మాలిన్నాంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాలిన్నాంగ్
గ్రామం
దేశంభారతదేశం India
రాష్ట్రంమేఘాలయ
జిల్లాతూర్పు ఖాసీ హిల్స్
బ్లాక్పైనూరుస్లా
Population
 (2019)
 • Total900
Time zoneUTC+5:30 (IST)
వాతావరణంతేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం

మాలిన్నాంగ్ ఈశాన్య భారతదేశం, మేఘాలయ రాష్ట్రం, తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని గ్రామం.[1] ఈ గ్రామం మాతృస్వామ్య కుటుంబ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పరిగణించబడుతుంది.[2] ఈ గ్రామం పైనూరుస్లా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, విధానసభ (శాసనసభ) నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.[3]

మాలిన్నాంగ్ లోని రహదారి

భౌగోళికం[మార్చు]

ఇది భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని షిల్లాంగ్‌కు దక్షిణాన 90 కి.మీ దూరంలో ఉంది.[4] కలైన్ "ది గేట్‌వే ఆఫ్ బరాక్ వ్యాలీ " నుండి 187 కి.మీ దూరంలో ఉంది.

గణాంకాలు[మార్చు]

2019 నాటికి, మాలిన్నాంగ్ లో 900 మంది జనాభా ఉన్నారు.[5] 2014 నాటికి, దాదాపు 95 గృహాలు ఉన్నాయి. ఇక్కడ అక్షరాస్యత రేటు 90%. ఇక్కడ నివసించే ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, తమలపాకు వీరి ప్రధాన పంట.[6] వీరు ఖాసీ తెగకు చెందిన ప్రజలు.[5] వేసవికాలంలో, పైనాపిల్స్, లిచ్చి పండ్లు పండిస్తారు. ఇక్కడ ఉన్న జనాభాలో ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు, గ్రామంలో మూడు చర్చిలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ప్రజలు ఇంగ్లీషులో మాట్లాడతారు, అరుదుగా స్థానిక భాషను మాట్లాడతారు. ఇక్కడ తోటలను 'గార్డెన్ ఆఫ్ గాడ్' అంటారు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను వెదురు బుట్టలో సేకరించి వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగిస్తారు. ఇక్కడి ప్రజలు పరిశుభ్రత కోసం పరిపాలన వ్యవస్థపై ఆధారపడరు.[7]

మాతృస్వామ్య సమాజం[మార్చు]

ఖాసీ ప్రజల సంప్రదాయం ప్రకారం, మాలిన్నాంగ్ లో ఆస్తి, సంపద తల్లి నుండి తన కుమార్తెలలో చిన్నవారికి బదిలీ చేయబడుతుంది, అక్కడ మహిళలకి తమ తల్లి ఇంటిపేరును తమ పేరు చివరన రాసుకుంటారు.[8][7]

పరిశుభ్రమైన గ్రామం[మార్చు]

మాలిన్నాంగ్ ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం. ఈ గ్రామం 2003లో అవార్డు పొందింది. [6] 

పారిశుధ్యం[మార్చు]

ఈ ఊరు పరిశుభ్రతకు ప్రసిద్ధి.[9] ఇక్కడ వ్యర్థాలను వెదురు బుట్టల్లో సేకరిస్తారు, వాటిని ఒక గొయ్యిలో వేసి తర్వాత ఎరువుగా మార్చి ఉపయోగిస్తారు.[6] ఇక్కడ ధూమపానం, పాలిథిన్ వాడకం నిషేధించబడింది, వర్షపు నీటిని నిల్వ చేస్తారు.[10] ట్రావెల్ మ్యాగజైన్ డిస్కవర్ ఇండియా ఈ గ్రామాన్ని 2003లో ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా, 2005లో భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ప్రకటించింది.[6] ఈ ఖ్యాతి స్థానిక పర్యాటక రంగాన్ని పెంచింది. 2017లో ఎన్పిఆర్ నివేదిక ప్రకారం, పెరిగిన పర్యాటకం కారణంగా ఆదాయం 60 శాతం పెరిగింది.[11]

మూలాలు[మార్చు]

  1. IAY Report for Financial year 2010-2011
  2. Choudhury, Samrat (2018-08-29). "A trip to Asia's 'cleanest village': Meghalaya's Mawlynnong". Mint. Retrieved 2019-07-09.
  3. Electoral roll of Pynurla (ST) constituency Archived 26 ఏప్రిల్ 2012 at the Wayback Machine, Election Department, Government of Meghalaya.
  4. Magical Mawlynnong Archived 4 మార్చి 2016 at the Wayback Machine, Meghalaya Tourism.
  5. 5.0 5.1 Nieves, Evelyn. "Girls Rule in an Indian Village" (Archive). The New York Times. 3 June 2015. Retrieved on 5 June 2015.
  6. 6.0 6.1 6.2 6.3 Eco Destination Archived 2011-12-09 at the Wayback Machine, Department of Tourism, Government of Meghalaya
  7. 7.0 7.1 Fezehai, Malin (8 August 2018). "A Village in India Where Clean Living Became a Tourist Attraction". New York Times. Retrieved 9 August 2018.
  8. "Where women of India rule the roost and men demand gender equality". The Guardian. 18 January 2011. Retrieved 6 June 2015.
  9. Mawlynnong - the cleanest village of Asia Archived 4 జూన్ 2016 at the Wayback Machine, India-north-east.com
  10. "A picture-perfect hamlet: Asia's cleanest village, Mawlynnong". The Economic Times. 26 May 2016. Retrieved 2016-11-09.
  11. "Welcome To 'The Cleanest Village In India'". NPR.org. Retrieved 24 December 2017.