తూర్పు గారో హిల్స్ జిల్లా
తూర్పు గారో హిల్స్ జిల్లా
గారో హిల్స్ | |
---|---|
![]() మేఘాలయ పటంలో తూర్పు గారో హిల్స్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | విలియమ్‌నగర్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
Area | |
• మొత్తం | 2,603 km2 (1,005 sq mi) |
Population (2001) | |
• మొత్తం | 2,47,555 |
• Density | 95/km2 (250/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53% |
Website | అధికారిక జాలస్థలి |
తూర్పు గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో ఒక జిల్లా ఒకటి. దీని ముఖ్య పట్టణం విలియమ్‌నగర్.
చరిత్ర[మార్చు]
తూర్పు గారో హిల్స్ జిల్లా 1976లో రూపుదిద్దుకుంది. జిల్లాకేంద్రంగా విలియం నగర్ ఉంది. విలియంసన్ ఏ సంగ్మా ఙాపకార్ధం ఈ ఊరికి ఈ పేరు పెట్టబడింది.మేఘాలయ రాష్ట్రానికి విలియంసన్ ఏ సంగ్మా మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విలియం నగర్ సింసగ్రే వద్ద ఉన్న విశాలమైన సోమేశ్వరి నదీ మైదానాలలో ఉపస్థితమై ఉంది. 1837లో బ్రిటిష్ సైన్యాలను ఎదిరించి గారో ప్రజలు ఆఖరిపోరాటం సాగించిన భూమి ఈ మైదానాలే. 1837 డిసెంబరు 12 న విలియం నగరుకు 12 కి.మీ సమీపంలో ఉన్న స్కిర్‌మిష్‌లో బ్రిటిష్ సైన్యాల దాటికి గారో నాయకుడు పా టోగన్ నెంగ్మింజ సంగ్మ " మరణానికి గురైన చాతిత్రాత్మక సంఘటన జరిగింది.
భౌగోళికం[మార్చు]
జిల్లా ప్రధానకార్యాలయం విలియం నగరులో ఉంది. జిల్లావైశాల్యం 2,603చ.కి.మీ.
విభాగాలు[మార్చు]
లోక్‌సభ[మార్చు]
తూర్పు గారో హిల్స్ జిల్లా పుర్నో అజితక్ సంగ్మతో చేర్చి 1975 నుండి తురా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. గత యూనియన్ మినిస్టర్ , 11 వ లోకసభలో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేకత సాధించుకున్న " పుర్నో అజితక్ సంగ్మ " ఇక్కడి నుండే ఎన్నిక చెయ్యబడ్డాడు.
నిర్వహణా విభాగాలు[మార్చు]
తూర్పు గారో హిల్స్ విభాగం 5 ఉపవిభాగాలుగా విభజించబడింది.[1]
పేరు | ప్రధానకార్యాలయం | జనసంఖ్య | ప్రాంతం |
డంబో రంగ్‌జంగ్ | రంగ్‌జంగ్ | ![]() | |
ఖర్‌కుట్ట Kharkutta | ఖర్‌కుట్ట | ![]() | |
రెసుబెల్‌పరా | రెసుబెల్‌పరా | ![]() | |
సమంద | సమంద | ![]() | |
సాంగ్‌సక్ | సాంగ్‌సక్ | ![]() |
గణాంకాలు[మార్చు]
2011 గణాంకాలను అనుసరించి తూర్పుగారియో జిల్లా జనసంఖ్య 317,618.[2] ఇది దాదాపు బహ్మా దేశ జనసంఖ్యకు సమం. [3] భారతీయ జిల్లాలలో ఈ జిల్లా 569వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చ.కి.మీకి 122.[2] 2001-2011 గణాంకాలను అనుసరించి కుటుంబనియంత్రణ పెరుగుదల శాతం 26.75%.[2] తూర్పు గారీ హిల్స్ జిల్లాలో స్త్రీ:పురుషుల నిష్పత్తి 968:1000.[2] అలాగే అక్షరాస్యత శాతం 75.51%.[2]
భాషలు[మార్చు]
తూర్పు గారో హిల్స్ జిల్లాలో తాంగ్, టిబెటో-బర్మన్ భాషలను భారతదేశం, బంగ్లాదేశ్ లలో దాదాపు 10,000 ప్రజలు మాట్లాడుతుంటారు.[4]
వృక్షజాలం , జంతుజాలం[మార్చు]
1980 తూర్పు గరో హిల్స్ జిల్లా, దాని సోదరి జిల్లాలైన సౌత్ గరో హిల్స్, వెస్ట్ గారీ హిల్స్ జిల్లాలు " నాక్రెక్ నేషనల్ పార్క్ "కు పుట్టినిల్లు అయింది. ఈ పార్క్ వైశాల్యం 47చ.కి.మీ.[5]
మూలాలు[మార్చు]
- ↑ Meghalaya Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.
{{cite map}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Bahamas, The 313,312
- ↑ M. Paul Lewis, ed. (2009). "A'Tong: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Meghalaya". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
వెలుపలి లింకులు[మార్చు]
