మార్పు ఫౌండేషన్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
స్థాపన | 2019 |
---|---|
వ్యవస్థాపకులు | రఘు వంశీ |
రకం | స్వచ్ఛంద సంస్థ |
ప్రధాన కార్యాలయాలు | హైదరాబాద్ |
కార్యస్థానం | |
సేవా ప్రాంతాలు | తెలంగాణ |
జాలగూడు | https://www.marpu.org/ |
మార్పు ఫౌండేషన్ ఒక లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ 2001 ప్రకారం గుర్తించబడిన హైదరాబాద్ కి చెందిన సంస్థ. యువత సాధికారత, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ వంటి సామాజిక అంశాలపై మార్పు ఫౌండేషన్ పని చేస్తుంది.[1] ఇది ప్రైవేటు సంస్థలతో, వ్యక్తులతో కలిసి సామాజిక సేవ అంశాలపై దృష్టి సారిస్తుంది.[2]
పరిచయం
[మార్చు]"మార్పు" అనగా "పరివర్తన" అనే అర్థం వచ్చేటట్లు ఈ సంస్థకి నామకరణం చేయటం జరిగింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు రఘు వంశీ, ఐఐటి ఢిల్లీ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓ చేత ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో వంశీకి కర్మవీర్ చక్ర అవార్డు లభించింది.[3]
కార్యక్రమాలు
[మార్చు]ప్రాజెక్ట్ బేబీ ట్రీస్
[మార్చు]ప్రాజెక్ట్ బేబీ ట్రీస్ అనేది పర్యావరణ సంరక్షణ ఇంకా అవగాహన కోసం మొదలు పెట్ట బడింది.
విపత్తు నిర్వహణ
[మార్చు]విపత్తు నిర్వహణ కార్యక్రమాలలో భాగంగా మార్పు ఫౌండేషన్ కరోనా విపత్తు కాలంలో ప్రజా సేవ చేపట్టింది. కోవిడ్ మొదటి లాక్ డౌన్ సమయంలో 16000 మందికి బోజనాలను సమకూర్చింది.[4]
కార్పోరేటు సంస్థలతో
[మార్చు]అలాగే కార్పోరేటు సామాజిక బాధ్యతలో భాగంగా ఎస్ & పి గ్లోబల్ కలిసి గ్రామీణ తెలంగాణాలో విద్యుత్ దీపాలను సమకూర్చింది. టాటా కమ్యూనికేషన్స్ తో కలిసి పది వేయిల సీడ్ బాల్స్ ని పంపిణి చేసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Lockdown: Youngsters in Hyderabad take charge to help needy". The New Indian Express. Retrieved 2021-05-10.
- ↑ Kaleru, Vasavi (2020-10-11). "Power of five impacts thousands: Marpu and how!". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
- ↑ "ఈనాడు". Archived from the original on 2021-05-10. Retrieved 2021-05-10.
- ↑ "Be the Marpu: How this Hyderabad youth's NGO served 16,000 meals during the COVID lockdown". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
- ↑ "Be the Marpu: How this Hyderabad youth's NGO served 16,000 meals during the COVID lockdown". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.