పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా

జైంతియా
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంజోవై
ప్రభుత్వం
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం1,693 కి.మీ2 (654 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం2,70,352
 • సాంద్రత160/కి.మీ2 (410/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత53%
ప్రధాన రహదార్లు44వ జాతీయ రహదారి, 40వ జాతీయ రహదారి
జాలస్థలిఅధికారిక జాలస్థలి

పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. 3,819 చ.కి.మీ వైశాల్యం ఉన్న యునైటెడ్ జిల్లా 1972 ఫిబ్రవరి 22 న స్థాపించబడింది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 295,692. మేఘాలయకు చెందిన ఉప ఉష్ణమండల అరణ్యాలలో ఉంది. 2012 జూలై 31న జంతియా హిల్స్ తూర్పు జైంతియా హిల్స్ జిల్లా, పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలుగా విభజించబడింది. జోవై పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జోవైలో అన్ని ప్రభుత్వభవనాలు, విద్యాసంస్థలు, హాస్పిటల్స్, బ్యాంకులు ఉన్నాయి.[1]

భౌగోళికం[మార్చు]

పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా వైశాల్యం 1693 చ.కి.మీ. అమల్రెం సివిల్ సబ్ డివిషన్‌ను, 3 కంతూనిటీ, 3 రూరల్ డెవలెప్మెంట్ బ్లాకులను (అమల్రెం, లస్కెయిన్, తండలస్కెయిన్) కలిపి పశ్చిమ జెంతీహిల్స్ జిల్లాగా రూపొందించబడింది.

[2]

ఆర్ధికం[మార్చు]

పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో వ్యవసాయం ప్రధాన ఆదాయవనరుగా ఉన్నప్పటికీ జిల్లాలో లైస్టోన్ విస్తారంగా ఉన్న కారణంగా పలు జిల్లాలో సిమెంటు కంపనీలు స్థాపినబడ్డాయి. తూర్పు జైంతియా హిల్స్ జిల్లా లో " ల్యాడ్ రింబై " వద్ద బొగ్గు గనులు కూడా జిల్లా ఆదాయవనరులలో ఒకటిగా భావించవచ్చు. ఇక్కడ గనులలో లభ్యమౌతున్న బొగ్గును బంగ్లాదేశ్, అస్సాంకు ఎగుమతి చేయబడుతుంది. బొగ్గుగనులలో అనేకం తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

నిర్వహణా విభాగాలు[మార్చు]

యునైటెడ్ జైంతియా హిల్స్ జిల్లాను 5 బ్లాకులుగా విభజించారు. రెండు జిల్లాలుగా విభజించిన తరువాత పశ్చిమ జంతియా హిల్స్ జిల్లాను 3 విభాగాలుగా విభజించారు. [3]

పేరు ప్రధానకార్యాలయాలు జనసంఖ్య ప్రాంతం
అమల్రెం అమల్రెం
Jaintia Hills Subdivisions Amlarem.png
లస్కెయిన్ లస్కెయిన్
Jaintia Hills Subdivisions Laskein.png
తందల్స్కెయిన్ తండల్స్కెయిన్
Jaintia Hills Subdivisions Thadlaskein.png

తూర్పు జెంతీ హిల్స్ జిల్లా 2 బ్లాకులుగా విభజించారు.

పేరు ప్రధానకార్యాలయాలు జనసంఖ్య ప్రాంతం
ఖ్లెహ్రియత్ ఖ్లెహ్రియత్
Jaintia Hills Subdivisions Khliehriat.png
సాయ్పంగ్ సాయిపంగ్
Jaintia Hills Subdivisions Saipung.png

ప్రయాణవసతులు[మార్చు]

భూ అంతర్గత జిల్లా అయిన పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో రైల్వే, వాయుమార్గాల ద్వారా ప్రయాణం సాధ్యం కానప్పటికీ జిల్లాగుండా పయనిస్తున్న " జాతీయరహదారి 40 " ప్రయాణవసతులు కల్పిస్తుంది.

గణాంకాలు[మార్చు]

పశ్చిమ జైంతియా జిల్లా జనసంఖ్య 2,70,352.వీరిలో 1,34,406, స్త్రీలు 1,35,946. అలాగే జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు 159.69

భాషలు[మార్చు]

పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో సాధారణంగా ఖాశీభాషకు చెందిన ప్నార్ భాషను మాట్లాడుతూ ఉంటారు. జిల్లాలోని దక్షిణప్రాంతంలో, హ్మర్/బయాటే ప్రాంతంలో దాదాపు 20,000 మంది బయాటే గిరిజనప్రజలు వార్ జంతియా భాషను మాట్లాడుతుంటారు.[4] తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని సుత్నగా ఎల్కాలో నివసిస్తుంటారు. బయాటే గిరిజన ప్రజలు దాదాపు మిజో గిరిజన ప్రజలమాదిరిగా ఉంటారు. అలాగే భాష కూడా మిజో భాషకు చాలా సమీపంలో ఉంటుంది. అంతే కాక వస్త్రధారణ కూడా మిజో ప్రజల వద్త్రధారణలా ఉంటుంది. 1976 లో కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ద్స్ యాక్ట్, 1987 ది కాంస్టిట్యూషన్ (షేడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (అమెండ్మెంట్) చట్టం అనుసరించి బయాటే ప్రజలు కుకీ ట్రైబల్ జాతులలో ఒకరుగా గుర్తించబడ్డారు.

సంస్కృతి[మార్చు]

పర్యాటక ప్రదేశాలు[మార్చు]

పశ్చిమ జైంతియా హిల్స్ ప్రకృతిసహజ సౌందర్యానికి పుట్టినిల్లు. జిల్లాలో ఉన్న కొన్ని పర్యాటక ఆసక్తికర ప్రదేశాలు వరుసగా:

 • " నార్టియాంగ్‌లో మొనోలిత్ " [5] - ఇది ప్రపంచంలో ఎత్తైన మొనోలిత్‌గా (ఏకశిలా ఖండం) గుర్తింపు పొందింది.
 • జోవై: జాతీయ రహదారికి 64కిమీ దూరంలో ప్రకృతిసహజ సౌందర్యానికి ఆలవాలమై ఉన్న పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా కేంద్రమైన జోవైలో " మైండ్యూ " నది సౌందర్యం మనోహరంగా ఉంటుంది.
 • " తండ్లాస్కెయిన్ సరసు" జాతీయరహదారిలో షిల్లాంగ్‌కు 56 కి.మీ దూరంలో ఉన్న తండ్లాస్కెయిన్ సరసు వెనుక ఒక కథ ఉంది. జైంతియా రాజా తిరుగుబాటు జనరల్ " ఉసజియార్ నైంగ్లి " యొక్క 290 మంది మద్దతుదార్లు మహత్తర త్యాగం చేసిన దేశభక్తుల ఙాపకార్ధం ఈ సరసును నిర్మించారని చాతిత్రక కథనాలు తెలియజేస్తున్నాయి.
 • " మెజెస్టిక్ రెమ్నెంట్స్ - నార్టియాంగ్ " :- షిల్లాంగ్ నుండి 65 కి.మీ దూరంలో ఉన్న మెజెస్టిక్ రెమ్నెంట్స్ - నార్టియాంగ్ జైంతియా రాజులకు వేసవి విడిదిగా ఉండేది. నార్టియాంగ్ గ్రామానికి చిహ్నాలుగా

బ్రహ్మాండమైన ఏకశిలా ఖండాలు దర్శనమిస్తుంటాయి. " నార్టియార్ మెంహిర్ " మందం 27 అడుగుల 6 అంగుళాలు ఉంటుంది.

 • సిండై :- పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని ముఖ్యమైన గ్రామం సున్నపు రాళ్ళతో నిండిన అనేక గుహలు, అతి పెద్ద గుహ ఉన్నాయి. జైంతియా రాజుల మీద విదేశీ రాజులు దాడి చేసిన సమయంలో

ఈ గుహలు మరుగు ప్రదేశాలుగా ఉపయోగపడ్డాయి.

 • సింటూ క్సియార్ :- సింటూ క్సియార్ అంటే బంగారు పుష్పం అని అర్ధం. జోవైని చుట్టి ప్రవహిస్తున్న మైండ్యూ నదీ జలాలు ఈ ప్రశాంతమైన బృహత్తర మడుగును సృషించాయి.

విద్య[మార్చు]

పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాకు విద్యాకేంద్రంగా గుర్తింపు ఉంది. జోవై, ఖ్లెయాహ్రియత్‌లలో ఉన్నతప్రమాణాలు కలిగిన పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో జోవై పాలిటెక్నిక్, ప్రముఖ నర్సింగ్ శిక్షణా కేంద్రం" డాక్టర్ టన్నెల్ హాస్పిటల్ స్కూల్ " (జిల్లాలో ఒకేఒకటి), థోమస్ జూనియర్ కాలేజ్, " కియాంగ్‌నంగ్భా గవర్నమెంట్ కాలేజ్; జోవై " ఉన్నాయి. ఇక్కడ ఆర్ట్స్, సైన్సు లలో డిగ్రీ కోర్సులు చదవడానికి అవకాశం ఉంది. సెకండరీ, హైయ్యర్ సెకండరీ విద్యను అభ్యదించడానికి జోవైలో పలు పాఠశాలలు ఉన్నాయి.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. http://jaintia.nic.in/index.htm[permanent dead link]
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-28. Retrieved 2014-05-21.
 3. The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India (2011) (in English) (PDF). Meghalaya Administrative Divisions (Map). http://censusindia.gov.in/2011census/maps/administrative_maps/MEGHALAYA.pdf. Retrieved 2011-09-29. 
 4. M. Paul Lewis, ed. (2009). "Biete: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30. {{cite encyclopedia}}: |edition= has extra text (help)
 5. "Tallest Monolith". 2009-02-17. Archived from the original on 2014-03-30. Retrieved 2014-05-21.

వెలుపలి లింకులు[మార్చు]


అక్షాంశ రేఖాంశాలు: 25°27′N 92°12′E / 25.450°N 92.200°E / 25.450; 92.200