Jump to content

తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా

వికీపీడియా నుండి
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా
ఖాసీ హిల్స్
మేఘాలయ పటంలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా స్థానం
మేఘాలయ పటంలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంషిల్లాంగ్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు7
విస్తీర్ణం
 • మొత్తం2,752 కి.మీ2 (1,063 చ. మై)
జనాభా
 (2011[1])
 • మొత్తం8,24,059
 • జనసాంద్రత300/కి.మీ2 (780/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత63.31%
 • లింగ నిష్పత్తి1008
ప్రధాన రహదార్లు44వ జాతీయ రహదారి, 40వ జాతీయ రహదారి
Websiteఅధికారిక జాలస్థలి

తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో ఒక జిల్లా ఒకటి. షిల్లాంగ్ జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,752 కి.మీ, జనసంఖ్య 824,059.2011 గణాంకాలను అనుసరించి మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో తూర్పు గారో హిల్స్ జిల్లా అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[2]

చరుత్ర

[మార్చు]

ఖాసీ హిల్స్ జిల్లాలో కొంత భూభాగం విభజించి రూపుదిద్దబడింది. 1976 అక్టోబరు 28న ఖాసీ హిల్స్ జిల్లా తూర్పు ఖాసీ, పశ్చిమ ఖాసీ జిల్లాలుగా విభజించబడింది. తూర్పు ఖాసీ జిల్లా అదనంగా తూర్పు ఖాసీ, రి-భోయ్ జిల్లాలుగా విభజించబడ్డాయి.

భౌగోళికం

[మార్చు]

తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాకు షిల్లాంగ్ కేంద్రంగా ఉంది. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా మేఘాలయ రాష్ట్రానికి మద్యభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 2,748 చ.కి.మీ ఉంటుంది. జిల్లా 25°07” & 25°41” ఉత్తర అక్షాంశం, 91°21” & 92°09” తూర్పు రేఖాంశంలో ఉపస్థితమై ఉంది.

జిల్లా ఉత్తర సరిహద్దులో రి-భోయి మైదానాలు మొదలై క్రమంగా షిల్లాంగ్ పచ్చికబైళ్ళ వైపు సాగిపోతూ నదీ లోయలో కలిసిపోతుంది. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా దక్షిణ ప్రాంతంలో అత్యధికంగా కొండలతో సన్నని దారులు, కనుమలతో నిండి ఉంటుంది. జిల్లా తూర్పు సరిహద్దులో జంతీ హిల్స్ జిల్లా, పడమర సరిహద్దులో పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా ఉన్నాయి.

జిల్లా నైసర్గిక పరిస్థితిలో నదీ లోయలతో కలిసిపోయిన షిల్లాంగ్ మైదానం ప్రధానమైనదిగా భావించవచ్చు. అలాగే షెల్లా భోలాగంజ్, కమ్యూనిటీ, రూరల్ డెవలెప్మెంటు బ్లాక్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటుంది. నగరానికి 10 కి.మీ దూరంలో షిల్లాంగ్ శిఖరం ఉంటుంది. పల్లెసీమల అందాలతో కూడిన ఎత్తైన పర్వతప్రాంతాలు ప్రకృతి సహజ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ దృశ్యాలు రాష్ట్రానికంతటికీ గుర్తింపు తీసుకువచ్చాయి.

వాతావరణం

[మార్చు]

జిల్లా వాతావరణం పీఠభూమి ప్రాంతంలోని సమశీతోష్ణ ప్రాంతం నుండి ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో వెచ్చని ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల వాతావరణం మార్పులుతో ఉంటుంది. జిల్లా మొత్తం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణంగా మే నుండి ప్రారంభమై సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. సాధారణంగా డిసెంబరు, మార్చి మధ్య పొడి వాతావరణఁ మినహా సంవత్సరంలో ఎక్కువ భాగం వాతావరణం తేమగా ఉంటుంది.

విభాగాలు

[మార్చు]

నిర్వహణావిభాగాలు

[మార్చు]

తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా 8 ఉపవిభాగాలుగా విభజించబడింది.[3]

పేరు ప్రధానకార్యాలయం జనసంఖ్య ప్రాంతం
ఖతర్షనంగ్ లైత్‌క్రొ మాజ్రంగ్
మాకింర్యూ మాకింర్యూ
మాఫ్లాంగ్ మాఫ్లాంగ్
మారింగ్‌క్నెంగ్ మారింగ్‌క్నెంగ్
మాసింరం మాసింరం
మిల్లియం Mylliem మిల్లియం
పింసుర్‌స్ల పింసుర్‌స్ల
షెల్లా భోలఘని చిరపుంజి

గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 824,059,[2]
ఇది దాదాపు... కొమరోస్ జనసంఖ్యకు [4]
అమెరికాలోని సౌత్ డకోటా [5]
640 భారతదేశ జిల్లాలలో 478 వ స్థానంలో ఉంది [2]
1చ.కి.మీ జనసాంద్రత 292 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 24.68%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి 1008:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే అత్యధికం
అక్షరాస్యత శాతం 84.7%.[2]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

సంస్కృతి

[మార్చు]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
  • షిల్లాంగ్ ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాకు కేంద్రంగా ఉంది. అంతే కాక ప్రకృతి సౌందర్యంతో అలరారే షిల్లాంగ్‌లో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.
  • చిరపుంజి ఒకప్పుడు ఇది అత్యంత పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రాంతంగా ఉండేది.
  • నాహ్‌కలికై జలపాతం చిరపుంజి వద్ద ఉన్న ఈ జలపాతం భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతంగా గుర్తించబడింది.
  • నాహ్స్ంగిథియాంగ్ జలపాతం
  • కింరెం జలపాతం
  • ఉమియం సరసు షిల్లాంగ్ మార్గంలో ఉన్న అతిసుందరమైన సరసు.
  • " మాలీనాంగ్ " గ్రామం పింసుర్లా బ్లాక్ సమీపంలో ఉన్న ఈ గ్రామం పరిశుద్ధతకు ప్రత్యేకత సంతరించుకుంది. పర్యాటక పత్రిక అయిన " డిస్కవరీ ఆఫ్ ఇండియా " ఈ గ్రామాన్ని

2013లో ఆసియాలో అత్యంత పరిశుద్ధమైన గ్రామంగా పేర్కొన్నారు. అలాగే 2005లో భారతదేశంలో అత్యంత పరిశుద్ధమైన గ్రామంగా కూడా గుర్తించబడింది. [6]

ప్రయాణవసతులు

[మార్చు]

జిల్లా కేంద్రం, మేఘాలయ రాష్ట్ర రాజధాని అయిన షిల్లాంగ్ జాతీయ రహదారి 44 మర్గంలో గౌహతి, సిచార్ నగరాలతో అనుసంధానించబడి ఉంది. సమీపంలోని రైల్వే స్టేషను, విమానాశ్రయం గౌహతీ నగరంలో ఉన్నాయి. షిల్లాంగ్‌కు 35 కి.మీ దూరంలో ఉన్న ఉంరోయిలో చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ నిలవడామికి అవసరమైన ఎయిర్‌స్ట్రిప్ ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు ఇతర సామాగ్రి జీబులు, ట్రాక్టర్లు, ట్రక్కులలో రవాణాచేయబడుతుంటాయి. షిల్లాంగ్ రాష్ట్రంలోని ఇతర భూభాగాలతో ఆటో వాహనాల రాకపోకలకు అనువైన చక్కగా అనుసంధానించబడుతుంది. అలాగే జిల్లాలోని అన్ని బ్లాకుల కేద్రాలు కూడా రహదారి మార్గాలతో అనుసంధానించబడి ఉన్నాయి. అయినప్పటికీ సుదూరప్రాంతాలలో ఉన్న గ్రామాలకు రాకపోకల మార్గాలు దీనావస్థలో ఉన్నాయి. అలాగే చాలినంత రవాణా వసతులు కూడా లేవు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-08. Retrieved 2014-03-11.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. Meghalaya Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.{{cite map}}: CS1 maint: unrecognized language (link)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Comoros 794,683 July 2011 est. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. South Dakota 814,180
  6. Eco Destination Archived 2011-12-09 at the Wayback Machine, Department of Tourism, Government of Meghalaya

వెలుపలి లింకులు

[మార్చు]