.